28, ఏప్రిల్ 2013, ఆదివారం

కెమెరామెన్ గంగ తో రాంబాబు - జగన్ కధ

పూరీ జగన్ దర్శకత్వం  వహించిన సిన్మా జగన్ కధ కాక త్రివిక్రమ్ కధ  అవుతుందా  అని అనుమానం వచ్చిందా మీకు?  అయితే మీకు జ్ఞాన పీఠం  వచ్చేసినట్లే .

వై ఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫ్లైట్ ఆక్సిడెంట్ లో మరణించిన కొద్ది రోజులకే ఆయన పై సినిమా ని పూరి జగన్ దర్సకత్వం లో ప్లాన్ చేసినట్లుగా హడావిడి చేశారు . మొత్తానికి ముహూర్తం పెట్టడమే తరవాయి అని ప్రచారం కూడా జరిగింది . అప్పట్లో కాస్త దర్శకుడికి సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ కోసం తయారు చేసుకొన్న ముడిసరుకు అలా ఉండిపోయి ఉంటుంది . అదే  కెమెరామెన్ గంగ తో రాంబాబు కి మూల కధ అనుకోవచ్చు. సినిమా చూస్తున్నంత సేపు పూరీ జగన్ వై ఎస్ కుటుంబ అభిమాని కాదా అని బోలెడు ఆశ్చర్యం వేసింది. కేవలం దర్శకుడిగా మాత్రమె కొడుకు జగన్ కి సిన్మా చేస్తానన్నాడా?

గబ్బర్సింగ్ చూసాక పవన్ సిన్మాలంటే చిరాకేసింది . అందుకే ఇప్పటి వరకు ఈ సిన్మా వైపు కూడా చూడలేదు .కాని మన తిరుట్టు వెబ్ సైట్ లో ఇంతకూ మించిన సిన్మా దొరక్క చూడాల్సి వచ్చింది .  ఒకేసారి చూడ్డం  కాస్త కష్టం ఏమో. అదీ కాక ఎంటర్తైన్మెంట్ కోసం సిన్మా అంటే ఇది నచ్చకపోవచ్చు . నాకు మాత్రం చాలా నచ్చింది . మొత్తం పూరిజగను విశ్వరూపం చూపించేసాడు, డైలాగ్స్ వ్రాయడం లోను అవి ఆయా పాత్రలతో చెప్పించడం తోనూ.

సిన్మా లో రాజకీయ పాత్రల పేర్లు చూసి చంద్రబాబు నాయుడు కధలో ఉన్నాడను కొంటే  మళ్ళీ పప్పులో కాలేసినట్లే.
రెడ్డి పేరు పెట్టినంత మాత్రాన , పాద యాత్ర చేసినంత మాత్రం తో ముఖ్య మంత్రి గా వై ఎస్ ని, కేవలం నాయుడు అన్న పేరుతొ ప్రతి పక్ష నాయకుడిని ఊహించుకోవడం చాలా హాస్యాస్పదం . రెండు టర్మ్స్ ముఖ్యమంత్రిగా చేసింది కేవలం చంద్రబాబే కాదు , వై ఎస్ కూడా :)

ఇంతకీ చెప్పొచ్చేదేమంటే అక్కడ నాయకుడు, ప్రతినాయకుడు ఒకే వ్యక్తి కధ  నుండి వచ్చారు . ఇద్దరూ వై ఎస్ గారి కధలోని రెండు కోణాలు .  సమకాలీన రాజకీయ అంశాలు సినిమా కధగా పెట్టినపుడు కాస్త కాచీ గా ఉండే పేర్లు వాడడం , అదీ డైరెక్టు ఇది పలానా ముఖ్యమంత్రి పాత్ర అని స్పష్టంగా అర్ధం కాకుండా ఉండేందుకు పూరి జగన్ చేసిన ప్రయోగం చక్కగా ఫలించింది. ఇంకా తండ్రి చనిపోక ముందే కొడుకు జైలు సీన్ రావడం ముఖ్య మంత్రి అయిపోతాడు అని ప్రచారం జరగడం అలా మనకి తెలిసిన వరుసలో కాకున్నా జగన్ రాజకీయ జీవిత ఘట్టాలన్నీ మనకళ్ళముందు జరిగిపోతూ ఉంటాయి . మనం ఊహించని మలుపులు తో ఆశ్చర్య పరుస్తాయి . ఒక సారి తెలుగు తల్లి ఇంటర్వ్యూ  తోనూ , ఇంకొకసారి టీవీ లో ఆవేశపూరిత  ఉపన్యాసంతో జనం అందరినీ కదిలించడం చాలా బావున్నాయి 

రాజకీయం పక్కన పెడితే , మనోభావాలు దెబ్బ తీసుకొనే ప్రేక్షకులకొసమ్ గుడ్డి వారి పై వేసిన సెటైర్ అదుర్స్. ఇంకా సిన్మా ను వెయ్యిప్రింట్లు వేసి హడావిడిగా డబ్బు చేసికొంటున్న నిర్మాతల్నీ వదల్లేదు . ఇక బ్రహ్మానందం పాత్ర నయితే చాలా ఎంజాయ్ చెయ్యొచ్చు .  తమన్నా మొదటి సారి అమ్మాయిగా నటించింది , అందాల బొమ్మ  గా కాకుండా . తను ఎలాంటి అమ్మాయో చెప్పడం సరదాగా ఉంటుంది . ఆర్డినరీ అమ్మాయిల గురించి  దర్శక జగన్ మాటలు పవన్ డైలాగులలో  చక్కగా పేలాయి .

సుజాత గారు దేశభక్తి సిన్మాల పై వ్రాసిన ఎఫ్ఫెక్ట్ ఈ రాష్ట్ర భక్తి  సినిమా  రివ్యు  నేను వ్రాస్తే వస్తుందా , అయినా పర్లేదు సిన్మా నాకు బాగా నచ్చింది  ఽది పంచుకోవడానికే ఈ బుల్లి టపా అన్నమాట. అవార్డ్ రావాల్సిన సిన్మా , నేను బాగుంది అన్నాక ఏ సిన్మా అయినా ఆడిందా అని అసలు :) ఒక ఆరెంజ్ , ఒక మొగుడు, ఒక కెమెరామెన్ :)  పబ్లిక్ కి నచ్చవ్  :)వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి