ఈనాడు పేపర్ అలవాటయ్యాక ఇంకో పేపర్ అస్సలు నచ్చదనుకుంటా. అందుకే కాస్త టైమ్పాస్ కి న్యూస్ చూడాలి అంటే వేళ్ళు అలవోకగా ఈనాడు. నెట్ అని వెళ్ళిపోతాయి. ఒక్కటే సమస్య ఏదన్నా న్యూస్ పంచుకొందామంటే అక్కడినుండి బ్లాగులోకి అంట తేలిగ్గా రాదు.
ఏదేమైనా ఒక మంచి వార్త చూసాను, చూడగానే అబ్బో ఇలాంటి వార్తలు కూడా ప్రచురిస్తున్నారా అని ఆశ్చర్యం వేసిందంటే మరి అంత ఘాటుగా ఉంది. ఈ మధ్య పాత జడ్జీలు కూడా ఇష్టం వచ్చినట్లు సంజయ్ దత్ కి బెయిలివ్వాలనీ, ఇంకేదో పనికోమాలిన స్టేట్మెంట్ లు ఇస్తుంటే ఈ జస్టిస్ కట్జూ గారేమో మంచి ఆసక్తికరమైన వ్యాఖ్యానం చేసారు. ఈయన ఇంతకూ ముందు కూడా ఇలానే బుద్దిగా మాట్లాదేరో లేదో ఒకసారి చెక్ చేద్దాం అంటే బద్ధకం వేసి ఇప్పటికిలా కానిచ్చెస్తున్నా. మీకు తెలిస్తే మాత్రం చెప్పండే
మొత్తానికి చాన్నాళ్ళ తర్వాత ఇ లాంటి వ్యాఖ్యలు చూసాను. ఏంటో జీవితం దేనికైనా రెడీ సిన్మా చూసాము అని చెప్పాలంటే ఒక తెలిసిన ఫామిలీ కక్ష పెట్టుకుంటుందేమో అనుమానమ్. నా ఇంకో ప్రియనేస్తం ముస్లిం. పనికిరాని సినిమాల సంగతి సరే. వాళ్లకి తెలుగు సినిమాలతో పనిలేదు. హైదరాబాదులో బాంబులు అనగానే అమ్మయ్య తను తెలుగు న్యూస్ చానెల్స్ ఏమి చూడరు కాబట్టి పర్వాలేదు. అయినా చిన్న అసంతృప్తి . నేను చూసినంత లో మిగిలిన అందరికన్నా ముస్లిమ్స్ బహు సౌమ్యులు. ఇంత మందిలో ఒక్కరుకూడా తొందరపడి మాట్లాడినవారిని చూడలేదు. కాని ఏ సంఘటన జరిగినా వాళ్ళ గురించి మాట్లాడ్డం , ఇవేవి వారికి మంచివాళ్ళ మీద ఉన్న నమ్మకాన్ని పోగట్టలేదు.
జస్టిస్ కట్జూ మనదేశంలో ఎనభై శాతం మంది ఇరువైపులా మతోన్మాదులే అన్నారు. ముస్లిమ్స్ లో ఎనభై శాతం అంటే మన ఎనభై శాతంలో ఎన్నో వంతో తెలియదు. బ్లాగ్స్ ఆయన మాటలు నిజమని రోజూ నిరుపిస్తున్నాయి.
బ్లాగ్ లే కాదు. ఆ మధ్య మాకు పరిచితులైన ఒక కుటుంబం తో సరదాగా బయటికి వెళ్ళాము ట్రిప్ కి. తనే ఏదో మాటల్లో తనకు బేధాలు లేవనీ, ఇంకా తను హాస్టల్లో అందరితో ఎలా కలిసి ఉంది చెపుతూ మౌలీ నువ్వు తినే ఎంగిలి స్పూన్ తో నేను తినేస్తాను అస్సలు ఫీల్ అవ్వను, కాని తర్వాత అదే స్పూన్ నువ్వు ఉప్యొగిస్తావొ లేదో నాకనవసరం అనేసారావిడ. స్పూన్ తో కులాల అంతరాలను చీల్చి వేసిన ఆవిడ ఫిలాసఫీ బొత్తిగా అర్ధం కాకపోయినా , తినను అని అలా చెప్పెయ్యకుండా నవ్వి ఊరుకున్నా .
తర్వాత రోజు సరదాగా బుఫే కి వెళ్ళాము రెండు కుటుంబాలు కలిసి. నా అదృష్టం ఎప్పటిలానే , గ్రూప్ లో నేనొక్కర్తినే. నాన్వెజ్ అయ్యాను. ఇంట్లో అసలే చెయ్యను , వారం నుండి వీల్లున్నారని హాయిగా వెజ్జే వండుకున్నా, బయటికి వచ్చాక కూడానా . అలా సంభాషణ నాన్వెజ్ లోకి వచ్చిన్ది. మళ్ళీ తనే అన్నది వాళ్ళబ్బాయి కి స్కూల్లో కుకింగ్ క్లాసెస్ లో పార్టనర్ గా ముస్లిం అమ్మాయి వచ్చిందని తెలిసి ఇదేం చండాలం రా నీకు ముస్లిమ్ అమ్మాయి రావడం ఏంటీ అని అన్నాను , లేదులే వెజిటేరియన్ నే ప్రిపేర్ చేసాం ఇద్దరం అని చెప్పాడట వాళ్ళ బాబు. నాకయితె ఆ మాటకి కి దిమ్మ తిరిగిపోయింది . అర్ధం కాక అడిగితె మా వారు చెప్పారు.. ముస్లిమ్స్ స్కూల్లో కాని, బయట కాని నాన్వెజ్ తినరట, కాబట్టి ఆ అమ్మాయి కూడా వేజ్జే లాజికల్గా అని. షాక్ ని కవర్ చేసికొంటూ పిల్లల్ని బయట తినవద్దు అనడం ఎందుకు అని వేరే మాట మార్చెసాను. పాపం వాళ్ళాయన అదీ హైజీన్ కాదు హలాల్ చెయ్యని మాంసం, వాళ్ళు తినకపోవడం మంచిదే అని ఆయనా కవర్ చెసారు.
తర్వాత రోజు వాళ్ళు వెళ్ళినా, ఆ మాటలు కష్ట పెడుతూనే ఉన్నాయి. నిజానికి మనం కాని, మిగిలిన వాళ్ళతో కాని అవసరం కోసం మాత్రమె వీళ్ళు కలిసి ఉన్నారు కాని నిజంగా సంకుచిత మనుష్యులు కదా అంటే , పట్టించుకోకు వదిలేయ్ అన్నారు . అప్పటికి కాని అర్ధం కాలేదు , దగ్గరలోనే ఉన్న ప్రియ నేస్తానికి పలానా తెలుగు వాళ్ళు వస్తున్నారు, పిల్లలకి టైమ్పాస్ అవుతుంది రండి అని అడిగినా కాదు అనకుండా తను అన్ని రోజులు తప్పించుకుంది ఇలాంటి వారిని చూసేనా . తెలిస్తే తనకి చెప్పక పొదును.
మనది హిందూ దేశమా , లౌకిక దేశమా అన్నది నాకు అవసరం లేదు.. మన మధ్య ఉన్నవారి గురించి పిల్లల మనస్సుల్లో విషాన్ని నూరి పొయ్యడం అమానుషం , అలాంటివారు ఎవరైనా వారి పిల్లలకు చె డుమార్గం ని బోధిస్తున్నట్లే. అదీ మాటర్
ఇక ఇంకో న్యూస్ ఎన్టీఆర్ ఫోటో గురించి హడావుడి, దానిపై బ్లాగుల్లో కూడా చర్చ అవసరమా? అసలాయన చనిపోయఎనాటి కి ఏ పార్టీ అయితే వాళ్ళు మాట్లాడినా అర్ధం ఉంది. హరికృష్ణ సరిగ్గా సమాధానం చెప్పాదు. రామారావు జనం మనిషి ఎవరయినా బొమ్మ పెట్టుకోవచ్చు అని . అన్ని పార్టీలకు విస్తరించిన ఏకైక ప్రాంతీయ నాయకుడిగా గిన్నీసు లో వ్రాయోచ్చేమో . అందుకే ఒకసారి జాతీయ పార్టీ లో గాంధీ, నెహ్రు లేమన్నా ఈ ఖ్యాతి గడించారేమో చూసి లేకపోతె ఏకమొత్తంగా దేశంలోనే పెద్దాయన్ని ఏకైక వ్యక్తిగా ప్రకటించేద్దాము . లేదంటే దేశం లో ఇంకేవరినా ఉంటె మీరే చెప్పాలి మరి.
This same justice katju wrote letter to maharastra governer on sanjay dutt for pleading.
రిప్లయితొలగించండి@ laddu
రిప్లయితొలగించండిచాలా థాంక్స్ అండీ, ముందే అనుమానం వచ్చింది అందుకే నోట్ పెట్టాను.