6, ఫిబ్రవరి 2011, ఆదివారం

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా !!!

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు  గీత రచయిత గా నేటి యువత  మనసులో ఒక సుస్థిర స్థానాన్ని ఎర్పరచుకున్నారు. మొదటి సారి గా 'గాయం' లో నిగ్గదీసి అడుగు అన్నపాట ను ఆయనే పాడగా విన్నప్పుడు నచ్చింది, కాని ఏదో సినిమా కోసం వ్రాసి పాడారు, ఆయన మాత్రం వెళ్లి అడిగేస్తారా, ఇప్పుడు నమ్మేసి  తరువాత బాధ పడటం ఎందుకు అని జాగ్రత్తగా కొంచెముగా చిగురిస్తున్న అభిమానాన్ని ఒక జ్ఞాపకం వరకే పరిమితం చేసా.. 'ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకు, అటో ఇటో ఎటో వైపు ' మాత్రం నన్ను అస్సలు వదిలిపెట్టలేదు. నాతోనే ఉంది :) ..  తర్వాత ఎన్నో పాటలు కానీ అవ్వన్ని పెద్ద గా గుర్తు లేవు.

మళ్లీ 'కొత్త బంగారు లోకం' సినిమా లో ఈ పాట  ఫణింద్ర గారి విశ్లేషణ వలన ఆసక్తి కలిగింది, నేనూ నా అభిప్రాయాలు పంచుకొన్నాను. అప్పటి నుండి ఎన్నో సమయాలలో గుర్తు రావడం ఈ టపా వ్రాయడానికి ఒక కారణం. శాస్త్రి గారు పాటను ఈ ప్రత్యేక  సందర్భం కోసమే వ్రాసారా లేక స్వంతం గా వ్రాసుకున్నారా?  అని ఎన్నో సార్లు అనిపించింది.'జగమ౦త కుటు౦బ౦' పై విశ్లేషణ ఇక్కడ వ్రాసుకొన్నాను, 'నీ ప్రశ్నలు నీవే' కి వివర౦ ఇవ్వకు౦టేనే బావు౦టు౦దని ఇవ్వడ౦ లేదు.

రోజూ మనచుట్టూ ఉ౦డే ప్రశ్నలన్ని౦టికీ సమాధాన౦ ఈ ఒక్క పాట లో ఉ౦ది :)


                నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
                నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
                ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
                ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా

                పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
                అపుడో ఇపుడో కననే కనను అంటుందా
                ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
                గుడికో జడకో సాగనంపక ఉంటుందా

                బతుకుంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
                పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
                ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా                
                అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా?

                కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా?
                గతముందని గమనించని నడిరేయికి రేపుందా?
                గతి తోచని గమనానికి గమ్యం అంటు ఉందా..?
                వలపేదో వల వేసింది వయసేమో అటు తోస్తుంది.

                గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే ఋజువేముంది??
                సుడిలో పడు ప్రతి నావ… చెబుతున్నది వినలేవా..?
                పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా?
                ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా?
                మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా..
                కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా??

                కడ తేరని పయనాలెన్ని..! పడదోసిన ప్రణయాలెన్ని..!
                అని తిరగేశాయా చరిత పుటలు వెనుజూడక ఉరికే వెతలు.
                తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు???
                ఇది కాదే విధి రాత..! అనుకోదేం ఎదురీత…!! 


5 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. శుద్దమైన సరుకు ఇవ్వలెక,
    కారంలో ఇటుక పొడి కలిపి కల్తీ చేసినట్లు.
    దనియాలపొడిలో పేడ పొడి కలిపి కల్తీ చేసినట్లు

    పాటల రచయితలని చెప్పుకునేవారందరూ అచ్చతెలుగులో అంగ్ల పదాల కల్తీ, హింది పదాల కల్తీ చేస్తున్న వారే. సమయాభావమో, దురహంకారమో అర్థం కాదు.

    నేటి సినీగేయాలకి, ఎడారిలో ఒయాసిస్సు "సిరివెన్నెల".

    పాటలకి మాటలు కొదువలేని
    సంధర్భానికి భావాలు కొదువలేని
    సంగీత బాణీలకి లొoగని
    ఏకైక రచయిత సిరివెన్నెల.

    ఎక్కడా ఏ ఒక్క పదమూ పాటలో బలవంతంగా ఇరికించినట్లు ఉండదు.
    ఇప్పుడున్న మిగితావాళ్ళంతా బాణీ తో పదాలతో కుస్తీ పట్టే వాళ్ళే

    రిప్లయితొలగించండి
  3. ఎంత లోతైన అర్థం వుందో ఇందులో, చదివిన కోద్ది మల్లి మల్లి చదవాలనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  4. సత్య గారు,

    బాగా చెప్పారు...సిరివెన్నెల గారిపై మీ కవి హ్రుదయమ్ అదుర్స్..థా౦క్యూ..

    రిప్లయితొలగించండి
  5. ప్రవీణ గారు,

    అవున౦డి ...ఎన్నో జీవిత సత్యాలని ఒక్క పాటలో చెప్పేశారు సిరివెన్నెల గారు ..

    స్ప౦ది౦చిన౦దుకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి