9, సెప్టెంబర్ 2012, ఆదివారం

కమ్యూనిజమూ కమామీషూ

శీర్షిక చూడగానే తల  పట్టేసుకున్తున్నారా ? అబ్బే నేనే పుస్తకాలు సదవలే,  కాబట్టి అంత సినిమా  లేదండీ. కాపోతే  మనికి కుడా ఈ ఇసయం తో కూసంత పని బడింది. మరి మన పని అవ్వుద్దో లేదో గాని, ప్రయత్నిస్తే పోలా !!

 మన పనేదో సెప్పే ముందల, మనకేమి అరదం అయ్యిందో చెప్పుకుందాం. సంపాదించిన సొమ్ములో ప్రతి నెలా ముప్పై శాతం ప్రతి ఒక్కరూ ధర్మం చేసేత్తే చాలు కమ్యూనిజమూ కాకరకాయా అవసరమే లేదు దేశానికి. సరే
మళ్ళీ ముప్పై శాతం  ఎందుకు  , టాక్సు లు గట్రా పడేత్తన్నాము గా అంటే, గుళ్ళో హుండీ లో రూపాయి బిళ్ల  వెయ్యడం మానేయ్యండి.

సరే సరే , సూత్తా సూత్తా ముప్పై శాతం అంటే ఎట్టా కుదురుతదీ అంటే , తప్పదు మరి. కలేజా సైన్మా లో మహేశ్ బాబే ముందల కాదు కూడదు అని ఖరాఖండిగా సెప్పి కూడా తప్పించుకోలేక  పొయ్యాడు, మనమెంతా ?

అయినా మన సేత్తో మనము చెయ్యకపోతే , హుండీ లో రూపాయి వేసిన పాపానికి, ఆ  దేవుడు మన పాపాలు కడిగెయ్యడానికి ఈ కమ్యునిష్టులని పుట్టిస్తన్నాడేమో!!. మరి దేవుడు అందరినీ  మంచోల్లనే పుట్టించడు గా, వాళ్ళలో కూడా కొన్నాళ్ళకి సంపాదన వైపు వెళ్లి మనలా మారిపోయ్యేవాళ్ళు కొందరు వచ్చేస్తారు. అప్పుడు మన బలం పెరిగి 'పాపం' కూడా ఇంకా  ఎక్కువయి పోతుంది. షరా మామూలు.

ఇదంతా ఆసికాలికి వ్రాశా కాని , కమ్యూనిజం ఇక్కడ  నేను   అడిగే  రెండు, మూడు   ప్రశ్నలకి జవాబు చెబుతుందా ?????  అబ్బే పెద్ద ప్రశ్నలు కాదండీ , చిన్న చిన్నవే !

1.  ఈ టపా లో   దత్తత సమస్య పై చర్చించాను. మరి కమ్యునిజం కేవలం ఆస్తి మైకం లో తీసికొనే దత్తతలను    ప్రశ్నిస్తుందా ? ఆ పసి వాళ్లకు ఆస్తులకు ఆతీతం గా ప్రేమను అందిస్తుందా ?  ( ఒకటి కాదు రెండు కాదు ,  మూడు ప్రాణాలు బలి అయ్యాయి మరి ఈ సమస్యలో )

2. ఇంకో టపా లో ఈ అబ్బాయికి పెళ్లి అంటే కట్నాలు కానుకలు, నెల నెలా  జాబు లో సంపాదించే జీతం కాదని  చెపుతుందా? లేక బాగా చదివే పక్కింటబ్బాయి సంపాదనతో పోల్చుకొని స్త్రుగుల్ అవ్వద్దని ఆ అబ్బాయి కి నేర్పుతదా?  తల్లిదండ్రులకు అబ్బాయి ఏదో ఒక లా చదివి చిన్నదయినా పెద్దదయినా ఉద్యోగం లో చేరితే చాలు అన్న మూస లో ఆలోచించి సమస్యల పాలవ్వద్దు అని చెపుతుందా?

అబ్బాయి కి ఎప్పుడు చదువు, ఉద్యోగం అన్నవి జీవిత సమస్యలు కాకుండా చేస్తుందా (చేతనయ్యింది చేసి బ్రతికే అవకాశం చాలదా? )

అమ్మాయిలకి, అబ్బాయిలకి  అమ్మా నాన్న సంబంధం చుస్తే తప్ప తన పెళ్లి తను అరేంజ్ చేసుకొనే  ఆలోచనని ఇస్తుందా ?

అమ్మాయి తనకన్నా తక్కువ సంపాదించే అబ్బాయి పెళ్లి చేసుకొని, కట్న కానుకలు అతని ఆస్తికి తగ్గట్టు గా సమర్పించి మరీ .. ఇంకా అతని లో న్యూనత కి తన జీవితాన్ని బలి చేసుకోకుండా ఉండగలదా ? అంతెందుకు ... ఎక్కువ సంపాదించే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అబ్బాయి లో ఇతర ఆలోచనలు రాకుండా ఆపగలదా ?

3. మరి ఈ టపా లో  మీ కమ్యూనిజం ఆ అబ్బాయికి తన లైఫ్ తాను నిర్ణయించు కొని ,స్వేచ్చ గా బ్రతికే సదుపాయాన్ని ఇస్తుందా?????

ఇవన్ని ఇస్తే ఇంకేది ఇవ్వకపోయినా పర్వాలేదు. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తా!!! లేదంటే కాపిటలిజమో, కమ్యునిజమో  ఏ రాయైతే నేఁ ??
5 వ్యాఖ్యలు:

 1. 1. కమ్యూనిజం ఆస్తినే ప్రశ్నిస్తుంది. ఇంక దత్తత గురించి వేరే చెప్పాలా?
  2.ఆ అబ్బాయికి తన ఇష్టమైన రంగం లో ఫ్రీ గా చదువు చెప్పిస్తుంది. కమ్యూనిజం లో ఎవరి దగ్గరా అవసరానికి మించి డబ్బు ఉండదు. ఏ అవసరానికి దాని సంబంధమైన కూపన్లు ఇస్తారు.
  చదువు ఐన తరువాత ఉద్యోగం చూపించే బష్యత ప్రభుత్వానిదే!
  సామ్యవాద విలువల ప్రకారం అరేంజెడ్ మారేజ్ బూర్జువా విలువల లో ఓ భాగం. కాబట్టీ సామ్యవాద విలువల తో పెరిగిన వాడు ఎరేంజెడ్ మారేజ్ చేసుకోడు.
  కమ్యూనిజన్ లో అతి డబ్బూ ప్రైవేట్ ఆస్తీ ఉండవు. ఇంకా కట్న కానుకల ప్రసక్తి ఎక్కడిది?
  ఇతర అమ్మాయిల మీద మనసుపోకుండా కమ్యూనిజం ఆపలేదు. ఇది దాని పరిధి లో లేదు. ఇది బయలాజికల్ అవసరం. అతని భార్యకీ, ఇతర అమ్మాయికీ అభ్యంతరం లేకపోతే, కమ్యూనిజానికీ అభ్యంతరం లేదు. భార్యకి అభ్యంతరమైతే, ఆమె చక్కగా విడిపోవచ్చు. ఆమెకు ఎటువంటి స్టిగ్మా అంటదు.
  3. చూడుడు పాయింట్ 2 మొదలు ని.
  అయితే పైవన్నీ ఆదర్శవంతమైన కమ్యూనిజం లో . ప్రాక్టికల్ గా పరిస్తితి వేరు గా ఉంటుందని చెప్పక్కర్లేదనుకొంటా! ఇక కాపిటలిజం అంటూ ఏమీ ప్రత్యేకం గా ఓ ఆదర్శం ఏమీ లేదు. "ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటి కా మాటలాడి , నొప్పించుక, తానొవ్వక, తప్పించుక తిరుగు వాడె నేర్పరి సుమతీ", అనేది కాపిటలిజం విలువలకి దగ్గర గా ఉంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నేను కూడా ఆదర్సవంతమైన కమ్యునిజం ని ఆశించి ప్రశ్నించడం లేదండీ కాని ఇప్పుడు ఉన్న సమాజంలో ఎలా మనుగడ సాగిస్తుంది, ఉన్న సమస్యలకు ఏదో ఒక పరిష్కారం చూపించగలిగితేనే కదా

  1. ఇప్పటి రోజుల్లో ఆస్తిని ప్రశ్నించి కమ్యునిజం మనగలుగుతుందా అన్నది ముఖ్యమైన సందేహం

  2. చదువు , వుద్యోగం వరకు ఒకే . కాని పెళ్లి మీరన్నట్లు సాధ్యం కాదు . సామ్యవాద వాతావరణం లో పెరిగినా కుటుంబ పరిస్థితులు బట్టి అరేంజ్డ్ మ్యారేజ్ ని కూడా అనుసరిస్తారు ( వ్యక్తిగత ఆస్తి, ఉద్యోగం అన్న ముఖ్య కారకాలు ఇంకా ఉంటాయి కదా )

  కమ్యునిష్టు పెళ్ళిళ్ళలో విడాకులు భరణం ఉండవా ?

  ప్రత్యుత్తరంతొలగించు
 3. పిల్లలని ప్రభుత్వమే పెంచుతుంది. ఆడవారు కూడా తప్పనిసరి గా తమ ఇష్టమైన ఉద్యోగాలు చేస్తారు. కానట్టీ భరణం భర్త ఇవ్వడు. వ్యవస్థ ఇచ్చే ప్రత్యేక సదుపాయాలు (బయలాజికల్ ప్రత్యేకతలను దృష్టి లో పెట్టుకొని) ఉంటాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. "..కాని ఇప్పుడు ఉన్న సమాజంలో ఎలా మనుగడ సాగిస్తుంది, ఉన్న సమస్యలకు ఏదో ఒక పరిష్కారం చూపించగలిగితేనే కదా?"
  There are no half measure in actual communism. First the existing order will be destroyed. Then new ideal order will be built.

  Parliamentary democratic communism is diluted, revised form of the actual marxism

  ప్రత్యుత్తరంతొలగించు
 5. కూడా ఆదర్సవంతమైన కమ్యునిజం ని ఆశించి ప్రశ్నించడం లేదండీ కాని ఇప్పుడు ఉన్న సమాజంలో ఎలా మనుగడ సాగిస్తుంది,
  There's no half measures in actual communism. The existing order will be destroyed by armed struggle.Then the new ideal order will replace old one.
  The CPI, CPM way of parliamentary communism is a diluted, revised one.

  ప్రత్యుత్తరంతొలగించు