10, ఏప్రిల్ 2013, బుధవారం

ఇందిరమ్మ హస్తం

అబ్బ పది రోజులనుండి నాకు ఎంత మంచి అయిడియా వచ్చిందో అని మురిసిపొతున్నాను.  ఆచరణలో పెట్టె సమయం కోసం ఎదురు చూపులు కూడా మొదలు పెట్టే సానూ . ఇంతలోనే ఇవ్వాళ వార్త . కాంగ్రెస్ పార్టీ నా ఐడియాని కాపి కొట్టెయ్యడానికి సిద్దమై పోతున్నది . ఇప్పుడు నేనేం చెయ్యాలి. గత పన్నెండు నెలలనుండి ఇరవై ముప్పై ఆలోచనల్లోనుంచి కుదిరేపనిగా ఉందని ఇది ఒక్కటి చేద్దాం అనుకుంటే , వీళ్ళు నా ఆశల పై కళ్ళాపి  చల్లుతున్నారు.  అయినా చూద్దాం  ఎవరు ముందు మొదలు పెట్టేస్తారో .

అసలు విషయానికి వస్తే , నాకు తెలిసిన నాలుగు కుటుంబాలు, ప్రస్తుతానికి ఆడవాళ్లే మిగిలి ఉన్నారు . వాళ్లూ ఎన్నాళ్ళు పనిచెస్తారు. కొద్ది గొప్ప వ్యవసాయానుకూలమైన భూములు ఉన్నా వచ్చే కవులు జాగ్రత్తగా ఖర్చుపెట్టుకుంటూ, రోజు ఏదో పనిలో తమని తాము బిజీగా ఉంచుకుంటూ ఉన్నారు. ఇదంతా అనడరికీ మామూలే .
కాని ఆడవాళ్ళు ఇంతవయస్సులోను బజారుకి వెళ్లి కిరాణా సామాన్లు తెచ్చుకోవాల్సి రావడం మాత్రం చాలా కష్టం గా ఉంటుంది. చిన్నపిల్లలుగా వెళ్ళడం వేరు. కనీసం నెలకోసారి పట్టీ కట్టించుకొనే ఆలోచనకుడా ఇబ్బందే , ఒకేసారి ఖర్చు కి మనసొప్పదు. అందుకే ప్రతినెలా వారికి కావాల్సిన వస్తువులు పట్టీ తయారు చేసి అంతవరకూ జాగ్రత్తగా అందేలా చేస్తే, వాళ్ళు బయటికి వెళ్లి ఎండా, వానల్లో కష్ట పడకుండా ఇంటిదగ్గరే ఉంది చెయ్యగలిగిన పనులు చేస్తూ ఇంకాస్త ఉన్నన్నాళ్ళు మెరుగైన జీవనం గడపగలరు అని . ఎక్కువమందికి ఇవ్వలేము కాని ఇంకెవరూ లేనివారికి ఇంతకూ మించి పరిష్కారం మన చేతుల్లో లెదు.


ఇప్పుడే ఈనాడు లో న్యూస్ ఐటెం 'అమ్మ హస్తం ' పేరు తో 9 నిత్యావసర వస్తువుల పధకం ప్రకిటించే ప్రయత్నం గురించి ఉంది . నాకయితే బాగా నచ్చింది.  ఈ పధకాల వల్ల , ప్రజాధనం యెంత ఖర్చు అవుతుంది, మధ్యలో ఎవరి వాటా యెంత అన్న గొడవ కన్నా, చాలా మందికి కనీస నిత్యావసరాలు కాస్త తక్కువ ధరకు అందుతాయి

మళ్ళీ కాంగ్రెస్ అధికారం లోకి రావడానికి, వై ఎస్ లానే ఇంకాస్త మెరుగైన పధకాలు జనం లోకి తీసికెల్ల డానికి బానే కష్ట పడుతోంది . బాబుకి అయితే ఇప్పట్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాసం లెదు. మిగిలింది నలుగురినీ కలుపుకుపోయేది కాంగ్రెస్స్ ఒకటే ( అంటే చిరంజీవినీ, నాగార్జునా, మహేష్ బాబునీ అని కాదండోయ్ )


కిరణ్కుమార్ ఇప్పటిదాకా పదవిలో  ఉండడమే విశేషం , చూద్దాం ఆయన అదృష్టం ఎలా ఉందొ !

2 కామెంట్‌లు:

  1. ప్రజలకు పనికి రానివి హాని చేసేవి ఉన్నాయి ఆ తొమ్మిదిలో ఆరు. ఇక ఎలా సమర్ధిస్తున్నారు మీరు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు

      ఏమిటవి? మీ వ్యాఖ్యను బట్టి పామాయిల్ ఒకటి అనుకుంటున్నాను . అదయితే నేను చిన్నతనంలో పామాయిల్ తో చేసిన పిండివంటలు తిన్నట్లే గుర్తు. అవసరం అయిన వాళ్ళే కొనుక్కుంటారు. నేను సమర్ధిస్తున్నాను

      తొలగించండి