ఆ౦టీ ఫోన్ చేసారు. పాపను దత్తత తీసికొన్నాము
చూద్దువు రా వీలయినప్పుడు అని. హాస్పిటల్ లో అప్పుడే పుట్టిన పాపాయిని
దత్తత కాకుండా తనకే పుట్టినట్లు గా డాక్యుమెంట్ వర్క్ చేయించి
తీసికోన్నారు. తెలిసిన రె౦డు మూడు హాస్పిటల్స్ లో చెప్పి ఉంచారట ఆడపిల్ల
కావాలని , అదృష్టం ఫలి౦చి ఒక మంచిరోజున బుజ్జి పాపాయి వాళ్ళ జీవితాలలోకి
వచ్చేసింది. పాప అసలు పేరెంట్స్ ఎవరో వీళ్ళకి తెలీదు , వీళ్ళు కూడా వాళ్లకి
తెలిదు.
ఎందుకు పిల్లలని రహస్యం గా దత్తత తీసికోవాలనుకొంటున్నారు. ఆ తల్లి సరే రహస్యం గా ఉంచాలనుకొంటే వీళ్ళకీ తప్పదనుకోవచ్చు. కాని తమకే పుట్టినట్లు రికార్డులు అవసరం అని ముందే చెప్పి ఉంచడం !!!!! నాకు తెలిసిన కారణాలు, మొదటిది పసి పిల్లలపై ఉన్న ఆసక్తి ప్రేమ, అదే సమయం లో పసి బిడ్డ అయితే తాము వేరే అన్న భావం బిడ్డకు తెలియకుండా ఉంటుందని. ఆస్తి కి వారసులు కావాలన్న తపన. వృద్దాప్యం లో తమను కనిపెట్టుకొని ఉండేవారు కావాలన్న ఆశ!
బిడ్డని తీసికొని రాగానే అందరికీ అన్ని వివరాలు(నిజాలు) చెపుతారు. అప్పుడు ఆ బిడ్డ కి వినిపిస్తుందా , అర్ధం అవుతుందా అన్న ధీమా ఏమో . కాని ఆ బిడ్డ పెద్దయ్యాక అనిజాలు ఎవరు ఎక్కడా మాట్లాడకూడదు. కాని ప్రస్తుత ప్రపంచం లో ఇది సాధ్యమా. చుట్టూ ఉన్న బోలెడు పసిపిల్లల్ని వదిలేసి ఎవరో తెలియని పసికందుని తెచ్చుకొని, అప్పటికే ఆ బిడ్డకి శత్రువుల్ని తయారు చేస్తారు. ఎవరింట్లో వాళ్ళు ఇదీ అని మాట్లాడుకోకుండా ఉంటారా. బిడ్డకి నిజం తెలిస్తే బాధ పడతాడు /పడుతుంది అని మాత్రమె నిజం దాచారనుకోవడం పూర్తీ గా నిజం కుడా కాదు.
Part 2- మనసా వాచా కర్మణా దత్తత సాధ్యమా! -2
ఎందుకు పిల్లలని రహస్యం గా దత్తత తీసికోవాలనుకొంటున్నారు. ఆ తల్లి సరే రహస్యం గా ఉంచాలనుకొంటే వీళ్ళకీ తప్పదనుకోవచ్చు. కాని తమకే పుట్టినట్లు రికార్డులు అవసరం అని ముందే చెప్పి ఉంచడం !!!!! నాకు తెలిసిన కారణాలు, మొదటిది పసి పిల్లలపై ఉన్న ఆసక్తి ప్రేమ, అదే సమయం లో పసి బిడ్డ అయితే తాము వేరే అన్న భావం బిడ్డకు తెలియకుండా ఉంటుందని. ఆస్తి కి వారసులు కావాలన్న తపన. వృద్దాప్యం లో తమను కనిపెట్టుకొని ఉండేవారు కావాలన్న ఆశ!
బిడ్డని తీసికొని రాగానే అందరికీ అన్ని వివరాలు(నిజాలు) చెపుతారు. అప్పుడు ఆ బిడ్డ కి వినిపిస్తుందా , అర్ధం అవుతుందా అన్న ధీమా ఏమో . కాని ఆ బిడ్డ పెద్దయ్యాక అనిజాలు ఎవరు ఎక్కడా మాట్లాడకూడదు. కాని ప్రస్తుత ప్రపంచం లో ఇది సాధ్యమా. చుట్టూ ఉన్న బోలెడు పసిపిల్లల్ని వదిలేసి ఎవరో తెలియని పసికందుని తెచ్చుకొని, అప్పటికే ఆ బిడ్డకి శత్రువుల్ని తయారు చేస్తారు. ఎవరింట్లో వాళ్ళు ఇదీ అని మాట్లాడుకోకుండా ఉంటారా. బిడ్డకి నిజం తెలిస్తే బాధ పడతాడు /పడుతుంది అని మాత్రమె నిజం దాచారనుకోవడం పూర్తీ గా నిజం కుడా కాదు.
Part 2- మనసా వాచా కర్మణా దత్తత సాధ్యమా! -2
ఇలా దత్తత తీసుకోవాలి అనుకొనే వారు బార్య భర్త మధ్యనే ఉంటె మంచిది.. పదిమందికి తెలియటం వాళ్ళ దత్తత తీసుకున్న బేబీ కి చాల ఇబ్బందులు వస్తాయి.. దత్తత తీసుకొనే అమ్మ నాన్న లకు నా విన్నపం చిరకాలం దత్తత తీసుకున్న బేబీ ని సొంత కొడుకు/కూతురు లాగా చుసుకోగలం అని మనసాక్షిగా అనుకుంటే నే తీసుకోండి పసి హృదయాలని గాయం చేయకండి
రిప్లయితొలగించండిమీరు చెప్పినది బాగుంది. ప్రతీవారు తమకు మాత్రమే స్వంతం అనుకునే వాటిలో పిల్లలు అతిముఖ్యమైన వాళ్ళు........వాళ్ళు పెద్దైనాక చూస్తారా అని ఎవరూ పెంచరు. అలా పెంచినట్లైతే ఒక దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టిన వ్యాపారంగా వుంటుందే తప్ప కుటుంబం లాగా వుండదు. స్వంతంగా పిల్లలు లేనివాళ్ళు పిల్లలను పెంచెటం వలన కలిగే ఆనందం ఎలా పొందుతారు...? పిల్లలను ముద్దు చెయ్యటం, లాలించటం మొదలైనవి ఎవరి పిల్లలనో ఎంతసేపు చేస్తారు? అందుకని స్వంతంగా తెచ్చుకొంటే ఒక హక్కుగా చెయ్యగలుగుతారు. చుట్టూ వున్న పిల్లల్ని పెంచటానికి...... సోషల్ సెర్వీసు వేరు కుటుంబ సర్వీసు వేరు.
రిప్లయితొలగించండిఇకపోతే, ఇదివరుకూ లాగా దత్తత కార్యక్రమాన్ని ఫదిమందిలో చెయ్యటం వలన, రేపు పిల్లలు పెద్దైనాక విషయం తెలిసిపోతుంది. అందువలన, ఈ విషయాన్ని చాలా రహస్యంగా చెయ్యటమే సమంజసం. ఇదే విషయం మీద కొద్ది సంవత్సరాల క్రిందట ఒక హిందీ సినిమా చూశాను. అయితే ఆ సినిమాలా బాగా విపరీతం చేసి తీశారనుకోండి.
ఏది ఎమైనా, ఈ విషయం రహస్యంగా వుంచటం చాలా కష్టం. నాకు తెలిసిన వారు ఇలాగే ఒక పిల్లాడిని తెచ్చి పెంచారు. వాడు చక్కగా వీళ్ళ దగ్గర పెరిగి మంచి వుంద్యోగం తెచ్చుకున్నాడు. ఆతరవాత అసలైన తల్లిదండ్రులు ప్రవేశించటం వలన ఈ అద్దె కొడుకు పెంచిన వారికి దూరమైనాడు.
తెలుగు పాటలు గారు,
రిప్లయితొలగించండివీలయినంత వరకు బార్య భర్త మధ్యనే ఉంటె మంచిదే, కాని చాల వరకు సాధ్యం కాకపోవచ్చు. సొంత బిడ్డ లానే చూసుకోవడం అంటే బాగా 'గారాబం' చెయ్యడం అన్న భ్రమలోనే చాల మంది ఉంటున్నారండీ. అదే అసలు అన్ని ఇబ్బందులకు మూల కారణం అనుకుంటున్నాను.
స్పందించినందుకు ధన్యవాదములు. మీ అభిప్రాయం తెలియచేస్తూ ఉండగలరు
మౌళి గారు,
రిప్లయితొలగించండిక్రిందటేడు దాదాపు ఇదె శీర్షిక తో రాశాను.. వీలయితే చూడండి..
http://krishna-diary.blogspot.com/2010/07/blog-post_30.html
RADHAKRISHNA గారు ,
రిప్లయితొలగించండిమీరన్నది నిజమే, దగ్గరి వారి పిల్లల్ని పెంచుకోవాలన్న రూలేమీ లేదండి . అలాగే దయ, జాలి , పెట్టుబడి, మమకారం వీటిలో ఏవి తక్కువ వి కావు .
కృష్ణప్రియ గారు,
రిప్లయితొలగించండిచాల నెలల క్రితమే మీరు వ్రాసిన టపా చూసాను. ఈ శీర్షిక కుడా మీ వ్యాసం నుండి తీసికొన్నదే. ఒక విధం గా ఇది కొనసాగింపు మరికొన్ని అనుభవాలతో.
స్పందించినందుకు ధన్యవాదములు
RADHAKRISHNA గారు,
రిప్లయితొలగించండిచెప్పడం మరచాను. స్పందించినందుకు ధన్యవాదములండి
మీ టపా చాలా ఆలస్యంగా చూసాను మౌళి గారు. నాకు మీరిచ్చిన వ్యాఖ్య బట్టి ఇప్పటికన్నా చూడగలిగాను. ఈ మధ్య బ్లాగులు సరిగ్గా చూడలేక పోతున్నాను. స్వంతబిడ్డగానే రిజిస్టర్ చేయించుకోడం అన్న మీ అయిడియా బాగుందండి.అది వేరే విషయం. ఏది ఏమైనా ఆ పిల్లలకి అసలు విషయం తెలియకపోతేనే బాగుంటుంది. అంటే వారికి పూర్తిగా మెచ్యురిటీ వచ్చిన తరువాత తెలిసినట్లైతే మెల్లగా అర్ధం చేసుకో గలుగుతారు. థాంక్సండి.
రిప్లయితొలగించండిజయ గారు,
రిప్లయితొలగించండిపిల్లలకే కాదండి, అసలు ఎవరికీ తెలియకుండా ఉన్నా బావుంటుంది. కాని మనమొకటి తలచిన దైవమొకటి తలచును కదా. ఇక మెచ్యురిటీ అంటారా,బయటివారికి అంత ఆలోచించి చెప్పే తెలివి ఉండదు కదండీ :)
ఈ రోజుల్లో పిల్లలల్ని పెంచటం ఒక కళ!! సొంత వారు కానివ్వండి ...దత్తత తీసుకున్న వారు కానివ్వండి....కలుషితం అయిపోయిన సమాజం ...అసూయ నిండిన జనాలు ....విసృఖలత్వం పెరిగిన కాలం .....అన్నిటి నుండి వేరుచేసి ఒక పరిపూర్ణ మైన ఉత్తమ దేశపౌరులు గా తీర్చి దిద్దటం అంటే ...పెళ్ళిచేసుకుని హనీమూన్ కి వెళ్ళినంత ఈజీ కాదు ....
రిప్లయితొలగించండిదత్తత అనేది ఒక మంచి నిర్ణయం...కారణాలు ఏవైనా అది ఇరువర్గాల వారికి ఆమోదయోగ్యం కాబట్టి ఇందులో ఎలాంటి దోషం లేదు, పొతే రహస్యం ఉంచటం అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే ఒక టపా చదివాను ఎవరో పాపా చాలా చలాకీగా ఉండేది ఎప్పుడైతే తను వాళ్ళ పిల్ల కాదు వాళ్ళు దత్తత తీసుకున్నారు అని తెలిసిందో అప్పటినుండి తల్లితండ్రులతో ప్రేమగా కాకుండా కృతజ్ఞతగా ఉంటోందిట, ఎంత మానసిక క్షోబ తల్లితండ్రులకి , పాపా కు కూడా ....అందుకే వీలైనంత రహస్యం గా ఉంచటం మంచిది....
రాఫ్సన్ గారు,
రిప్లయితొలగించండిఆ పాప ఇంకా చాలా నయ్యం అండీ,ఇంకొంత మంది ద్వేషమే పెంచుకొంటున్నారు. పిల్లలు అలా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పెద్దవారిదని నా అభిప్రాయం.
ఇలా దత్తత తీసికొని రహస్యం గా ఉన్చాలనుకొనే తల్లిదండ్రులు ముందు, మీరన్న 'కలుషితం అయిపోయిన సమాజం ...అసూయ నిండిన జనాలు' ని ద్రుష్టిలోపెట్టుకొని అన్నిసమస్యలకు రెడి గా ఉండాలికాని,సమాజాన్ని నిందించకూడదు అనుకొంటున్నాను .
మౌళిగారు,
రిప్లయితొలగించండినమస్కారం
వ్యాఖ్య చాలా ఆలస్యంగా చేస్తున్నందుకు మన్నించాలి. నేను దత్తుడినే. దత్తత అనేదానిని మన పూర్వులు రహస్యంగా చేయమని చెప్పలేదు. పదిమందికి తెలిసి, తెలిపి చేయమన్నారు. అలా చేయడం తప్పూ కాదు. నేటి కాలంలో ఆలోచనలు కొద్దిగా మారి రహస్యంగా చేయలనుకుంటున్నారేమో! బిడ్డలు, వాళ్ళు కన్న వాళ్ళయినా, పెంచిన వాళ్ళయినా తల్లి తండ్రులను వృద్దాప్యం లో చూడాలనేది, మన సంస్కృతి. రహస్యంగా బిడ్డని దత్తత తెచ్చుకోవడం, ఆ బిడ్డకు పెద్దయిన తరవాత వేరొకరు చెప్పడం, ఇది సినిమాలకి సరిపోతుందేమో కాని, జీవితానికి కాదని నా అభిప్రాయం.
శర్మ గారు,
రిప్లయితొలగించండినమస్కారం అండీ. కోటి వరహాల మాట చెప్పారు.
పాప తమకే పుట్టినట్టు జననపత్రాలు రాయించడం వీరి అతితెలివి. దానికి కారణమేమో చెప్పలేము. పసికందుగా దత్తత తీసుకున్నా కూడా స్వీకరించే తలిదండ్రులకి కౌన్సెలింగ్ ఇస్తారు నాకు తెలిసి, ఈ విషయాన్ని పిల్లలతో ఎలా డీల్ చెయ్యాలని. ఇండియాలో పిల్లలు అంటే ఇంకా ఆస్తికి వారసులనో, లేక వృద్ధాప్యంలో ఆదుకుంటారనే సెంటిమెంటో ఇంకా బలంగా ఉండడం వల్ల బర్త్ పేరెంట్స్ తో సమస్యలు రావచ్చు. ఏదేమైనా పిల్లలతో నిజాయితీగా లేకపోవడం తల్లిదండ్రుల అసమర్ధతని సూచిస్తుంది.
రిప్లయితొలగించండిNarayanaswamy గారు
తొలగించండిహాస్పిటల్స్ నుండి డాక్టర్ కాని ఇంకొకరు కాని మధ్యవర్తి గా సాగే ఈ ప్రక్రియ లో దత్తత కుదరదు, అందుకే ఈ జనన పత్రం . కొన్ని కారణాలను ఈ టపాలో వివరించాను http://teepi-guruthulu.blogspot.co.uk/2012/05/2.html
ఆస్తులు, మరియు బిడ్డ తమకు మాత్రమె స్వంతం అవ్వాలన్న సెంటిమెంటు వల్ల ఇటువంటి ముందు జాగ్రత్త తీసికొంటారు. అందుకే కౌన్సిలింగ్ కి అవకాశం లేదు.
కాని నిజం తెలిసి ఆ బిడ్డ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి అయిన అసలు తల్లిదండ్రుల ప్రాధమిక వివరాలు తెలిసికోవడం ధర్మం. ఏ సమస్యతో తనని కన్నవారు విడిచారో అన్నది అర్ధంచేసుకోవాలని ఆ పసి మనసు తల్లడిల్లుతుంది.
మీరన్నట్లు నిజాయితీ లేకపోవడం ఆ తల్లిదండ్రుల అసమర్ధతను సూచిస్తుంది అన్నమాట ఒప్పుకోవాలనిపిస్తుంది నేను చుసిన రెండు ప్రాణత్యాగాలవల్ల, కాని ఎప్పటికప్పుడు సమస్యను ఎదుర్కోలేక కొందరు , అంత కష్టపడటం అవసరం లేదు అనుకొనే వారు కొందరు ఇలా పొరపాటు చేస్తారు.
గుడిపాటి వెంకట చలం , శ్రీ రంగం శ్రీనివాస రావు , గురజాడఅప్పా రావు వీరందరూ దత్తత చేసుకోపడ్డ వారే !!!
తొలగించండి