అబ్బాయి అమ్మాయి ని ఒకే చేసాడు. అబ్బాయిది సాఫ్ట్వేర్ జాబే, జీతం మరీ ఎక్కువా ,తక్కువా కాదు. ఆస్తి మాత్రం బానే ఉంది. అమ్మాయి ఉజ్జోగం వేరే రాష్ట్రం లో . అదీ పర్మనెంట్ కాదు కాబట్టి, పెళ్లి తర్వాత మనికి కావాల్సిన చోట జాబు చూసుకోవచ్చు అని అనుకొన్నారు . సంబంధం కుదిరింది. ఆర్భాటం గా ఎంగేజ్మెంట్, బంధు మిత్రుల సమక్షం లో పలు లాంచనాలు, కానుకలతో పెళ్లి జరిగాయి. పదహారు రోజుల పండుగ కూడా ముగించుకొని క్రొత్త జంట వారి వారి ఉద్యోగ విధుల్లో చేరిపోయారు. మొదటి ఆరునెలలు విడి విడి గ వేర్వేరు పట్టణాల్లో ఉంటూ , సెలవలుకు ఇంటికి వచ్చినపుడు కొత్త అల్లుడు మర్యాదలు అక్కడ, కొత్త కోడలు మురిపెం ఇక్కడా, ఇలా గడిచిపోయాయి. అమ్మాయి కి మొదటి రెండు మూడు నెలలు జీతం కి , అంతే మొత్తం కలిపి అత్త గారు బంగారు గాజులు చేయించి ఇచ్చింది.
మొత్తానికి ఆరునెలల తర్వాత దంపతులు ఒకచోటికి చేరారు. అబ్బాయి అంతే ఎంతో ప్రేమ ఉన్న అమ్మ, అక్క వచ్చి కావలసినవి అన్ని ఇంటి లో అమర్చి పెట్టి వెళ్లారు.అమ్మాయి క్రొత్త ఉద్యోగ ప్రయాలు మొదలు పెట్టింది. అలా పది రోజులు గడచాయి, స్వంత ఊరికి వచ్చారు. అబ్బాయి తల్లి దండ్రులతో చెప్పి బాధ పడ్డాడు, ఆ అమ్మాయి ఎప్పుడు ఎవరో అబ్బాయి తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది అని. పెద్దవాళ్ళ దాకా వచ్చాక విషయం విడాకులకు దారి తీసింది.
కోర్టు బయట సెటిల్మెంట్ జరుగుతుండగానే, మధ్యవర్తుల ప్రమేయం తో అమ్మాయి తరుపు నుండి రాజి ప్రయత్నాలు జరిగాయి. కాని అబ్బాయి వైపువారు, మధ్య లో అనుకొన్న మాటల వల్ల నొచ్చుకొని అంగీకరించలేదు, మొత్తానికి సెటిల్మెంట్ కుదిరి విడాకులు కుడా వచ్చేసాయి.
సమస్య ఎక్కడుంది. పది రోజుల కాపురాన్ని విడాకులదాకా తీసికెళ్ళిన కారణం సరైనదేనా?
idi commone kada...
రిప్లయితొలగించండిఅజ్ఞాత,
రిప్లయితొలగించండిఏది కామన్? మీ అభిప్రాయం కొంచెం వివరంగా చెపుతారా?
స్పందించినందుకు ధన్యవాదములు .
software engineers ki maatrame ilaa avutundaa??
రిప్లయితొలగించండిPlease Dont point to only SW Engg.
Govt job chestunna vaallu enta mandi ilaa veru verugaa vundatam ledu? entamandi divorce teesukovadam ledu?
prastutam society ilaa vundi ani cheppi opinion adigite inkaa baagundedemo kadaa andi?
SW Engg's life maatrame ilaa vuntundaa?? maroka job cheste ilaa vundadaa??
జాహ్నవి గారు,
తొలగించండినేను కూడా సాఫ్ట్వేర్ లోనే ఉన్నాను, కాబట్టి వారిపై ప్రత్యేకం గా విమర్శించి వ్రాసింది కాదు. GOVT జాబ్స్ చేస్తున్న వారిలో ఉండే సమస్యలు కొంచెం వేరు (think so). నాకు తెలిసిన సమస్యలు ఈ తరం లోనివి అన్ని దాదాపుగా ఐ టి జాబ్స్ చేస్తున్నవారివే ఉండటం యాదృచ్చికమే.
