మొదట గా సినిమా పేరు విషయం కొస్తే సినిమా విడుదలయ్యాక జనం చూసి అసహ్యంతోనో, ఆదరం తోనో దానికి పెట్టుకునే ముద్దు పేరునే సినిమా పేరు గా పెట్టి, సగం విజయం ముందే సొంతం చేసికొన్నారు. కాబట్టి మహిళలో, విమర్సకులో ప్రశ్నించే అవకాసం లేదు. సిల్క్ స్మిత జీవిత చరిత్ర లో విద్యాబాలన్ నటించడమా, స్మిత జీవితం ధన్యమైనట్టే!!! ఇదీ మొదటివార్త చూసినపుడు కలిగిన అభిప్రాయం. పోస్టర్స్ చూసాక, ఒక నటి జీవితాన్ని చులకన చేసారేమో అన్న సంశయం. కాస్త కోపం కుడా వచ్చింది ఆ చిత్ర నిర్మాతలపై!!!. కానైతే ఎంత మందికి ఒకప్పటి నటి సిల్క్ స్మిత పై ఆమె జీవించి ఉండగా ఇప్పుడున్నంత అభిమానం ఉన్నది? ఇప్పుడింత మంది అభిమానులు హటాత్తు గా వచ్చారా? లేక వీళ్ళంతా మమైత్ ఖాన్,తదితరులనిని కూడా ఇంతే ప్రేమతో ఆదరిస్తున్నారా????
సినిమా చూసాక ఈ అభిప్రాయాలు పంచుకోవాలనే ఆసక్తి ఉన్నా, తెలుగు బ్లాగుల్లో సిల్క్ స్మిత కో, ఏక్తా కపూర్ కో కృష్ణవంశీ , బాపు వంటి వారికి ఉన్నంత అభిమాన దురభిమానులు లేనందువల్ల బ్లాగ్లోకం లోని గొప్ప సినీ విశ్లేషకులంతా మౌనం వహించారు. అదుగో అప్పుడే జగద్దాత్రి గారు ద డర్టీ పిక్చర్ (నా ఆవేదన) అనే చాల చక్కని వ్యాసం అందించారు. వారు స్వయం గా రచయిత్రి , చక్కని ప్రమాణాలతో వారి అబిప్రాయాన్ని అందించి చివరిగా, " ఏమి మిత్రులారా నా ఆవేదనకీ అర్ధం లేదంటారా? మీకు ఈ వేదన కలగలేదంటారా?" అని అడగారు కాని, అడగకున్నా నా సమాధానం వారి ప్రయత్నాన్ని గౌరవించడానికి అయినా వ్రాయాలి. నా అభిప్రాయం తెలియచేయడానికి ఒక వేదిక కల్పించిన జగద్దాత్రి గారికి ధన్యవాదాలు.
అసలు ఈ సినిమా చూసే ధైర్యం చెయ్యడానికి కారణం పాసిటివ్ రివ్యూలు. అవన్నీ నూటికి నూరుపాళ్ళు నిజం అని చెప్పాలి. కాబట్టి వారికి ధన్యవాదములు. కధ ఒక వర్గాన్ని, సమాజాన్ని దగ్గరగా చూపిస్తుంది. వ్యాసరచయిత జగద్దాత్రిగారు
"సినీ నటి కావాలనే అభిలాష కలిగిన ఒక స్త్రీ ఎన్నో విధాలుగా ఇలా వాడుకోబడటం అన్నది చాల పెద్ద పెద్ద వాళ్ల విషయాల్లోనే జరిగింది అన్నది వాస్తవమే. "
అని చెప్పాక సినిమాలో సిల్క్ అన్న పేరు ఒక రిఫరెన్స్ మాత్రమె కాని, ఆ పెద్ద నటీ మణులకి కూడా కధలో చోటు ఉందనిపించక మానదు. అదే సమయం లో వారిని చులకన చేయడం నా ఉద్దేశ్యం ఏమాత్రం కాదు.
నేటి యువతకు దర్శక నిర్మాతలు ఏమి చెపుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. కాని సమాజం, యువత సినీ దర్శక నిర్మాతలకు ఏమి చెపుతున్నది అన్న ప్రశ్నకు కూడా భాగం ఉంది. ఇది కేవలం డబ్బుకోసం మాత్రమె తీసిన సినిమా గా చూడబడితే, మరోకోణం లో ఇప్పడు వస్తున్న,మనం చూస్తున్న సినిమా లన్నింటికి ఒక ఆత్మవిమర్శ గా నిలబడ గల సత్తా కూడా ఉంది.
సినిమాలో విద్య బాలన్ పాత్ర బాగానే నటించినప్పటికీ మొదట్లో ఆమె ఆలోచన ధోరణి నే అసహ్యకరంగా చూపించారు అన్నారు. ఉహూ అదే సమయంలో ఆమె ఖచ్చితత్వాన్ని కూడా చూపారు. ఒక అభ్యంతరకరమైన ధోరణి సమాజం లో చెప్పుకోదగ్గ శాతం యువత లో ఇప్పటికే ప్రదర్సించబడుతు ఉన్నది. మన చుట్టూ ఇలాంటి వాతావరణానికి ఎప్పుడో అలవాటుపడిపోయామే, మరి చిత్రం గురించి ప్రశ్నించేది ఎలా ?
వాల్ పోస్టర్స్ కూడా సినిమాలోవే అయినా కళాత్మకం గా ఉంటె బాగుండేది. కాని అవయినా చూడడానికి తపించిపోయిన సమాజానికి కూడా ఈ పాపం లో భాగం ఉంది.
సినిమాలో ఒక చోట బ్లాక్ లో టికట్ కొనుక్కునే కుర్రాడితో ఈ డబ్బులకి ఆమె నీకు దొరుకుతుంది కదా అనడం చాలా అవమానంగా అనిపించింది. ఎంత వాంప్ పాత్రలో నో ఐటెం పాట లోనో నటించినప్పటికీ ఆమె శరీరం ఒక బ్లాక్ టికెట్ కొన్నంత వెలతో సమానమా ? ఇది మనసు కలచివేయ్యడం లేదా?ఇది యువతకు ఏ ప్రబోధాన్నిస్తోంది ?
హాస్టల్స్ నడిపే ఆంటీ ల గురించి, కాస్త ఎక్కువ చనువుగా మెలిగే అమ్మాయిల గురించి ఇలాంటి మాటలు విన్నప్పుడల్లా మనసులో కలుక్కుమంటుంది. ఆ అమ్మాయి ఎంత చెడ్డ అయినా ,అనే హక్కు వారికి లేదని అరచి చెప్పినా , అర్ధం చేసికోలేని డర్టీ సమాజం కూడా మన చుట్టూనే ఉంది.
ఇక కధ విషయానికొస్తే ఎంతమంది కూర్చుని రాసారో కానీ ఎక్కడా పొంతనే లేని కధ. ఒక రికార్డ్ డాన్సర్ జీవితం కన్న ఒక వేశ్య జీవితం కన్న అసహ్యంగా చిత్రీకరించడం బాధ కలిగించింది.
కాస్త ఖరీదైన రికార్డ్ డాన్సర్లు నేటి కధానాయికలు, అప్పటి గ్లామర్తో కూడిన వగలమారి పడతి పాత్రలు ... కొంచెం బాధ కలిగినా అది వారి పరిస్తితులపైనే కాని, చిత్రీకరణ పై కాదేమో.
ఆ అమ్మాయి పాత్ర పైన సానుభూతి కాని సాహాను భూతి కాని లేకుండా చిత్రించారు.
ఏ సహానుభూతి లేకుండానే అంతమంది వెళ్లి చూస్తున్నారా? కానైతే సహానుభూతి కేవలమే మహిళా పాత్రలచుట్టునే లేదని నా అభిప్రాయం. సినిమా లో ఉన్నా ప్రతి మగ పాత్రకు సహానుభూతి కలిగిన ప్రేక్షకులు ఉండి ఉంటారు.(ఒకటి రెండు మంచి పాత్రలు కూడా ఉన్నాయి )
ఎంతో మంది సినీ నటీమణులు ఇలా మారడానికి కారణాలు చాల ఉన్నాయి ఆర్ధిక పరమైనవి కుటిమ్బాల్ని పోషించుకోవాల్సి రావడం ఇలాంటివెన్నో. ఈ సినిమాలో అలాంటి అవసరమున్నట్టేమీ చూపించలేదు. ఇది చాల నెగెటివ్ ప్రభావాన్ని చూపుతుంది అందరి మీద.ఒక విధంగా అటువంతో నటీమణుల జీవితాల్ని అవమాన పరిచినట్టే భావిస్తున్నాను నేను.ఏదో ఒక అవసరం చూపితే మనం జాలి పడటానికి వీలుంటుంది అంటారా? అప్పుడు మాత్రం మరోవిధమైన నెగెటివ్ ప్రభావం చూపదా? నటీమణుల జీవితాల్ని అవమాన పరిచినట్టే ఒకవేళ వారు అవమానం గా భావించే పరిస్థితి ఉంటె. కాస్త పెద్ద నటి పేరు తో ఈ సినిమా తీస్తే నిజం గానే అవమానం గా ఫీలయ్యాము అని నానా యాగీ చేసుండే వారు కూడా. అదయినా వారి మార్కెట్ కాపాడుకోడానికే అవుతుంది. ఈ సినిమా ఎవరి జీవితాన్ని అయినా అవమానపరిచినట్లనిపిస్తే జగద్దాత్రి గారు , మీరే వ్యాసం మొదటిలో కొంతమంది పెద్ద పెద్ద నటీమణుల విషయం లో కూడా ఇది నిజమే అని అభిప్రాయం చెప్పడం కూడా ఆ కోవలోనే వస్తుందేమో అని సందేహం కలుగుతోన్నది.
వాస్తవ జీవితం ఐనప్పుడు దాన్ని డర్టీ అనాల్సిన అవసరమేరమే ముంది. ఒక స్త్రీ జీవితంలో పడిన బాధలు డర్టీ నా ? లేక ఆ స్త్రీ బతుకు డర్టీ నా? ఏంటి దర్శకుల ఉద్దేశం. ఇది ఒక ఆడదాన్ని అత్మభిమానాన్ని దెబ్బ తీసే విధంగా ఉందనడంలో సందేహమే లేదు.
డర్టీ అన్నది ప్రజల అభిప్రాయం గా కూడా అనుకోవచ్చని ఈ వ్యాసం మొదటిలో వ్రాసుకొన్నాను. ఆడదాని ఆత్మాభిమానం దాకా ఎందుకు. చిత్రంలో ప్రతి ఒక్కరు కధలోని పాత్రధారులే. మహా నగరాల్లో కాక, మిగిలిన చోట్ల స్త్రీలకూ ఈ సినిమా చూసే అవకాశమే కలగని సందర్భం లో అక్కడి మహిళల ఆత్మాభిమానం కూడా దెబ్బతింది మరి . ఒక మహిళా నిర్మించిన, ఇంకొక మహిళా నటించిన సినిమా మేమెందుకు చూడకూడదు అని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఆత్మాభిమానం మనం చూసే కోణం ని బట్టి ఉంటుంది. నిజానికి మగవారికి ఆత్మాభిమానాన్ని సవాల్ చేస్తాయి సినిమాలో ని చాలా పాత్రలు. ఆ విధం గా దర్శకుడు అభినందనీయుడా మరి?
అసలు సినిమా అన్నది ఒక పరిశ్రమ అని మనం చెప్పుకోవడానికే జుగుప్స కలుగుతోంది ఎక్కడో ఒక పది శాతం తప్ప సినిమాలన్నీ ఎక్కడ ఏమి చుపిస్తున్నాయో అసలు ఆలోచిస్తున్నామా? పరిశ్రమ అంటే ఏదైనా సరే ఒక మంచిని ఉత్పత్తి చేసేది…అలాంటి మంచి ఏదైనా మనం సినిమా పరిశ్రమ నుండి ఆశించా గాలుగుతున్నమా. ప్రతి స్థాయి లోను రాజకీయాలు కక్షలూ ఫాక్షన్లు హింసలు వీటన్నిటితో బాటు ఒక స్త్రీ ఆమె హీరోయిన్ అయినా సరే ఓకే గొప్ప వారి అమ్మాయి అయినా అత్యంత పొదుపుగా బట్టలు వేసుకోవడం లాంటి వికృత వేషాలు చూపించడం. లేదా ఆ పిల్లాడు ఆమె ప్రేమించాక పోతే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ఇవన్నీ చూసి భగ్న ప్రేమలతో (అనే భ్రమలతో) ఆసిడ్ దాడులు చేస్తున్న యువతకి ఏమని చెప్పగలము. ఎలా వారించగాలము అనిపిస్తుంది.
పది శాతం అని చాల ఎక్కువ చెప్పారేమో నంది. అంత కూడా కనిపించడం లేదు. మార్పు కోసం ఆరాటం సమాజం నుండి రావాలి, తమిళ సినీపరిశ్రమ ఇంకా పరిశ్రమ గానే మనగలగడానికి అక్కడి ప్రజలే కారణం కాదా. హీరోయిన్ పైన ఆధారపడి బ్రతుకుతున్న సినీపరిశ్రమ ని, ప్రేక్షకులని కలిపి వెలివెయ్యాలి.
కేవలం ధనార్జన తప్ప మానవ జీవన మర్యాదలు కూడా పాటించకుండా ఒక సినిమా తీయడం దానికి ఎగేసుకుంటూ కుర్రాళ్ళందరూ వెళ్లి చూడటం…అందుకు కొందరు విమర్శకులు చాల వాస్తవిక మైన ది అంటూ మెప్పులు కురిపించడం ఇదంతా ఒక ఫాబ్రికేటేడ్ గా కావాలని అల్లిన వల లా అనిపించడం లేదా ప్రేక్షకులకు. వాస్తవికంగా అయితే ఒక జీవితాన్ని యధాతధంగా తీసి చూపండి మీ క్రూరపు మసాలాలన్నీ ఎందుకు కూరుతారు?,
జీవన మర్యాదలు వ్యాపారాల్లో (అది ఏ వ్యాపారం కానివ్వండి) నేతి బీరకాయ చందమ యినాయి. కుర్రాళ్ళు మాత్రమె చూడడం లేదు. సినిమా బాగుందని విద్యాధికుల మన్నన కూడా పొందిన సినిమా ఇటీవలి కాలం లో 'డర్టీ పిక్చర్' అయినందుకు కాస్తంత సంతోషమే. ఎందుకంటే మిగిలినవాటి కన్నా మెరుగ్గానే అనిపిస్తున్నది మరి.ఇకముందు వచ్చే సినిమాలలో గ్లామర్ పై ఆధారపడే కధానాయిక పాత్ర, విద్యాబాలన్ తో పోల్చబడి ,వెల వెల బోతాయని నా నమ్మిక. కాని ఎవరో వ్రాసిన ''రాదే చెలి నమ్మరాదే చెలి- మగవారినిలా నమ్మరాదే చెలీ'' పాటలా, ఈ సినిమాలు మగప్రేక్షకులు ఇంతే అని సరిపుచ్చుకోవలసి వస్తుందేమో.
సినిమాలలో చాలా సినిమాల ముందు దిగదుడుపే (నేను 'B grade సినిమాల గురించి మాట్లాడడం లేదు).. స్త్రీ తన శరీరాన్ని వాడుకుంటే మాత్రం తప్పేంటి అనేది నా ఫీలింగ్. ఆమేమీ ఎవర్నీ మోసం చేయడం లేదు కదా? అలానే మగాడు తన ఆనందాన్ని ఈవిధమైన పద్దతుల్లో వెతుక్కుంటే మాత్రం తప్పేంటి? సినిమాలలో అలా నటించే స్త్రీకి ఇష్టమే, చూసే మగవారికీ ఇష్టమే? మధ్యలో ఇతరుల అభ్యంతరాలేమిటి?
రిప్లయితొలగించండిఇలాంటి సినిమాలు ఒక్కసారి రావడం, తరువాత ఇదే తరహా సినిమాలు వరుస కట్టడం మొదలెడతాయి. Sex sells only for small period. తరువాత జనాలకు బోరు కొట్టి, విధ్యా బాలనే తిరిగి ఇలాంటివి చేసినా పెద్దగా రెస్పాన్సు వుండదు. ఇది వరకు కూడా ఇలాంటి సినిమాలొచ్చాయి, only sex and Sharukh sells అనే స్మామెతలు పుట్టించాయి. తరువాత అంతమైపోయాయి. ఇక ఈ సినిమాకు డర్టీ పిక్చర్ అని పేరు పెట్టడానికి కారణం మనమే నేమో (ప్రేక్షకులు). ఎందుకంటే ఒక స్త్రీ అలా నటించడం డర్టీ అని మనం ఫీలవుతాం కదా.
సినిమా అనేది వినోధ పరిశ్రమ. అక్కడ వినోధం తయారవుతుంది. అది ఏతరహాది అయినా సరే. కాబట్టి ప్రస్తుతం ఉన్నదాన్ని పరిశ్రమ అనడం తప్పుకాదు.
పోర్న్ సినిమాలు చూసేవాడెవడూ తన భార్య పోర్న్ సినిమాలలో నటించడానికి ఒప్పుకోడు. తన భార్య ఉద్యోగం చెయ్యడానికైతే ఒప్పుకుంటాడు కానీ పోర్న్ సినిమాలలో నటించడానికి మాత్రం ఒప్పుకోడు. పోర్నోగ్రఫీ వల్ల ఫైనల్‌గా లాభపడేది మగవాడే కానీ ఆడదాని గౌరవం మాత్రం పెరగదు.
రిప్లయితొలగించండిఈ టాపిక్ చదవండి: http://stalin-mao.net.in/what-is-the-stand-of-men-on-profanity
రిప్లయితొలగించండి@Sreekanth M
రిప్లయితొలగించండిఈ వ్యాఖ్య తో మీలో ఒక కమ్యునిస్ట్ కనిపిస్తున్నట్లుంది. (కమ్యునిస్ట్లకి ఇలాంటి అభిప్రయలున్తాయని అర్ధం కాదు)
మీరనుకొన్నట్లు గా డర్టీ పిక్చర్ లాంటి సినిమాలు వరస కట్టడం సాధ్యం కాదు. కాని సినిమా కొంత వెనుతిరిగి వి శ్లే షించుకొనే అవకాసం లేకపోలేదు.
./ స్త్రీ తన శరీరాన్ని వాడుకుంటే మాత్రం తప్పేంటి అనేది నా ఫీలింగ్. ఆమేమీ ఎవర్నీ మోసం చేయడం లేదు కదా? అలానే మగాడు తన ఆనందాన్ని ఈవిధమైన పద్దతుల్లో వెతుక్కుంటే మాత్రం తప్పేంటి? సినిమాలలో అలా నటించే స్త్రీకి ఇష్టమే, చూసే మగవారికీ ఇష్టమే? మధ్యలో ఇతరుల అభ్యంతరాలేమిటి? /
మగాడు ఆనందాన్ని సినిమాలో మాత్రమె వెదుక్కొని ఆగిపోడు. అటువంటి వ్యక్తి చాల సమస్యలకు కారణం అవుతాడు (ప్రత్యేకించి ఈ సినిమా గురించి చెప్పడం లేదు. కాని మీరు చెప్పే మగాడు ఈ సినిమా లో మంచి ని చూడలేదు. అలవాటు గా చెడు నే చూస్తాడు.) అలాగని అతను కూడా బాగు పడదు.కాబట్టే జగద్దాత్రి గారు మహిళలను సూటిగా ప్రశ్నిస్తున్నారు.
Praveen
రిప్లయితొలగించండిఖరాఖండి గా చెప్పేశారు, కాని భార్య అంటే ఒక విలువ ఉన్న వ్యక్తు లు తెలుగు సినిమాలకు దూరం అవుతున్నారన్నది మాత్రం నిజం.
మగవాడు తన భార్య బూతు సినిమాలలో నటించడానికి ఎందుకు ఒప్పుకోడంటే అతని దృష్టిలో భార్య అంటే అతని వ్యక్తిగత ఆస్తి. ఆమెని మనసున్న మనిషిగా చూడడు కానీ ఆమెని తన సొంత ఆస్తిలాగ భావిస్తాడు. ఎన్ని బూతు సినిమాలు వచ్చినా, గోడల మీద ఎన్ని బూతు పోస్టర్లు వెలసినా స్త్రీ-పురుష సంబంధాల విషయంలో మగవాడు తన అభిప్రాయం మార్చుకోడు. బూతు సినిమాలకి సామాజిక ఆమోదం లేదనేది నిజం. ఒక చప్రాసీ (అటెండర్) ఉద్యోగం చేసేవాడు తాను చప్రాసీనని ఓపెన్‌గా చెప్పుకోగలడు కానీ ఒక బూతు సినిమా నటి తాను బూతు సినిమాలలో నటిస్తున్నానని తన బంధువుల దగ్గర ఓపెన్‌గా చెప్పుకోగలదా?
రిప్లయితొలగించండిLOL, you are the first person told me that I have communist Ideology. అది పక్కన పెట్టండి. డర్టీ సినిమాలలాంటి సినిమాలు (అనగా స్కిన్ షోని నమ్ముకుని తీసిన సినిమాలు ఖచ్ఛితంగా వస్తాయి. ఇదివరకు అలా వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తాయి. Just wait and see :-)
రిప్లయితొలగించండిమగాడు ఆనందాన్ని ఆ విధంగా పొందడం తప్పా కాదా అన్నది మాత్రమే ఇక్క ప్రశ్న, ఆతరువాత అతను ఏమిచేస్తాడు అన్నది ఆయా వ్యక్తుల విఙ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాన్ని మనం దృష్టిలో ఉంచుకొని అందరినీ ఒకే గాటన కట్టి స్టేట్మెంట్లు ఇచ్చేయలేం కదా?
స్కిన్ షో అనేది కేవలం వ్యాపారమే. కొంత మంది దానికి స్త్రీవాదమనో, మహిళాభ్యుదయమనో పేరు పెట్టడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. వేశ్య దగ్గరకి వెళ్ళే మగవాడు తన భార్య గిగోలో దగ్గరకి వెళ్ళడానికి ఎందుకు ఒప్పుకోడు అని అడిగితే ఈ మగవాళ్ళు వ్యభిచారం అనేది చప్రాసీ పని లాంటిదేదనీ, చప్రాసీలు ఉన్నంత వరకు వ్యభిచారులు ఉంటారనీ వాదిస్తారు. వేశ్యని చప్రాసీతో సమానం అనుకున్నా వేశ్య దగ్గరకి వెళ్ళేవాణ్ణి చప్రాసీతో సమానం అనుకోరు. కానీ గిగోలో (మగవేశ్య) దగ్గరకి వెళ్ళే ఆడదాన్ని ఎందుకు అదోలా చూస్తారు? చప్రాసీ తరహా పనిలో కూడా ఆడ-మగ తేడాలు చూస్తారా?
రిప్లయితొలగించండిhttp://teluguwebmedia.in మీకు నూతన సంవత్సర స్వాగతం పలుకుతోంది.
రిప్లయితొలగించండి-- ప్రవీణ్ శర్మ
మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండి@Sreekanth M
రిప్లయితొలగించండి:) వేదం సినిమా లో అనుష్క చేసాక, ఎన్ని సినిమాలు వరుస పెట్టి వచ్చాయి !
ఇకపోతే మగవారి విజ్ఞత ను కేవలం ఆసిడ్ దాడుల్లోనో, అత్యాచారం కేసులతోనో మాత్రమె కాక, వెలుగు లోకి రాని చాలా సంఘటనలు తో కలిపి పోల్చాల్సి వస్తుంది.
ఆ విధంగా చాలా తక్కువ శాతం ఉండే విజ్ఞత ఆధారం గా కూడా స్టేట్మెంట్లు ఇచ్చేయలేం .