18, జూన్ 2012, సోమవారం

ఇంకొక ప్రేమ జంట ఆత్మహత్య, కారణమెవరు ?

పుట్టి భూమ్మీద పడగానే చిన్నారులకు సమాజం వల్ల బోలెడన్ని బాధ్యతలు వచ్చేస్తున్నాయి. అబ్బాయి ఉన్నాడు అంటే, వరసయ్యే  అమ్మాయిని భార్యగా పరిచయం చేస్తారు. ఆడపిల్ల తండ్రి కాస్త ఎక్కువ సంపన్నుడై,  అమ్మాయి కి రూపం చదువు అబ్బి ఉంటె అతనిపై రెట్టింపు బాధ్యత ఉంటుంది తగిన అల్లుడిగా తనను తను ప్రూవ్ చేసికోవడానికి.  ఏ అమెరికానో ఆస్ట్రేలియా నో వెళ్లి చదివి తిరిగొచ్చి అమ్మాయిని పెళ్లాడాలి. ఆ చిన్న మనసు ఎంత వత్తిడి తట్టుకోగలదు !!!


 సరే మామయ్య అల్లుడిని  తిరస్కరించాడు. అయితే జీవితం అక్కడితో ఆగిపోదు కదా. ఆశలు కలిపించమని తాను అడిగేడా, చిన్న తిరస్కారం అయినా తన ప్రపంచాన్ని మార్చెయ్యదా . ఆ బాధ అంతా పక్కింటి ఇంకో అమ్మాయి పై ప్రేమ గా మారింది, కాని కులాల మధ్య అంతరాలు ఆ అమాయక పెద్దల్ని మరొకసారి దోషుల్ని చేసింది. ఇద్దరు వెళ్లి పోయారు. చెయ్యని ప్రయత్మ లేదు ఆచూకి కోసం. కొద్దిగా తెలిసాయి కాని ఇరవై రోజులతరువాత గోవా నుండి కబురు, ఇద్దరు ఆత్మహత్య చేసికొన్నారు,  SIM Card ఆధారం గా అడ్రస్ ట్రేస్ చేసి తెలియపరుస్తున్నాము అనీను.ఆంద్ర రాష్ట్రం నుండి గోవా దాకా వెళ్ళారా కలిసి జీవించలేని పరిస్థితుల్లో ఆత్మహత్య కోసం !! అందరికీ దూరం అవ్వలేని సున్నితత్వం, కలిసి ఎక్కడో ఒకచోట బ్రతుకలేని నిస్సహాయత .అయినా చేతులారా ప్రాణం ?  ఎలా ఆ కుటుంబాన్ని ఎలా ఓదార్చాలో తెలియడం లేదు.   ఆత్మ హత్య కావచ్చు ఇంకోసమస్య కావచ్చు, మానవ సంబందాలన్నే ఆర్దికసంబందాలన్న భావన సమాజం లో అంతర్లీనం గా పెనవేసుకుపోయింది. ఎక్కడ పొరపాటు జరిగిందీ తెలియని ఎందరో తల్లిదండ్రుల గుండెకోత కు సమాధానం ఎవరు వివరిస్తారు.  ఇంకొకరు ఇలా బలి కాకూడదు అని చిన్న ఆశ తో ఈ టపా. ఆ ఇద్దరి ఆత్మకు శాంతి కలగాలని !!!

1 వ్యాఖ్య: