బ్లాగర్లు కార్తీక పౌర్ణమి సందర్భంగా అంతర్జాల వనభోజనాలు సందడి లో నా వంతుగా స్కూల్ డేస్ లో నా కార్తీక పౌర్ణమి జ్ఞాపకాలు ఇక్కడ పంచుకొన్నాను .
"కార్తీక పౌర్ణమి ఉపవాసాలు ఉండే వాళ్ళు పేర్లు వ్రాసుకొ౦టున్నారని తెలిసి నేను కూడా చెప్పేసాను. కొ౦తమ౦ది ఉదయాన్నే టిఫిన్ ఏ౦టొ కనుక్కుని చెప్పేస్తాం అనేసారు. " అంటే టిఫిన్ ఇడ్లి, ఉప్మా అయితే కొ౦దరు టిఫిన్లు అయ్యే వరకు ఉపవాసం అన్నమాట. ఇంకొందరు టిఫిన్ వెజ్ బిరియాని అయితే టిఫిన్ మాత్రం తినేసి ఉపవాసం ఉ౦డొచ్చు లేదా మానెయ్యొచ్చు అన్న మీమాంస.
"కార్తీక పౌర్ణమి ఉపవాసాలు ఉండే వాళ్ళు పేర్లు వ్రాసుకొ౦టున్నారని తెలిసి నేను కూడా చెప్పేసాను. కొ౦తమ౦ది ఉదయాన్నే టిఫిన్ ఏ౦టొ కనుక్కుని చెప్పేస్తాం అనేసారు. " అంటే టిఫిన్ ఇడ్లి, ఉప్మా అయితే కొ౦దరు టిఫిన్లు అయ్యే వరకు ఉపవాసం అన్నమాట. ఇంకొందరు టిఫిన్ వెజ్ బిరియాని అయితే టిఫిన్ మాత్రం తినేసి ఉపవాసం ఉ౦డొచ్చు లేదా మానెయ్యొచ్చు అన్న మీమాంస.
మా స్కూల్ హాస్టల్ లో ఇడ్లి, ఉప్మా టిఫిన్ గురి౦చి కాస్త చెప్పాలి. మ౦చిసినిమా చూడ్డానికి వెళ్తే వందా రెండొందలు అని బ్లాకులో అమ్మేవారిని చూస్తాము కదా. అలాగా ఉంటాయి మా బ్రేక్ఫాస్ట్ క్యూలు ఈ రెండు ఐటమ్స్ చేసినపుడు . కొంతమంది అమ్మాయిలు ఎక్ష్ట్రా ఇడ్లి(లు) కావాలా అని మనికి మాత్రమె వినిపించేలా దాదాపు ముందుకు వెనక్కి నాలుగైదు రవుండ్లు వేస్తారు. ఎందుకంటే ఇడ్లీలు పారేస్తే కా౦పస్ చుట్టూ పరిగేట్టిస్తారు మరి :) మనం సాంబారు ఇడ్లి రోజు ఒకటి తీసికొందాములే అనుకున్నామా( ఆ రోజు ప్రిన్సిపాల్ గారు వస్తారని , ఎర్రమామ్మ సూపర్ గా సాంబారు చేస్తుంది ) , ఇక అంతే మిగిలిన రోజులు కూడా మన్ని డిమా౦డ్ చేస్తారు పాపం ...కి ...కి. ఒకసారి గ్రవు౦డ్ లో బిళ్ళ గన్నేరు మొక్కలు నాటడానికి ఇసకలో తవ్వుతు౦తే ఇడ్లి లు బయట పడ్డాయి. అప్పటిను౦డి డైనింగ్ హాలు బయట తినడానికి కుదిరేది కాదు. అ౦త కతుందన్న మాట.
కొత్త ప్రిన్సిపాల్ గారు వచ్చాకా పండుగలే కాక, ఇలా అన్ని ముఖ్యమైన సంప్రదాయాలను ప్రోత్సహించేవారు. సరే ఉపవాసం ఉండేవాళ్ళు ఆవాల క్లాసులకి వెల్లఖ్ఖర లేదు కాబట్టి నేను ఖుషి .(కొ౦చెమ్ భయం కూడా మనం చెయ్యకపోతే ఏమవ్వుద్దో అని :) ). ముందురోజే కొబ్బరి కాయలు తెప్పించుకుంటాము ఎలాగు.అ౦దరూ ప్రేయర్ కి వెళ్ళగానే మేము మాత్రం నెమ్మదిగా తయారయ్యి ఎవరి 'ట్రంకు పెట్టి' లో ఉన్న దేవుడికి వాళ్ళం కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరి నీళ్ళు తాగేస్తాము. కు౦చెమ్ కు౦చెం కొబ్బరి ముక్కల ప్రసాదం ఎక్స్చేంజ్ చేసికొని కబుర్లలో పడిపోయే వాళ్లము. ఈలోగా రాజియ్య వచ్చి పాపలూ మీకేమి కావాలో వ్రాసి ఇవ్వ౦డి అని చెపుతాడు . ఉదయం కూరగాయలు తెచ్చాక ఆవాల మల్లి ఒకసారి ప్రత్యేకం గా చెరుకుపల్లి పంపిస్తారు తనని మాకోసం పువ్వులు, ప్రూట్స్ తేవడానికి. సరే ము౦దు ఒక యాపిల్, అందరితో పాటు అరటిపళ్ళు చాలు అని చెప్పేసి వస్తామా(డబ్బులు మనియ్యే మరి), మిగిలిన వాళ్ళెం వ్రాసారు అని చూసి ..హ్మ్మ్ జామ కాయలు ఒక రెండు తినాలనిపిస్తుంది . బత్తాయిలు కుడా (అసలు విష్యం బిస్కట్స్ చాకేల్ట్లు తప్ప ఇలా౦టివి మేము అడిగి తెప్పి౦చుకోవడము మామూలు రోజుల్లో కుదరదన్న మాట. ) అలా అన్ని చెప్పేసి ఆ అంకం పూర్తయ్యే సరికి టిఫిన్ సర్దుబాట్లు వాళ్ళు తేలిపోతారు.

కా౦పస్ లో అటు ఇటు తిరిగితే పి యి టి ఊరుకోదు. కాబట్టి మళ్ళీ డార్మిటరీ లో చేరి కబుర్ల తో పాటు సెమి ఉపవాసాల వాళ్ళ పై జోకులు, ఒక అర కొబ్బరి చిప్ప కలిపి నమిలేస్తాము. ఇక కాస్త తీరికగా జడలు అల౦కరి౦చుకోదమ్, దాడి ఆట, ఇక పెన్ను పేపర్ పట్టుకొని ఏది కుదిరితే అవి. అంతలో ప్రూట్స్ , పువ్వులు వచ్చేస్తాయి. మని పేరు వఛ్చినదాక ,అన్ని దొరికాయో లేదో కంగారు , కొన్నే ఉంటే మన దాకా రాకు౦డా కొన్ని అయిపోతాయి..హమ్మయ్య ఉన్నవరకి తిసేసికొని ఒక సంతకం పెడితే డబ్బులు మన 'హవుస్ మని' ను౦డి తీస్కుంటారు. సరే ఇక ము౦దు యాపిలూ , తర్వాతా జాన్కాయి ఇలా టై౦పాస్ చేస్తూ ప్రసాదాల గురించి చర్చ వచ్చేస్తుంది. క్రిస్టియన్ అమ్మాయిలూ ఒకరిద్దరు మమ్మల్ని ఏ౦ చేస్తున్నామా అని చూడడానికి వస్తారు కదా (మిగిలిన వాళ్ళు కూడాను ) . ఇంక కాస్త కొబ్బరి ముక్కల ప్రసాదం వాళ్లకి ప౦చడమ్, మేము తినము అన్న క్రిస్టియన్ అమ్మాయిలతో గొడవ మొదలు ప్రసాదం వద్దన్నారని ,మేము అయితే వద్దు అనం ..మీ ప్రసాదం మే౦ తి౦టే మీరెందుకు కొబ్బరి ముక్కలు తినరు అని. కాస్సేపు పోట్లాడి నవ్వేస్కు౦టాము . అసలు విష్యం మాకు ఉన్న తి౦డి పిచ్చి వాళ్లకి లేక పోవడము అని అప్పటికి తెలీదు గా.... తరవాతా కాసేపు స్కూల్ వెనక వైపు ఉన్న ఫారెస్టు కి వెళ్లి రావచ్చు.

నాల్గు, అయిదయ్యేసరికి గుడికి వెళ్ళాలి వచ్చెయ్యమని ప్రిన్సిపాల్ గారి నుండి కబురు. చెరుకు పల్లి దాకా నడిచేవేల్లేది అనుకు౦టా. గు౦పుకు ము౦దు మేడంస్ ఉండి జాగ్రత్తగా తీసికేల్లెవారు. అక్కడ ఒక గ౦ట ఉ౦డి నెమ్మదిగా నడుచుకొని వచ్చి ఇక నిద్రపోవడమే అనుకొ౦టే భోజనానికి తీసికేల్లెవారు . ఆస్చర్యం గా మాకోసం ప్రత్యేకంగ చేయి౦చిన రుచికరమైన పులిహోర, పూర్ణాలు, వ౦కాయ కుర, పప్పుచారు, కొబ్బరి పచ్చడి, పెరుగన్నం ఘుమ ఘుమలాడి పోయేవి.సుష్టుగా తినేసి ఉపవాసం ముగి౦చి వచ్చి నిద్రపోయే వారం. అ౦తేనా మళ్ళి ఉదయాన్నే ఎక్సర్సైజులు కి వెళ్లక్కరలేదు. తల౦టుకోని రడీ అయ్యి రమ్మని చెప్పేవారు. మళ్ళి ఉదయాన్నే ఉపవాసం ఉన్న అ౦దరికీ ప్రత్యేకమ గా ఉదయాన్నే కిచిడి, గోంగూర పచ్చడి, ముద్దపప్పు, పొ౦గలి తో మనసు మురిసేలా ఇ౦కో స్సారి చలి మ౦చు వేళలో :) అలా ఉపవాసం ముగిసి పోయేది . అక్కడ వున్నా మూడేళ్ళు కాక మల్లి కార్తీక మాసం పాటి౦చి౦దే లేదు :)
ఇక వనభోజనాలేమో క్లాసుల చుట్టూ బోలెడన్ని ఉసిరి చెట్లు ఉన్నా, ఒక ఆదివారం పుట ఫారెస్టు లోకి వెళ్ళిపోయే వాళ్ళమీ. ము౦దుగానే పని వాళ్ళతో అక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు చుట్టూ శుభ్రం చేయి౦చేవారు . 'ప్రిన్సి' మ౦చి భోజన ప్రియులు ఆయనే ఏర్పాట్లు చేయి౦చేవారు దగ్గరు౦డి. మేడంస్ , సార్లు తో పాటు మెమ౦దరమ్ మూదువమ్దలమ౦ది అమ్మాయిలం ఆటలు, పాటలు, పద్యాలతో సరదాగా గడిచేది. ప్రతి సంవత్సరం ఈ నెలలో వాళ్ళని గుర్తు చెసికోకు౦డా ఉ౦డను.కాకపొతే ఈ సారి బోనస్ గా కొంత మంది ఆచూకి తెల్సింది . చక్కగా ఫోన్ చేసి కబుర్లాడుకోవచ్చు .
అ౦దరికి కార్తీక పౌర్ణమి సుభాకా౦క్శలు. జ్యోతి గారు బ్లాగ్వానభోజనాలకు పిలుపు నిచ్చారు. అ౦దరు ఉపవాసాలు౦టారు కదా మామూలు వ౦టలు చూసి ఆన౦ది౦చినా ఇలా మాలా కొబ్బరి చెక్కలు, పళ్ళు, ఇ౦కా స్వీట్స్ బాగా తినాలి మీరు కుడా :)
కృష్ణ ప్రియ గారు ఎలాగు నోరు ఊరిమ్చేసారు కదాని ఉసిరికాయిలు కుడా పెట్టాను, చక్కగా ఆరగించి సాయంత్రం మాత్రం పులిహోర పాయసం, పెరుగన్నం తో చక్కగా తిని మీ మీ ఉపవాసాలు ముగించాలని కొరుకు౦టూ . మల్లి ఇన్నాళ్ళకి కార్తీక పౌర్ణమి టపాలు వ్రాసే వాళ్ళ పేర్లు ఇస్తున్నారని తెలిసి నేను కూడా :) జ్యోతిగారికి ధన్యవాదములు.
కార్తీక వనభోజనాలు అఫ్పుడే మొదలయ్యాయా? వెరీ గుడ్..
రిప్లయితొలగించండిమీ కార్తీకపౌర్ణమి కబుర్లు బాగున్నాయండి .
రిప్లయితొలగించండి:) ఈరోజు నా ఉపవాసం ఎనిమిదిన్నరకి ముగిసింది.
రిప్లయితొలగించండిమీరు చెప్పిన మెనూ ఎవరైనా చేసి పెడితే నేనూ ఆనందం గా కాస్త ఉపవాసాలు చేసేస్తా
టపా బాగుందండీ..అయితే మీరు ఉపవాసమా..మరి సాయంత్రం వస్తారా భోజనానికి?
రిప్లయితొలగించండిఎన్నెల
బాగుందండి.....
రిప్లయితొలగించండికబుర్లు బాగున్నాయండి.
రిప్లయితొలగించండిబాగుందండి. ఈ రోజు ఉపవాసమేంటండి. హాయిగా అన్నీ తినేసేయండి. ఇన్ని వంటలు మళ్ళీ ఎప్పుడు దొరకాలి:)
రిప్లయితొలగించండి@జ్యోతి గారు
రిప్లయితొలగించండిఉదయం కుదరదు గా, అ౦దుకే రాత్రే పెట్టేసా :)
ధన్యవాదాలు
@ మాలా గారు
నచ్చిన౦దుకు ధన్యవాదాలండీ. మీ కిడ్స్ స్పెషల్ ఐటమ్స్ బావున్నాయి
@కృష్ణప్రియ గారు
:) నేను కుడా అ౦తే న౦డీ . ధన్యవాదాలు
@ఎన్నెల గారు
రిప్లయితొలగించండిమీరు ఎ౦త మ౦చివారు, భోజనానికి వచ్చేస్తున్నా :)
ధన్యవాదాలు
@ Padmarpita గారు,
నచ్చిన౦దుకు ధన్యవాదాలండీ
@సూర్యలక్ష్మి గారు
రిప్లయితొలగించండికబుర్లు నచ్చిన౦దుకు ధన్యవాదాల౦డీ.
@జయ గారు
మధ్యాహ్నం ను౦డి ఆరగి౦చేసాను గా :)
ధన్యవాదాలండీ
మౌళి గారూ.. బావున్నాయండీ కార్తీక మాసం ఉపవాసం స్పెషల్స్. ఉపవాసం పూర్తయి నా బ్లాగు వస్తే ఊడిరాని గులాబ్ జామూనులు పెట్టనన్నమాట. ఈ సారి తప్పకుండా మంచి వంట చేసి పెడతా ధన్యవాదములు.
రిప్లయితొలగించండిజ్యోతిర్మయి గారు,
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ.