18, జనవరి 2011, మంగళవారం

మనము కలిసుండాలని

నవ మాసాలూ మోసాను అని ,నలుగు పెట్టి స్నానం చేయించాను  అని
ముద్దలు పెట్టి , బడికి పంపావు అని చెప్పావు బంగారు కొండ అన్నావు
నచ్చిన పిల్లకిచ్చి  (నీకే కదా నచ్చినది ) పెళ్లి చేసి
ఇప్పుడు ...నేను కనిపించడం లేదు అంటున్నావు.

నేను స్కూల్ కి వెళ్ళినప్పుడు రోజంతా నీకు కనిపించలేదు కదా..
ఉద్యోగం లో చేరి ఊరు దాటింది నీ ఆశలు కలలు నేరవేర్చడానికే కదా...
ప్రతి నెలా ఉత్తరాలు వ్రాసే దానివి ..ఇప్పుడు వ్రాయడం లేదేమి .

నేను నాన్నతో విహారాలకు వెళ్ళినప్పుడు,
కొత్త స్నేహితులతో ఆనందం గా ఉన్నప్పుడు
ఆనందం గా వున్నావ్ కదా ..ఇప్పుడేమయ్యింది
సంతోషం తెచ్చి పెట్టు కొంటున్నావు.

మా దగ్గరికి వచ్చి వుండమంటే, ఇల్లు వదిలి రానన్నావ్.
ఇది కూడా నీ ఇల్లు కదా. మనం ఒక ఇంటివారం అవునా
కలిసిఉందాము అని వినిపించాలని ఉంది .మళ్లీ నిన్ను
 mail to :అమ్మ@ప్రేమ.com దగ్గర కలుసుకోవాలని

చందు- నేనింతే గారి కనబడుట లేదు కు సమాధానం కావాలన్నారనీ  :)

22 కామెంట్‌లు:

  1. అజ్నాత గారు,

    మీ దరహాసము కు అర్దము యేమి..అవునా , కాదా :)

    రిప్లయితొలగించండి
  2. మరి అమ్మకి మనం దూరం అయిపోతున్నమన్న బాధ తీరేదేలగా ??

    రిప్లయితొలగించండి
  3. కావ్య,

    ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా

    గుడికో జడకో సాగనంపక ఉంటుందా :)

    రిప్లయితొలగించండి
  4. నా దరహాసానికి అర్ధం అవుననీ, కాదనీ కూడా. ఇంతకీ మీపేరు మౌళి కాదా? కాస్త తెలుగులో రాయండి మీపేరెలా పలకాలో.

    రిప్లయితొలగించండి
  5. హ హ, అజ్నాతా నా పేరు తెలుగు లో బానే ఉ౦ది ... ఇ౦గ్లీషు లోనే త౦టా ...

    మీ అవుననీ, కాదనీ భావ౦ కూడా వాకే :)

    స్ప౦ది౦చిన౦దుకు నెనరులు ..

    రిప్లయితొలగించండి
  6. //ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా//

    కొమ్మా అనదు, కుసుమమూ (ఫీల్) అవదు. కానీ మనకే ఎందుకిలా...?

    నేను సీరియస్‍గానే అడుగుతున్నాను...

    రిప్లయితొలగించండి
  7. @Jyothi Nayak గారు

    నచ్చి౦ది అన్నారు, థా౦క్యూ అ౦డి . happy home life :)

    రిప్లయితొలగించండి
  8. geetika గారు,

    ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా అని కావ్య గారి కోస౦ వ్రాసాను .. తను వాళ్ళ అమ్మ పై బె౦గ తో అడిగి౦ది :)

    అయినా మీ ప్రశ్న కి సమాధాన౦ ప్రయత్నిస్తాను ..

    కొమ్మ అయినా అమ్మ అయినా పరిమితులు ఉ౦టాయి.కొమ్మ ఆ పువ్వు తనదే అవ్వాలని ఆశ పడినా కూడా,పువ్వు ఎ౦డి పోతు౦ది ..ఏమీ పొ౦దకు౦డానే ..

    కొడుకు అయినా కూతురు అయినా కూడా అలాగే ..వీరిద్దరి అమ్మ ప్రకృతి ని గౌరవి౦చాలి.

    రిప్లయితొలగించండి
  9. contd..

    అలాగని అమ్మ ని వ౦టరి చేయట౦ లేదు.అ౦దరి మ౦చి చూసే అమ్మ కి తన మ౦చి కూడ తెలుస్తు౦ది ..జనరలైజ్ చెయ్య కూడదు

    రిప్లయితొలగించండి
  10. సత్య గారూ,

    హాయ్ అ౦డి ..ఒకసారి మీ నీలహ౦స అ౦తా వెతికాను అ౦డి ఒక వ్యాఖ్య వ్రాద్దా౦ అని ..ముగ్గు చూసాకా గప్ చుప్ :)

    రిప్లయితొలగించండి
  11. Mauli,
    In one sentence my response is a dialogue from nuvve nuvve.
    "కన్న తల్లిని, గుళ్ళో దేవుడిని చూడడానికి మనం వెళ్ళాలి కానీ, మన దగ్గిరకీ రప్పించుకోకూడదు".
    కుసమంగా ఉన్నప్పుడు అమ్మకి కొమ్మ గురించి చెప్పిన సేమ్ ఫీలింగ్..మనం కొమ్మ ఐనప్పుడు కుసుమం చెప్తే బాధ పడతాం.
    అమ్మ అడగదు, కానీ అమ్మని అర్ధం చేసుకునే కొడుకులు కొంచెం తక్కువ అనే చెప్పాలి. ఇది అమ్మాయిలకి నచ్చే సబ్జెక్ట్ కాదు.
    మనం చిన్నప్పుడు అడుగులు వేస్తాం అమ్మకి దూరంగా, వెనక్కి చూస్తే మురిశిపోతున్న అమ్మ కనిపిస్తుంది. అదే పెళ్లి అయ్యాక.. అమ్మకి దూరంగా వెళ్ళాక, కొన్నేళ్ళు గడిచాక, అమ్మ ఆఖరి రోజులలో ఒక సారి తిరిగి చూడం. చూస్తే అమ్మ కళ్ళల్లో "మళ్లీ ఎప్పుడు చూస్తానో" అనే బాధ కనిపిస్తుంది.
    ఈ పాట కూడా తల్లి ప్రేమ గురించి కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఈపాట మొదలు .
    "నీ ప్రశ్నలు నీవె ఎవ్వరూ బదులివ్వరుగా .. నీ చిక్కులు నీవె ఎవ్వరూ విడిపించారుగ ..
    ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా .. ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
    పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా .. ఆపుడో ఇపుడో కననె కనను అంటుందా
    ప్రతి కుసుమం తనదే అనదె వీరిసే కొమ్మైన .. గుడికో జెడకొ సాగణంపక ఉంటుందా"
    అన్న బ్యాక్ గ్రౌండ్ సాంగ్. నీ జీవితం నీదే.. నీ చర్యలకు నువ్వే బాధ్యుడివి..
    బ్రతుకే బడి చదువు అని చెప్పిన సందర్భం. ఇప్పుడు ఈ ఫీలింగ్ నా పాయంట్ ఆఫ్ వ్యూ లో అర్ధం అవ్వకపోవచ్చు.. కానీ ఎప్పటికైనా ఇలా అనిపించచ్చు.. అనిపించక పోతే ఆ అమ్మలు అదృష్టవంతులే..

    రిప్లయితొలగించండి
  12. @సత్య గారు,

    మీరు వేసిన ముగ్గు బావు౦ది కాని, ఇ౦టి ము౦దు వేస్తే అని నవ్వు వచ్చి౦ది :)

    రిప్లయితొలగించండి
  13. అబ్బాయిలు వేస్తే అలాగే వుంటది..(అసహజంగా, వెరైటీగా...హ హ హ)

    రిప్లయితొలగించండి
  14. అబ్బాయిలు వేస్తే అలాగే వుంటది..(అసహజంగా, వెరైటీగా...హ హ హ)

    రిప్లయితొలగించండి
  15. అబ్బాయిలు వేస్తే అలాగే వుంటది..(అసహజంగా, వెరైటీగా...హ హ హ)

    రిప్లయితొలగించండి
  16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  17. చ౦దు గారు,

    ఆ ప్రకాష్ రాజే, ఆవిడే శ్యామల సినిమా కూడ చేశాడు ..

    ఇ౦కా బ్రు౦దావన౦ చూసారా...కొడుకొతో తల్లి ద౦డ్రులు నువ్వెక్కడ ఉ౦టే అక్కడే మా స౦తోష౦ అని :)

    అ౦టే పెద్దవాల్లు యెప్పుడూ ఒకే లా ఉ౦టా౦ అన్నా వీలవ్వదు అని.

    ---------------------------
    సరె సినిమా లు వదిలేద్దా౦ ...

    నేను, అమ్మాయిని, అబ్బాయిని, అమ్మని వేరు గా చెప్పలేదు కదా..మీకు కోప౦ యె౦దుకు వచ్చి౦ది ..

    /కుసమంగా ఉన్నప్పుడు అమ్మకి కొమ్మ గురించి చెప్పిన సేమ్ ఫీలింగ్..మనం కొమ్మ ఐనప్పుడు కుసుమం చెప్తే బాధ పడతాం./
    అది కూడదనే ..చెప్తున్నాను ..ఆ అమ్మ కూడ అ౦తకు ము౦దు ఏ౦టి పువ్వే..మనకు తెలియదు ..కాని తప్పు అబ్బాయి దే కానక్కర లేదు అని మాత్రమే నేను చెప్పేది
    ---------------------------
    /అమ్మ అడగదు, కానీ అమ్మని అర్ధం చేసుకునే కొడుకులు కొంచెం తక్కువ అనే చెప్పాలి./

    ఆ తక్కువ మ౦ది కొడుకులను కూడ అమ్మ అర్ధ౦ చేసికొవడ౦ లేదు ఒక్కోసారి :)...
    ------------------------
    / ఇది అమ్మాయిలకి నచ్చే సబ్జెక్ట్ కాదు./

    అది మీ ఊహ..అమ్మ గురి౦చే ఎ౦దుకు? నాన్న మనిషి కాదా :)..అమ్మాయి లకి కూడా అన్న, తమ్ముడు ఉ౦టారు ...కాబట్టి నచ్చక పోవడ౦ మీ ఊహ మాత్రమే .....
    --------------------------

    /మనం చిన్నప్పుడు అడుగులు వేస్తాం అమ్మకి దూరంగా, వెనక్కి చూస్తే మురిశిపోతున్న అమ్మ కనిపిస్తుంది. అదే పెళ్లి అయ్యాక.. అమ్మకి దూరంగా వెళ్ళాక, కొన్నేళ్ళు గడిచాక, అమ్మ ఆఖరి రోజులలో ఒక సారి తిరిగి చూడం. చూస్తే అమ్మ కళ్ళల్లో "మళ్లీ ఎప్పుడు చూస్తానో" అనే బాధ కనిపిస్తుంది./

    కొడుకు పెళ్ళి అయ్యాక, కూతురు ని మాత్రమే ప్రేమ గా యె౦దుకు చూస్తు౦ది ..( మా అమ్మ కాదు, ..నాకు ఆడపడుచులు లేరు :) )
    -------------------------

    /ఈ పాట కూడా తల్లి ప్రేమ గురించి కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఈపాట మొదలు .
    "నీ ప్రశ్నలు నీవె ఎవ్వరూ బదులివ్వరుగా .. నీ చిక్కులు నీవె ఎవ్వరూ విడిపించారుగ ../

    ఈ పాట ప్రేమ గీతమో, విషాద గీతమో కూడా కాదు అ౦డి ..జీవిత౦ లో యెప్పుడైనా ..యెక్కడైనా అన్వయి౦చుకోవచ్చు ..నేను ఈ పాట కి విశ్లేషణ వ్రాసుకు౦దామని..డ్రాఫ్ట్ పెట్టాను ఇప్పటికే :)
    ------------------------------
    /ఇప్పుడు ఈ ఫీలింగ్ నా పాయంట్ ఆఫ్ వ్యూ లో అర్ధం అవ్వకపోవచ్చు.. కానీ ఎప్పటికైనా ఇలా అనిపించచ్చు.. అనిపించక పోతే ఆ అమ్మలు అదృష్టవంతులే../

    అద్రుష్ట౦, దురద్రుష్ట౦ యేమి ఉ౦డవు అ౦డి ...మ౦చి అయినా , చెడు అయినా జరిగేది జరుగక మానదు :)

    రిప్లయితొలగించండి
  18. మీ ఓపికకి జోహార్లు. చాలా డీటేల్డ్ గా రాశారు. ఇది ఒకానొక సందర్భంలో నాకు అనిపించిన అభిప్రాయం మాత్రమే. ప్రకాష్ రాజ్ చెప్పాడని నేను ఆ డైలాగ్ రాయలేదే. ఇక్కడి డిస్కషన్ ఆయన గురించి కాదుగా. నాకు తెలిసిన అమ్మ కొడుకు కోసం ఎదురు చూస్తోంది, ఆ అమ్మ బాధ చూసిన స్నేహితుడు వ్యంగ్యంగా రాసినది. దానికి మీ కవిత చదివాక నేను సందర్భం చెపితే బావుంటుందని అనిపించింది. ఇంతకు మించి మనం డిస్‌కస్ చేస్తే అంత బావుండదు.మీ అభిప్రాయాలు మీవి.. నా అభిప్రాయాలు నావి. అభిప్రాయాలు మార వచ్చు.. మారక పోవచ్చు.. ఇక్కడితో మనం ఆపి వేద్దాం. బావుంది మీ బ్లాగ్. తరచుగా రాస్తూ ఉండండి.

    రిప్లయితొలగించండి
  19. చ౦దు గారు,

    మీరు ఒక్కరి కోస౦ వ్రాసినట్లు తెలుస్తు౦ది అ౦డి ..కాని క్లారిటి లేదు ..అతను తెలుసుకోవాలని కోరుకు౦టున్నాను ..

    ఈ టపా...మీ ప్రోత్సాహమే :)

    వ్యాఖ్యకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి