11, జులై 2020, శనివారం

రెడ్ది గారు -1

నా  డిప్లొమా క్లాస్మేట్స్ కి ఇది పరిచయం అక్కర్లేని పిలుపు . అజారు నుండి ఎవరికి  ఏమి అవసరం  వచ్చినా వచ్చే పిలుపుతో తిరుపతి వెంకటేశ్వర స్వామికున్న పరపతి ఉండేది  మా హాస్టల్ ప్యూను రెడ్డి  గారికి. మా ఊరిలో ఆ పేరుతో ఎవరూ లేరు కాబట్టి ఈ సామాజిక కులానికి సంబంధించి  నాకు తెల్సిన మెదటి పెద్దమనిషి శ్రీ శ్రీ  ప్యూన్ రెడ్డి గారు.  

రెసిడెన్షియల్ స్కూల్ లో నా బెస్టీ + బెడ్  మేట్ రెడ్డి కులస్తులే అయినా నా కన్నా తనకు ముందు కుల స్పృహ రావడం (బహుశా సిస్టం లో అప్పటికే ఉండి ఉంటుంది) వల్ల  ఎక్కడ ఉన్నా  ఏమయినా ..నీ సుఖమే అని విడిపోయాం ,అలా పదో తరగతి లో మా బెడ్ వస్తువులు తీసికోడానికి తప్ప ఇద్దరం నిద్రపోవడానికి వాడలేదు. పాపం తాను  సారీ ఉత్తరం  ట్రంకు పెట్టి పై పెట్టినా , నా బుర్రలో జిగురు తక్కువ కాబట్టి మా స్నేహం అతుక్కోలేదు . 

కట్ చేస్తే  ఇంజినీరింగ్ లో చేరాక చూస్తే క్లాస్ నిండా 'రెడ్డి గార్లు '. ఒక్కొక్కరి పేరు 'దాన వీర సూర నటరత్న నటసార్వహౌమా నటశేఖర..... బ్లా ..బ్లా ..ఉండి  చివర రెడ్డి అని ఉండేది .  అసలే అంతమంది పేర్లు గుర్తు పెట్టుకోడం ఒక సమస్య అయితే ఈ చాంతాడు అంత పేర్లతో పిలవడం బోర్ కొట్టేది . సరే సింపుల్ గా 'రెడ్డి ' గారు అని పిలుద్దాం అంటే మా హాస్టల్ రెడ్డి గారు కళ్ళముందు పోర్ట్రైట్ లా వచ్చేవారు . సో ప్రతి  ఒక్కరినీ 'దాన వీర సూర నటరత్న నటసార్వహౌమా నటశేఖర..... బ్లా ..బ్లా .. రెడ్డి గారూ అని పిలిచే అలవాటు తప్పని సరి అయ్యింది . 

వాళ్ళ మధ్య పోటీ కూడా ఇప్పుడు మన తెలుగు సినిమా స్టార్స్  లా  ఉండేది కాబోలు , ఒక దావీసూననన.. బ్లా ..బ్లా .. రెడ్డి గారు మిగిలిన అందరు స్టార్  హీరో ల కన్నా  ధ్రువ స్టార్ అనిపించుకోవాలని తన పేరు దావీసూననన..... బ్లా ..బ్లా .. మాత్రమే అని ,ఆ ఊరి చివర ఉన్న రెడ్డి అనే తోక ని తీసి వేసుకోడానికి రెడ్డి సీనియర్స్  కమిటీ కి కన్నీటి లేఖలు వ్రాసి వేడుకొంటున్నట్లు  పబ్లిసిటీ ఇచ్చుకునే వాడు . పాపం ఈ రెడ్డి సముద్రం లో మా  క్లాస్ అసలు హీరో సల్మాన్ ఖాన్ కి నటించే అవకాశం మిగలక  ఇప్పటి  సుశాంత్ సింగ్ రాజపుత్ లా కాక తాను ఆక్టర్ కావాలనుకొన్న  విష్యం కూడా మర్చిపొయ్యి బ్రతికి పొయ్యాడు .