13, నవంబర్ 2011, ఆదివారం

'మొగుడు' సినిమా ఎ౦దుకు ఆకట్టుకోలేక పోయినది?

మొదటిభాగం ఇక్కడ చూడగలరు .  రె౦డవ భాగం లో ఎ౦టర్టైన్మె౦ట్ ఉండదు, కారణాలనేకం.

౧. సాధారణం గా కృష్ణవంశీ తన సినిమాల్లో ప్రత్యేకంగా కామెడి ట్రాక్ పెట్టడు. హిరో, హిరోయిన్ మిగిలిన కారెక్టర్లు వారి వారి స్థాయి లో హాస్యాన్ని కూడా పండించాలి.

౨. రెండవ భాగం లో హాస్యానికి చోటు లేదనే చెప్పాలి. అమ్మాయి 'పెళ్లి లో తాళి విసిరి కొట్టాక' కామెడీ సీన్లు పెడితే దర్శకుడి మొకాన చెప్పులేస్తారు జనం :)  అప్పటికీ హిరోయిన్ జెలసి, ఉక్రోషం లో కాస్త హ్యుమర్ పెట్టాడనుకో౦డి. బీచి పాట కుడా బాగుందట మరి. 

దర్శకుడు సమస్యను ప్రభావ వంతం గానే చెప్పాడు ఇ౦టర్వెల్ బాంగ్ వరకు. ఒక  వైపు ఈ సంప్రదాయం ఉన్నది (ట)  కాబట్టి అర్ధం లేని లాజిక్ అనుకోడానికి లేదు.  అబ్బాయి తండ్రి మూర్ఖపు పట్టు పట్టగానే  రోజా కుడా  చక్కని సమాధానం చెపుతుంది .

మన పెళ్లి సంప్రదాయాలలో ఇరువైపులా వాదన జరిగితే అమ్మాయి వైపు వారు సర్దుకుపోవడం తప్పని సరి అన్న దురాచారం కూడా ఉంది. ;-)  అలా  మగ పెళ్లి వారు చేసిన చిన్న పొరబాటు అ౦దరి మనోభావాలు  గాయ పడి పోయే స్థితి వచ్చేస్తుంది. అమ్మాయి అతన్ని  నువ్వు నాకొద్దు అనేంత. 

ఇప్పటి సమాజం లో మేలు కోరి ము౦దుకు వచ్చే  మధ్యవర్తి భూతద్దం పెట్టినా దొరకడు(దు). మనకెందుకు వచ్చిన గొడవ అనుకునేవారు, మన మాట వింటారా అని ఆగిపోయే వారు,  మనమే రైటు వాళ్ళని అది చేద్దాం ఇది చేద్దాం అనే వారును (రెండు వైపులా ). అలాగే సినిమా లో ఈ మూడవరకం మధ్యవర్తి ఒకాయన వెళ్లి మాట్లాడగానే , అబ్బాయి తండ్రి కూడా భేషజాలకు పోయి తన డిమా౦డ్ ని చెప్పి పంపుతాడు. ఆ మధ్యవర్తి కాస్తా  (తెలిసో ,తెలియకో ) పచ్చగడ్డి వేసేస్తాడు.  ఇంకేముంది మంత్రి గారు గృహహింస కేసు లా౦టిదె వేసేస్తారు.

సాధారణం గా  గృహహింస నేరం పై కేసు పెట్టడం అమ్మాయి వాల్లకేం సరదా ఉండదు. వాళ్ళ పెయిన్ ఏమిటో కూడా తెలుస్తుంది.  సరిగా చూస్తే. ఒక వివాహం చెడిపోతే నష్టం కేసు ఓడిపోయినా వారికే కాదు. ఇద్దరిదీను , కాని పురుషాహంకార సమాజం లో దీని అవసరం తప్పని సరి. గోపి చంద్ కూడా ఆ సమాజం లో ని మనిషే , తప్పు సరి చేసికోవాల్సిన సమయం లో ఇంకో పొరపాటు చెయ్యడం వలన వచ్చిన పర్యవసానం, విడాకుల కాగితాలపై సంతకం పెట్టేస్తాడు .ఆ తరువాత తన తప్పు ను సరిదిద్దుకునే  అవకాసం వస్తుంది,  అప్పటికీ పెద్దవారి పౌరుషాలు తగ్గవు. అలా అందరిని ఒప్పించి ఒక మంచి ముగింపు ఇవ్వడమే ఈ చిత్ర కధా కమామీషునూ. 

రెండవ భాగం లో  ప్రేక్షకుల ముందు పంచాయితీ పెట్టినట్లుగా ఉంటుంది. డబ్బులు పెట్టి మరీ పక్కవాడి సంసారం గొడవ చూడాలంటే విసుగెయ్యదూ. ఫ్రీ గా అయితే పర్లేదు కాని.  ఈ సినిమాకి  టార్గెట్ ఆడియన్స్ ఎవరు అంటే సమాధానం దొరకదు. ఎవరు తమని , తమ కుటుంబాలని అక్కడ ఐడెంటి ఫై చేసికోలేరు,ఇష్టపడరు  కాబట్టి.   కాకపొతే కొన్ని సంవత్సరాల తరువాత కృష్ణవంశీ వెనక్కి తిరిగి చూసుకొంటే ఈ సినిమా ఉంటుంది, ఒక తరాన్ని ప్రతిబింబిం చేందుకు. చూడటం చూడకపోవడం అన్నది ఎవరిష్టం వారిది.6 వ్యాఖ్యలు:

 1. గృహహింస కేసులు ఎవ్వరూ సరదాగా పెట్టరండీ. పగలూ ప్రతీకారాలు తీర్చుకోవడానికి, చట్టాన్ని సాధనంగా వాడుకోవడం అనేది గృహహింస విషయం మీద పెట్టే కేసులలో మనం సాధాఋఅణంగా గమనించవచ్చు. ఇది సరదాగా పెట్టినది కాకపోయినంత మాత్రాన తప్పు కాకుండా పోదు కదా? మీరన్నట్టే అనుకుంటె, మగవారు కూడా ఏదీ సరదాగా చేయరు, చివరకు స్త్రీలపి వివక్షతో సహా. అది కేవ్లం సమాజములో ఇదివరకే ఉన్న కొన్ని నమ్మకాల కారణంగా మత్రమే వస్తుంది. అందుకని సమర్ధించేస్తారా?

  నిజానికి మగవారు వ్యతిరేకించేది, గృహహింస చట్టాన్ని కూడా కాదు. అందులోని వివక్షని, ఆదవారంతా రాజా హరిస్చంద్ర వంసపు వారసులు వారు అబద్దమే చెప్పరు అన్నట్టుగా రూపొందించిన విధానాన్ని, ఇంతా చేసి, గృహహింస చట్టాం దుర్వినియోగం అయ్యిందని తేలినా కూడా ఆస్త్రీకి ఎటువంటి శిక్షా లేనటువంటి పరిష్తితిని మగవారు తప్పు బడుతున్నారు.

  ఆ చట్టలు స్త్రీ అనే పదము ఉన్న చోట స్త్రీ/పురుషుడు అనే దానితో replace చేసి చట్టము చేయమనండి ఎవ్వరు మాత్రం ఎందుకు అభ్యంతరము చెబుతారు? అలాకాదు, దుర్వినియోగం చేసిన స్త్రీకి శిక్ష ఉడేట్లుగా చట్టాన్ని సవరించ మనండి. అది చేయరు.

  ఆడవారు తమను తాము తప్పన్నదే చేయని మంచివారుగా చిత్రించుకోవడం మానితే మంచిది. అది నిజం కాదు.కేవలం ఆత్మ

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శ్రీకా౦త్ గారు,

  మనకు సాధారణం గా కనిపించే గృహహింస కేసుల్లో అమ్మాయి తరపు వారు చెప్పేవి నిజాలు కాకపోవచ్చు, కొండొకచో ఒకటి రెండు నిజాలున్నా మన కళ్ళతో చూడము . అదే సమయం లో అబ్బాయి/ అతని వారు నిజమే చెబుతున్నారనడానికి వాళ్ళ మీద మనకున్న ప్రేమ, 'మనవాళ్ళు కాబట్టి నమ్మాల్సిన స్తితి' తప్ప ఇంకొక ఆధారం వుండదు. కాని తప్పు ఒప్పుల సంగతి పక్కనా పెడితే పొరపాట్లు, అహంభావాలు ఇరు వైపులా ఉంటున్నాయి. మనకి మనం నాణెం కు ఒక వైపునే చూడగలం ప్రస్తుత సమాజం లో . రెండవ వైపు చూడాలంటే మన వారికే దూరమైపోతాము కుడా :)

  వివాహ నిశ్చయం లోనే సమస్యలకు బీజం పడే విధం గా ఉంటున్నాయి. కారణం వారి చుట్టు వున్న పరిస్థితులే కాని వారు కాకపోవచ్చు.

  ఒకటి, మధ్యవర్తిత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి (ఇ౦తకు ము౦దు రోజుల్లో ఉండేది ), లేదా వారి సమస్యను వారే తేల్చుకోవాలని అబ్బాయి, అమ్మాయిలకి వదిలెయ్యాలి (కనీసం కొన్నాళ్ళు ). ఆ రెండు మాత్రం జరగడం లేదు. మన అబ్బాయి, మన అమ్మాయి మనకి బాగా తెలుసు అనుకోవడం భ్రమ అయ్యే అవకాశాలు లేకపోలేదు కాదన గలరా ?

