2, సెప్టెంబర్ 2013, సోమవారం

బందోత్సవాలు

ఈనాడులో తాజావార్త :  "విజయవాడలో రేపు ప్రైవేటు ఆస్పత్రుల మూసివేత "

ఇదేంటబ్బా  గత నెలరోజులుగా జరుగుతున్న సమైక్యాంద్ర ఉద్యమం మూలంగా బస్సులు లేక, ఆటోలు అందకా ఎప్పుడో మూసివేసారుగా చాలా ప్రైవేట్ క్లినిక్కులు అని సందేహం వచ్చింది. ప్రస్తుతం ముందే డబ్బులు చెల్లించిన వారు ట్రీట్మెంట్ కోసం ఎదురు చూస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి. ఫోన్ చేస్తే పలకదు , అక్కడెవరూ లేరని నిర్దారించేసుకొని వాళ్ళే మల్లి ఫోన్ చేసే వరకు గోళ్ళు కొరుక్కుంటూ కూర్చోడమే (డెంటల్ ప్రాబ్లెమ్ అయితే ఆ ఆప్షన్ కూడా ఉండదనుకోండి ) .   


ఇప్పుడు అఫీషియల్గా పెద్ద పెద్ద కార్పోరేట్ హాస్పిటల్స్ కి కూడా గిరాకీలు తగ్గిపోయాయి కావచ్చు. పోష్ గా ఉంటుందని సమైక్యాంద్ర కి మద్దతుగా అని కూడా చెప్తున్నారు.లేదంటే  ఆంధ్రాకి కొత్త రాజధాని వస్తే  ప్రైవేట్ హాస్పిటల్స్ బిజినెస్ దెబ్బతింటుందేమో ?


ఒక్క ఆర్టీసీ బందు, ఇన్ని తప్పనిసరి బందులను తెస్తుందా అని బోలెడంత ఆశ్చర్యం వేసింది. 

ఆర్టీసీ ఎందుకు బంద్  చేస్తోంది అంటే వాళ్లకి కి వచ్చే ఆదాయం లో సింహభాగం తెలంగాణా /హైదరాబాదు నుండే వస్తున్నది(ట ). మనకి కూడా రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ కి బస్సు/టోల్  చార్జీలు పెరిగిపోతాయి. అలాగే తెలంగాణా, హైదరాబాదుల్లో ఉన్న ఆంధ్రులకి కూడా స్వగ్రామం వచ్చి వెళ్ళడానికి ఖర్చులు పెరుగుతాయి కదా.


అయినా అప్పుడు హైదరాబాద్ కి ఎందుకు వెళ్తాం..హ్మ్ ఎయిర్పోర్ట్  కి అంటే తప్పదు . త్వరగా ఆంధ్రా  కి (లేదా సమైక్యం లో మా ఆంధ్రా కి )ఇంటర్నేషనల్  ఎయిర్పోర్ట్  వచ్చేస్తే బాగుణ్ణు. ఇంకేమున్నాయబ్బా హైదరాబాదు లో !!!!

బంధువులు ఉన్నారు కాని , వాళ్ళే చక్కగా ఊర్లకి రావాలి కాని మనమెందుకూ వెళ్ళడం . అదీ సంగతి సగటు ఆంద్ర పౌరుడికి హైదరాబాదుతో పనేం లేదు. అక్కడ వచ్చే ఆదాయం తో ఇక్కడ అభివృద్ధిగట్రా చేస్తారనుకోడం భ్రమ. 


సమస్యలేమయినా ఉంటె గింటే ఉద్యోగులకే.  దాచుకొన్న సేవింగ్స్ అక్కడ హైదరాబాదులో  ఇన్వెస్ట్ చేసిన వుద్యోగులకయితే ఇంకాస్త కష్టమూ.  అయినా ఏదయినా స్థలం కొనుక్కునే ముందు, దేశం లో ఎక్కడయినా  కాని పనికొస్తుందా లేదా అని చూడకుండా రేటు పెరుగుతుందని మాత్రమే కొనడం శాడిజం క్రిందకి వస్తుంది . దాని వల్ల ఇప్పుడు భూముల అసలువిలువ లెక్క కట్టడం మానవ మాత్రులకి సాధ్యం కాదు. సామాన్యుడు ఈ పోటీలో  కాస్తంత చిన్న గూడు కూడా కట్టుకోలేడు . పంట పండించే రైతుకూలీ కి పొలం దొరకదు.


4 కామెంట్‌లు:

  1. There is not much sign of agitation in Vijayawada

    http://jaigottimukkala.blogspot.in/2013/09/reporting-from-vijayawada.html

    రిప్లయితొలగించండి
  2. @Jai Gottimukkala

    మీరు బంద్ చేయడానికి , ఆందోళన చెయ్యడానికి తేడా గమనించాలి. సీమాంధ్ర లో ఆందోళనలు ప్రతి రోజూ పెద్ద మొత్తంలో జరగకపోవచ్చు . అది తెలంగాణా ఉద్యమం లో కూడా జరగలేదు. అలాగే నిరవధిక బంద్ తెలంగాణా లో ఈ స్థాయిలో జరగలేదు కూడా . ఎప్పుడో మూన్నెల్లకో ఆర్నేల్లకో మిల్లియన్ మార్చ్ అని, అసెంబ్లీ ముట్టడి అని తప్ప అక్కడ మాత్రం రోజూ గుంపులు కట్టారా ?

    తెలంగాణా ఉద్యమం లో ఆస్తుల ధ్వంసం అంతా ఆంధ్రులకి నష్టం కలిగించాలని చేసినవి, లేదా ఆంధ్ర ప్రభుత్వాన్ని నష్టపరచాలని చేసినవి కాని తమ స్వంత వనరులగా భావించిన వాటిని కాదు.

    కాబట్టి అదేస్థాయి విధ్వంసం సీమంధ్రలో జరగడం అన్నది జరుగదు. అసలు అది కొలబద్ద కాకూడదు కూడా. విజయవాడే కాదు , ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడో ఒకరోజు తప్పితే పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలు ఉండవు. విభజన వాళ్ళ సీమాన్ద్రులకు ఎంతో నష్టం ఉంది ఉండొచ్చు, కాని సామాన్యులకి అంత చైతన్యం లెదు. ఇప్పుడు జరుగుతున్న గొడవల వల్ల కాస్తయినా చైతన్యం వచ్చి భవిష్యత్తులో వాళ్ళ హక్కులకోసం పోరాడటం తెలియాలి.



    అదే చైతన్యం ఇప్పుడు విభజన తర్వాత తెలంగాణా జనాభా లో ఉండదు . కాబట్టి ఏం జరిగినా బాగుపడేది ఆంధ్రానే.

    తెలంగాణా విధ్వంసం చేసి, వరుసగా బెదిరిస్తూ సాధించుకోన్నదే కాని , ఆ పోరాటంలో కూడా న్యాయం లేదు. అలాగని విభజన అన్యాయం అని నేను చెప్పడం లేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Mauli: The media is full of stories that every Andhra town is bursting to seams with agitations etc. I did not find it in Vijayawada.

      Please don't preach about violence. Remember 1953, Jai Andhra, Vangaveeti Ranga cases.

      తొలగించండి
    2. ఆంద్ర లో హింస లేకపోవడానికి కారణం ఇప్పటికే చెప్పాను .జై ఆంధ్రా, వంగవీటి రంగా ఇవన్నీ వృధా ప్రేలాపనలు .ఇప్పటి ఉద్యమానికి వాటితో సంబంధం లేదు.



      రవాణా వ్యవస్థ నిలిచిపోయింది కాబట్టి రోజు గుంపులు గుంపులుగా జనం పోగు పడరు. మీరు ఒక్కరోజు చూసిన విజయవాడనే, మామూలు రోజులతో పోల్చి చూస్తె చాలా తేడా కనిపిస్తుంది. అది పూర్తిగా ఉద్యమ ప్రభావమే.



      ఉద్యోగులు విధులు బహిష్కరించారు. వీరంతా ఏమి సాధించబోతున్నారో అన్న ఆసక్తి, సానుభూతి సామాన్య ప్రజల్లో బలపడుతూ ఉంది. ఒక్కొక్క వర్గమూ తప్పని సరిగా విధులు బహిష్క్రించాల్సిన పరిస్థితినే టపా లో వివరించాను. ఈ క్రమం లో మిగిలిన ప్రజల్లో కూడా అసహనం మొదలవుతుంది. తెలంగాణా సమస్యలతో ఇక్కడి అధిక ప్రజానీకానికి సంబంధం లేదు, కాని ఇప్పుడు తమ సమస్యలకి తాము స్పందించాల్సిన అవసరం మాత్రం వీరికి ఉంది.



      తెలంగాణా నిజమైన పోరాటం ప్రదర్శించాల్సిన తరుణం ఇది, ఇప్పటి దాకా జరిగిన బెదిరింపు, హింస కు ఆంద్ర ప్రజలు తగిన సమాధానం చెపుతున్నారు. ఈ పరిణామాలను స్వాగతించడం మినహా ఇంకేమి చెయ్యలేరు ఎవరూ .

      తొలగించండి