అయినా ఈ ఇద్దరు దంపతుల 'సాఫ్ట్ వేర్ ' ఉద్యోగాలకి, వాళ్ల జీతాలకి భాగస్వామ్యం పెళ్లి సంబంధం కలవడం లోను ఉంది, విడిపోవడం లోను ఉంది. నేను సమస్యను మాత్రమె చెప్పాను కాని నా విశ్లేషణ ను ముందే ఇవ్వలేదు.
నిజానికి ఇక్కడ అమ్మాయి తప్పేమీ లేదు, విడాకులకు అమ్మాయి అసలు కారణం కాదు. అబ్బాయి, తల్లిదండ్రులు కూడా మంచివారే . (కాదు అని ఎవరయినా భావిస్తే నిర్భాయ్మ్తరం గా వ్యాఖ్య లో తెలియచేయవచ్చు). అలా ఇద్దరిలో దురుద్దేశం లేకుండానే మరి ఎందుకు ఈ రెండు కుటుంబాలకు మానసిక క్షోభ కలిగింది? ఆ కారణాన్ని చర్చించడమే ఈ టపా ఉద్దేశ్యం.
గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేసే అబ్బాయిల విష్యం లో ఎంతమంది అమ్మాయిలూ ఎంగేజ్మెంట్ అయ్యాక ఈ అబ్బాయిని నేను పెళ్లి చేసికోను , ఈ అబ్బాయి నాకు వద్దు అన్నారు? నాకు తెలిసి చాల చాల తక్కువ. కాని సాఫ్ట్ వేర్ అబ్బాయి ల పెళ్ళిళ్ళు ఇలా ఆగిపోయినవి బోలెడు. ఇంకొన్ని ఆగిపోయేదాక వచ్చి సరి అయినవి కూడా ఉన్నాయి. ఈ విషయం లో మాత్రం అభినందించాల్సింది కూడా సాఫ్ట్ వేర్ నే.
సరే మీరన్నట్లు ప్రస్తుతం సొసైటి ఇలా ఎందుకు ఉందా అని చూస్తే కూడా ముఖ్యమైన కారణాలలో సాఫ్ట్వేర్ ఉంటుందనాదం లో మీకు సందేహం ఉందా ? మరొక శీర్షిక ను సరియైన కారణం తో సూచిస్తే మార్చడానికి అభ్యంతరం కూడా లేదు.
స్పందించినందుకు ధన్యవాదములు.
చిన్నిఆశ గారు,
తొలగించండిసాఫ్ట్వేర్ అనగానే కామెడి, టైమ్పాస్ టపాలే ఆశిస్తే ఎలా, నాకు టైమ్పాస్ కోసం బ్లాగు వ్రాసే అలవాటు అసలే లేదండీ. జాహ్నవి గారికి ఇచ్చిన సమాధానం లో సాఫ్ట్వేర్ కి ఉన్న సంబంధాన్ని కొంతవరకు వివరించాను చూడండి.
స్పందించినందుకు ధన్యవాదములు
సాఫ్ట్ వేర్ పెళ్ళిళ్ళు అని హెడింగ్ చూసి ఏదో పేరడీ అని చదివితే ఇదేదో సాఫ్ట్ వేర్ కి సంబంధమే లేని కధనంలా ఉంది...
రిప్లయితొలగించండిఇక్కడ బాధంతా గోప్యత మీద వచ్చిన అనుమానం. ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడుతోందో చెప్పి కుటుంబ సభ్యులకు భర్తకు వారిని పరిచయం చేసి ఉంటే సమస్య లేదు. అది జరగలేదు. కారణం తెలియదు. బీజం వృక్షమయింది.
రిప్లయితొలగించండి@kastephale గారు
రిప్లయితొలగించండిచక్కగా సెలవిచ్చారు. కాని మీకు అందని ఒక విషయం ఏంటి అంటే చాటుగా మాట్లాడడమో, వ్యక్తుల పేర్లు గోప్యం గా ఉంచడం కాని జరుగలేదు. కాని అడిగి తెలుసుకొనే విధానం , అర్ధం చేసుకొనే పద్దతి ముఖ్యం కదా. భార్య సంపాదన కాస్త ఎక్కువ ఉన్నపుడు, వివరం అడక్కుండానే అనుమానించే భర్తలని పెంచిపోషిస్తున్న సంస్కృతి, సంప్రదాయం మనది. ఏదేమైనా నష్టం ఇద్దరికీను.
స్పందించినందుకు ధన్యవాదములు
అబ్బాయికి అభినందనలు తెలపండి.
రిప్లయితొలగించండిఅజ్ఞాత,
తొలగించండిఅబ్బాయికి ఒక్కడికేనా, తన కుటుంబానికి, కాపురం నిలబెట్టడం చాతకాక విడాకుల దాక వ్యవహారం నడిపించిన బంధు మిత్ర సపరివారం అందరికి అభినందనలు. ఇంకా కేసును టేకప్ చేసి ఎవరెలా పోయినా తన ఫీజుకు మాత్రం లోటు రాకుండా పని కానిచ్చేసిన లాయర్స్ కి కూడా అభినందనలు చెప్పేద్దాం. మనకి పోయేదేం ఉంది ,ఏమంటారు :)
పెళ్లి ఖర్చు అమ్మాయి తరపు వాళ్ళది , విడాకుల ఖర్చు అబ్బాయి తరపు వాళ్ళది అన్నట్లుంది సంప్రదాయం :)
స్పందించినందుకు ధన్యవాదములు .
మౌళీ
రిప్లయితొలగించండిమీ వచనం లో ఉండే ఒక అస్పష్టతని ఈ పోస్ట్ లో అధిగమించారు.కధనం బావుంది.చివరిలో ప్రశ్నతో ముగించకుండా మీరే సమాధానం అన్వేషించి ఉంటే బావుండేది.
మల్లీశ్వరి.
జాజిమల్లి గారు,
తొలగించండివచనం గురించి మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. జాహ్నవి గారికి చెప్పినట్లుగా ఉద్దేశ్యపూర్వకంగానే నా విశ్లేషణ ని టపాకి చేర్చలేదు. చదువరుల అభిప్రాయాలకి, సందేహాలకి మొదటి ప్రాధాన్యత ఇవ్వదలిచాను.
data insufficient to offer any suggestion.
రిప్లయితొలగించండిNarayanaswamy గారు
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యలు అన్నీ స్పాం లోకి వెళ్ళాయి ఎందుకో, ప్రచురించడం ఆలస్యం అయ్యింది మన్నించాలి. మీరన్నది నిజం, ఈ వివరాలతో సలహా కాని తప్పు ఎవరిది అని కాని చెప్పలేము . మరిన్ని ప్రశ్నలు అడగాలి. కాని అలా జరగడం లేదు, మనకి ఎవరు తెలుసో వారి వైపు మాత్రం విని అవతలి వారిని తప్పు పట్టేస్తున్నారు.
నా విశ్లేషణ ని త్వరలో అందిస్తాను .
*పెళ్లి ఖర్చు అమ్మాయి తరపు వాళ్ళది , విడాకుల ఖర్చు అబ్బాయి తరపు వాళ్ళది అన్నట్లుంది సంప్రదాయం *
రిప్లయితొలగించండిచాలా మంచి పాయింట్ చెప్పారు. ఇన్ని రోజులు సాంప్రదాయం అది ఇది అని బ్రహ్మణుల సంస్కృతి సమాజం మీద రుద్దారు. వాళ్ల ప్రభావం నుంచి సమాజం త్వరగా బయటపడుతున్నాది. ఇప్పుడంతా భూస్వామ్య కర్పోరేట్ సంస్కృతి. ఎన్ని విడాకులు ఎక్కువైతే అంత మంచిది. అన్ని కులాలలో రమారమి విడాకుల కి అయ్యే ఖర్చు తెలుస్తుంది. ఆ డేటాతో అబ్బాయిలు, మీరు పెళ్లి చేసుకోవాలనుకొంట్టున్నారా? దాని సక్సెస్ శాతం ప్రస్తుతం ఇంత. దానివలన రిస్క్ ఇంతా, ఖర్చుఇంతా, విఫలమైతే అయ్యే ఖర్చు ఇంతా అని లెక్కలు గట్టి, ఈ తలకాయనొప్పులు లేకుండా మీకు ప్రత్యేక సదుపాయాలతో పెళ్లి అనే పేరు లేకుండా అన్ని సర్విసులు సరసమైన ధరలలో అందిచటానికి ముందుకువస్తారు. అబ్బాయిల తల్లిదండృలే ఆప్రకటనల వైపు ఆకర్షితులయ్యి, పెళ్లొక దండగా, ఈ పేకెజే బాగుంది చూడూ అని పిల్లలకు, ఆ పేకేజి చాలా బాగుందని ప్రోత్సహించినా ఆశ్చర్యపోనవసరంలేదు. ఎది ఎమైనా మళ్లి అబ్బాయీలకు మంచి భవిషత్ ఉందని,వారికి మంచిరోజులు వస్తున్నాయని అనిపిస్తున్నాది.