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మౌళిగారూ..!
  "మొగుడు" సినిమాని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారో నాకు సరిగా అర్థం కాలేదుగానీ., పైనున్న కొన్ని వాక్యాల్లో కొద్దికొద్దిగానే తెలుస్తోంది.
  //అబ్బాయి తండ్రి మూర్ఖపు పట్టు పట్టగానే రోజా కుడా చక్కని సమాధానం చెపుతుంది//
  అబ్బాయి తండ్రి (రాజేంద్ర ప్రసాద్‌) మూర్ఖపు పట్టు పట్టాడన్నారు. నిజానికి అక్కడ మూర్ఖపు పట్టు పట్టింది అమ్మాయి అమ్మమ్మ. అంటే రోజా తల్లి..!
  //అబ్బాయి తండ్రి కూడా భేషజాలకు పోయి తన డిమా౦డ్ ని చెప్పి పంపుతాడు//
  ఆ సన్నివేశంలో రాజేంద్ర ప్రసాద్‌, చాలా పద్ధతిగా మాట్లాడితే, గోపీచంద్‌ అవేశపడతాడు. రాజేంద్ర డిమాండ్‌ చేసినట్టు అస్సలు అనిపించలేదు.

  ఇహపోతే, ఆ సినిమాలో రోజా పాత్ర "తప్పుడు కేసులు బనాయించే మంత్రి"గానే కృష్ణవంశీ చూపించాడు. రోజా ఇంట్రడక్షన్‌ సీన్‌ మనకి అర్థం కావడానికే పెట్టినట్టుంది. మొత్తంగా ఆ సినిమాలో "వరకట్నం కేసు" పెట్టేంతవరకూ అబ్బాయి తరఫువాళ్ళు "రాజీ"కోసమే ప్రయత్నిస్తే, అమ్మాయి తరఫువాళ్ళే భేషజాలకి పోయినట్టుగా చూపించాడు కృష్ణవంశీ.

  కృష్ణ వంశీ అంతర్లీనంగా చూపించినదేంటంటే, పెళ్ళిళ్లలో గొడవ జరిగితే, బయట్నుంచి (అంటే పోలీసులు, చట్టాలూ వగైరా) వచ్చే సపోర్ట్‌ అమ్మాయి తరఫువాళ్ళకేనని..!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. వామనగీత గారూ

  @నిజానికి అక్కడ మూర్ఖపు పట్టు పట్టింది అమ్మాయి అమ్మమ్మ. అంటే రోజా తల్లి..!

  :) లేదు, అందరి కన్నా సామరస్యం గా మాట్లాడేది అమ్మాయి అమ్మమ్మ నే. మళ్ళీ చూడండి

  @రాజేంద్ర డిమాండ్‌ చేసినట్టు అస్సలు అనిపించలేదు.

  :) అనిపించదు .విష్యం గోపి చంద్ చెబుతాడు. ఎం చెయ్యాలో అది చెయ్యమని అబ్బాయి తండ్రి నర్మగర్భం గా చెపుతాడు. కాని గోపి చంద్ అన్నది తప్పని చెప్పడు.

  ఇంట్రడక్షన్ లో ఆమె మంత్రి అని చెప్పినంత మాత్రాన, అమ్మాయి తల్లిగా రోజాను చక్కగా నార్మల్ గానే చూపించారు. రాజేంద్ర ప్రసాద్ లానే.

  @మొత్తంగా ఆ సినిమాలో "వరకట్నం కేసు" పెట్టేంతవరకూ అబ్బాయి తరఫువాళ్ళు "రాజీ"కోసమే ప్రయత్నిస్తే,

  మీరు చెప్పే రాజీ ఏమిటి . రోజా వెళ్లి రాజేంద్ర ప్రసాద్ కాళ్ళు పట్టుకొని క్షమార్పణ చెప్పడమా :)

  హ హ అసలక్కడ పోలీసు సపోర్టు ఎవ్వరికి లేదు. వాళ్ళే చెబుతారు మాదాక వద్దు అని.

  కృష్ణవంశి అలా అమ్మాయి, తరపు కాని అబ్బాయి తరపు కాని తీసికోలేదు.ఇద్దరి లో తప్పులు చెప్పాడు. అందుకే జనం కి నచ్చలేదు.

  btw నేను కృష్ణవంశి కి అభిమానిని అనుకునేరు, అసలు కాదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మౌళి గారు,

  మీరు పూర్తిగా పొరబడుతున్నారు. నేను చెప్పేది, కోర్టులో విచారణ తరువాత ఆమె చెప్పేది తప్పు అని నిరూపణ అయిన కేసుల గురించి, కనీసం వాటిలో అయినా అమ్మాయిలకు శిక్ష పడాలి కదా? కానీ అలా జరగౌ. తప్పుడు కేసులు పెట్టినందుకు ఆమెను చిన్న మాట కూడా అనకుండా నెపాన్ని పురుషాధిక్య ప్రపంచం మీద నెట్టడం మనం గమనించ వచ్చు.

  పొరపాట్లు అహంభావాలు ఇరువైపులా ఉన్నప్పుడు మరి శిక్ష మాత్రం మగవారికి వారి కుటుంభ సభ్యులైన పాపానికి అమ్మకు చెల్లికి మట్రం ఎందుకు? పైగా, ఆ కేసులు పెట్టి బెదిరింపులు, డబ్బులు గుంజడాలూ చాలా జరుగుతాయి. కొన్ని కొన్ని సార్లు మగవారిని వారి సొంత ఇంటిలోనుండి వెలివేయడం జరుగుతుంది. ఖర్మ కాలి అతను ఆ ఇల్లును ఏ EMIలు కడుతూనో కొనుంటే, మహరాని వారు దర్జాగా ఇంట్లో ఉంటారు. అతను మాత్రం బయట అద్దె ఇల్లు తీసుకుని ఆ ఇంటిక్ ఇ మాత్రం EMIలు కడుతూ బతకాలి.

  అంతేనా, అతని పిల్లలతో అతను కలిసి గడపడం కూడా కుదరదు. తండ్రి అనే వాడు విజిటర్ అనే స్థాయికి దిగజారి పోతాడు. కేవలం ఆడవారి మీద ఉన్న ప్రేమతో ఇవన్నీ చూసీ చూడనట్లు వదిలేయ మనడం భావ్యం కాదు. పరిస్థితులకు కారణం ఎవ్వరు అంటే, ఫలానా అని చెప్పలేం. కానీ, అన్యాయమైపోయేది మాత్రం మగవారే..!!

  ప్రత్యుత్తరంతొలగించు
 6. శ్రీకాంత్ గారు,

  @ కోర్టులో విచారణ తరువాత ఆమె చెప్పేది తప్పు అని నిరూపణ అయిన కేసుల గురించి, కనీసం వాటిలో అయినా అమ్మాయిలకు శిక్ష పడాలి కదా?

  అన్ని కేసుల్లోనూ ఇదే తీర్పు వుంటుంది, ఇంత చిన్న విషయం మీకు తెలియదు అనుకోను .అలాగే సాక్ష్యాలు ,ఆధారాలు ని బట్టి మాత్రమె తీర్పు ఇస్తున్నామని ముందే చెప్తారు :)

  ఇక మనం చర్చిస్తున్న కేసుల్లో సాక్ష్యాధారాలు ఉండవు చాలావరకు.

  @పొరపాట్లు అహంభావాలు ఇరువైపులా ఉన్నప్పుడు మరి శిక్ష మాత్రం మగవారికి వారి కుటుంభ సభ్యులైన పాపానికి అమ్మకు చెల్లికి మట్రం ఎందుకు?

  మీకు అలా అనిపిస్తే, అదే నిజం కాకపోవచ్చు.

  @ పైగా, ఆ కేసులు పెట్టి బెదిరింపులు, డబ్బులు గుంజడాలూ చాలా జరుగుతాయి.

  డబ్బులిచ్చి వదిలించు కోవాలని తహ తహ లాడే వారికి మన సానుభూతి అవసరం లేదు. తన మీద తనకి నమ్మకం ఉన్నవాడు అస్సలు డబ్బు ఇవ్వడు.

  @తండ్రి అనే వాడు విజిటర్ అనే స్థాయికి దిగజారి పోతాడు.

  తండ్రి ది ఏ తప్పు లేకుండా ఈ పరిస్థితికి దిగజారలేడు.

  @కేవలం ఆడవారి మీద ఉన్న ప్రేమతో ఇవన్నీ చూసీ చూడనట్లు వదిలేయ మనడం భావ్యం కాదు.

  మీకు తెలిసినది, నాకు తెలిసినది మగవారే ఇక్కడ. కాబట్టి మనకి తెలిసిన వారి తప్పొప్పులు మొదట విచారించాలి. మేము ఆడవారి మీద ప్రేమ తో మీ అభిప్రాయాలు ఒప్పుకోవడం లేదనుకోవడం కేవలం మీ భ్రమ. మీకు మగవారి మీద ప్రేమ ఉంటే, వాళ్ళెం చేసినా సమర్ధిస్తారా ?

  ఇది మీ వ్యాఖ్య కు సమాధానమే కాని, మిమ్మల్ని విమర్శించడం కాదని అర్ధం చేసుకోగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు