ఈనాడుకి ఈ మధ్య సోనియా పై ప్రేమ ఎక్కువయ్యిన్ది. నకిలీ కణికులా మజాకా :) అబ్బే కాదులే జగన్మాయేమో . అప్పట్లో చంద్రబాబుగురించి ఇలా అంతర్జాతీయ నంబర్ల హడావిడి జరిగెది. తర్వాత వార్తల్లో కనిపించడం మానేసాడు. ఇప్పుడు మన్మోహనుకో , సోనియాకో ఎదురు దెబ్బ తగలదు కదా. వివరాల్లోకి వెళ్తే ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురైన 100 మంది ఆసియన్లలో మొదటి అయిదు మంది లో సోనియా, మన్మోహనూ మరియు రాహులూ రెండవ, నాల్గవ, అయిదవస్తానాల్లో నిలిచారు. సోనియా తల్లి ప్రేమ యెంత గొప్పది, తన పేరోక్కటి కాకుండా కొడుకు కి కూడా ఇప్పిస్తూ అనుమానం రాకుండా ఆటలో అరటి పండు లా మన్మోహనుక్కూడా ఉదారంగా వేయించేశారు.
ఏమాటకామాటే చెప్పుకొవాలి. ఒక దశాబ్దం క్రిందట జనాలకి ఈ సోనియా పిచ్చేమిటో అర్ధం అయ్యేది కాదు. అందంగా , ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని పట్టుచీరకట్టుకొఛ్చిన సుష్మా స్వరాజ్ ని వదిలేసి ఈ బళ్లారోళ్ళు సోనియాని గెలిపించేడం అస్సలు జీర్ణం కాలేదంటే నమ్మండి .అయినా అదే సుష్మా స్వరాజ్ గుండు కొట్టిన్చుకోకుండా ప్రధాని పదవిని త్యాగం చేసి భారతీయ సంప్రదాయాన్ని కాపాడింది అనుకోండి. ఇప్పుడయితే ఆంద్ర, తెలంగాణా లో ఎక్కడ అయినా గెలిచేస్తుంది అని అర్ధం అయ్యిన్దనుకోండి.
గత పదిహేను, ఇరవై సంవత్సరాలుగా ఒక మహిళ కేవలం కుటుంబ వారసత్వం వాళ్ళ అయితేనేమి ఇంత పట్టును కలిగి ఉండడం, ఎప్పటికప్పుడు వ్యూహాలు, నిర్ణయాలు ఏర్పరుచుకొని ముందుకి సాగడం మామూలు సంగతి కాదు. ఎవరికేం కావాలో అర్ధం చేసికొని మసులుతూ ఉండడము, అవసరం అయితే కన్నెర్ర చెయ్యడంకూడా తెలుసనీ చెప్పకనే చెప్పింది. ఇంత పెద్ద ప్రజాస్వామ్యాన్ని తన కనుసన్నలలో నడిపిస్తున్న మహిళా అంటే అంతర్జాతీయ రాజకీయాలు, మార్కెట్ లో యెంత ప్రాముఖ్యతను కలిగి ఉండాలి ? ఆవిడ ఏ ఉద్దేశ్యంతో గాంధి కుటుంబం లో అడుగు పెట్టిందో ఇన్ని సంవత్సరాల తర్వాత చర్చించడం అనవసరం. అంతకు మించిన నాయకత్వం మనకి లేదు అన్నది నిజమ్.
ప్రస్తుతానికి ఆసియాలో ను, ప్రపంచం లోను అత్యంత గుర్తింపు సోనియాకి లభించడం ఆనంద దాయకమే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి