15, మార్చి 2019, శుక్రవారం

ఇంజనీరింగ్ కాలేజీ జ్ఞాపకాలు -1 (Lakshmi's NTR movie)



మేం ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం లో విజ్ఞాన యాత్రకు  శ్రీశైలం ట్రిప్ వెళ్లాం . మహానుభావుడు ఎన్టీఆర్ పుణ్యమా అని ఆ ట్రిప్ లో వెళ్లే  అవకాశం నాకూ కలిగింది . అంటే ముప్పై శాతం రిజర్వేషన్స్ అమలు లోకి తెచ్చింది  ఎన్టీఆర్ అని అనుకుంటున్నాను ఇంకో రీజన్ తర్వాత చెప్తా . ఆ విధంగా ఇడ్లి లో పచ్చ్చడి లా మేము ఒక అయిదుగురమ్మాయిలం క్లాస్ లో ఒక ప్రక్కన సర్దుకుని ఉండేవారం . ఇడ్లీ కన్నా పచ్చ్చడి  బావుంటుందని వేరే చెప్పాలా ... అలా శ్రీశైలం ట్రిప్పులో నాకు బొత్తిగా అర్ధం కానీ సరదా ఆటలు కుంచెం సందడి చేశాయి .  అంత్యాక్షరి ని తిరగేసి బోర్లేసి వాళ్లకి బోర్ కొట్టాక (సినిమాల్లో పాటలు కి అంత మార్కెట్ ఉందని బొత్తిగా తెలియని  నా కంట్రిబ్యూషన్ సున్నా అని వేరే చెప్పక్కర లేదు కదా ), ఉన్నట్టుండి చీటీలు కార్యక్రమం మొదలెట్టారు . ఒకవరుస లో ముందు మా నంబర్స్ వస్తాయి తర్వాత ఇడ్లీస్ అన్నమాట. మొదటి అమ్మాయి కి ఏదో చిట్ వచ్చింది ..చిట్ లో ఒక నేఁ ఉంటుంది క్లాస్ మేట్  ది , వాళ్ళేం ప్రశ్న అడిగినా లేక ఏదయినా అడిగినా చెయ్యాలి . తర్వాత నా వంతు . సిలబస్ చెప్తే కాస్త నాల్గు లైబ్రరీల్లో చదువుకొని వద్దును .చిట్ తీస్తూ వచ్చిన పేరు చూసి అమ్మయ్య పేపర్ వీజీగా ఉండొచ్చేమో ని కాస్త కూల్ అయ్యాను. సో నా క్లాస్మేట్ నన్ను అడిగిన ప్రశ్న వివరం లో కి వెళ్తే ... " దేవుడు ప్రత్యక్షం అయితే ఒకే ఒక్క కోరిక లైఫ్ కి సంబంధించినది ఏం కోరుకుంటావు  " అని ... వీజీ ప్రశ్నలా ఉంది కదూ ..కానీ ఇలాంటి ప్రశ్నకి నాలుగు లైబ్రరీల్లో దొరుకుద్దా ????? ఒక అరడజను కోరుకోవచ్చ్చంటే  ట్టపీ ట్టపీ  మని చెప్పేడ్డును .. కానీ ఒక్కటే .. లైఫ్ కీ సంబంధించీ దేవుడ్ని అడగాలి ..ఆలోచిస్తుంన్నా ...  దేవుడు , నా లైఫ్ ...రెండు మిక్సీ లో వేస్తె  ఏం పచ్చ్చడి వస్తే అది చెప్పాలి ..అని లాజిక్ అర్ధం అయ్యింది ..ఓస్ ఇంతే కదా అని ..అలా మైండ్ లో మిక్స్ తీసి ఫస్ట్  దేవుడు ని వేసాను ..అలా దేవుడ్ని వేయగానే మనసుపొరల్లో ఉన్న ఒక జ్ఞాపకం కదిలింది . అలా అసంకల్పితం గా నా డౌట్  దేవుడ్ని అడగాల్సింది గుర్తు వచ్చ్చేసింది . సో కుదురుగా నా కోరిక ని బయట పెట్టేసాను .ఎన్టీఆర్ ని ఎవరు చంపారు .. ఎలా చనిపోయాడు  అని నేను దేవుడ్ని అడగ దలిచాను . ప్రశ్నకుడు అదేం కోరిక నీ లైఫ్ కి సంభంధించట్లా అని పాపం విసుక్కోకుండా మర్యాదగా క్షమించి ఇంకో ఛాన్స్ ఇవ్వబోతే అప్పటికి ఇంకా కాస్త మిగిలున్న దేశభక్తి  తో ఇది నా స్టేట్ కి పప్పుచారు లాంటిది అని వక్కాణించా .

 అయితే ప్రశ్నకుడు నా దేశభక్తి ని ఇంకాస్త పరీక్షించదలచి ..భారత దేశము నా మాతృభూమి ..భారతీయులందరూ నా సహోదరులూ నా ? అని అనుమానంగా అడిగాడు . మనకి తెల్సిన దేశభక్తి ఆ పద్యమేకదా .. దాంట్లో ఉత్తర రామాయణం కి ఉన్నట్లు , లేడీస్ లో ఈ ప్రతిజ్ఞకి సవాలక్ష ప్రక్షిప్తాలున్నాయని తెలియని నేను అవును ..అవును ..అని కన్ఫర్మ్ చేశా ..ఇంతటి తో కధ అయిపోయుండాలి .  కానీ...  అప్పటి నుండి నాకోరిక ను పలుసార్లు విశ్లేషించుకున్నా . ఒకటి నా కోరిక ఏమిటి అన్నది అయితే, రెండోది ప్రశ్న అడిగిన మిత్రుడు అసలేం అడిగి ఉండొచ్చూ అన్నది ..

మొదటి విషయానికి వస్తే నాకు డిప్లొమా చివరి ఏడాది దాకా ఎలక్షన్స్ గురించి హడావిడి తప్ప క్రైసిస్ వస్తే ప్రధాన పార్టీలు రెండూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి అనుకొన్నా . ఆ సంవత్సరం ఎన్నికలు చక్కగా ఫాలో అయ్యి ఎన్టీఆర్  ని ప్రభంజనం గమనించాక ఆసక్తి వచ్చింది . మళ్ళీ అదే హడావిడి మా ఇంట్లో ఎన్టీఆర్ దిగిపోయాక మళ్ళీ చనిపోయాక  న్యూస్ లో చూసాం . ఈ మొత్తం లో ఎన్టీఆర్  అంత హఠాత్తుగా ఎలా చనిపోతారో నా బుర్రకు  అర్ధం కాలేదు . రెండో భార్య పై మన చుట్టుపక్కల ఉన్న అపోహలు  కూడా నా అనుమానానికి కారణం కావచ్చూ .. ఎన్టీఆర్ ది సహజ మరణం అని ఎవ్వరూ చెప్పడం లేదు కాబట్టి నా ఊహలకి బోలెడంత స్వేచ్ఛ.. సో తప్పకుండా దేవుడికి తెలిసి ఉంటుంది ..కానీ మనకి ఎలా తెలుస్తుంది ..అసంపూర్తి సినిమా చూసిన ఫీలింగ్ .. బహుశా అదే నా కోరిక గా మారి ఉంటుంది ..

ఇంకో ఆలోచన , ఒక కోరిక కోరుకో అని వఛ్చి అడిగింది దేవుడే నా కాదా అని తెలియాలి అంటే ..మరి నాకున్న డౌట్ ఆ దేవుడు తీర్చాలి కదా అన్న చిలిపి ఊహ కానివ్వండి ..కుతూహలం కానివ్వండి ... ఊహించుకున్నా దేవుడు వఛ్చి ఎన్టీఆర్ విజువల్స్ చూపిస్తాడని ..హ హ .. అదేదో రాంగోపాల వర్మ ఎన్టీఆర్ సినిమా తీసి చూపిస్తున్నాడేంటి చెప్మా .
సినిమాలు చూసి ఊహించుకున్న వి మళ్ళీ అక్కడే వెతుక్కోవాలా ..హతోస్మి

మొత్తానికి అడుగుడి నీకివ్వబడును అన్నట్లుగా ,నా కోరిక కి ఒక సినిమానే వచ్చ్చేస్తుంది ప్పుడు ..రాంగోపాలవర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతొ ..సినిమా పుణ్యమా అని ఈ లోగా చాలా మంది కొద్దిగా వారికి తెలిసినవి మాట్లాడేరు .

ఉన్నవ నాగేశ్వర రావు గారు అనుకుంటా చెప్పారు..రామారావు గారికి అప్పటికి వంశం , వారసత్వం మత్తు తగ్గి వాస్తవాన్ని చూస్తూ(ఆస్తి ముందే రాసి ఇచ్చేసాక ప్రేమలు స్థానం లో పోటీలు ,పంతాలు సహజమే కదా  ) ..తన వారసత్వం లక్ష్మీ పార్వతికి ఇవ్వదలిచారు. వ్యక్తిగతం గా నాకు అభ్యంతరం ఉండకూడదు .. ఆమె పార్టీ కార్యకర్తా.. మరియు కాస్తో కూస్తో చదువు ఉంది . ఇక ప్రజలు ఓటెయ్యడానికి అయితే అవి సరిపోవు కానీ ... కోరికలు మానవ సహజం కదా . కాబట్టి రెండవ భార్య మాత్రం చంపలేదు . మరియు దాదాపుగా వారిది సహజ మరణం . ఇక చంద్రబాబు ని పార్టీ నమ్మింది అంటే యుద్ధం లో గెలిచాడు . బాబును ప్రహ్లాదుడు అనుకుంటే సరిపోతుంది .


ప్రశ్న అడిగిన మిత్రుడు అసలేం అడిగి ఉండొచ్చూ అంటే బహుశా లైఫ్ పార్టనర్ గురించి అయి ఉండొచ్చూ నేను తర్వాత అడగలేదు ఆ సమాధానం ఇంకో టపా లో వ్రాస్తాను ..


కొసమెరుపు 1 : మా బాచ్  వచ్ఛే టైం కి eCET  EXAM నిలిపివేయాలనుకుంటున్న తరుణం లో కొన్ని సమ్మెలు చేసి ఉన్నాము . అప్పుడు కాదా నాకు కాస్త రాజకీయ జ్ఞాన్ కలిగించి లెక్చరర్ వెంకట్రావు గారు మాకో సలహా ఇచ్చ్చారు . ఈయన బ్రాహ్మణ కులానికి చెందిన వారు కాబట్టి స్వతహాగా రామారావు ద్వేషి , కానీ లౌక్యం తెలిసిన వారు .మా అందరికి సలహా ఇచ్చ్చారు . లక్ష్మీ పార్వతి కి తలా ఒక కార్డు వ్రాయండి, ఆమె పరిష్కరించగలదు రికమెండ్ చేసి అని . అప్పటికే ఆవిడపై వ్యతిరేక ప్రచారం మొదల్య్యిందనుకుంటా కాబట్టి ముందు ఆవిడ ని తిరస్కరించదలిచినా అందరం లెటర్స్ వ్రాసాము . బహుశా చూశారేమో .. తెలియదు కానీ కొద్దీ పాటి సవరణలతో eCET ఒక పది నెలల తర్వాత నిర్వహించారు . ఉత్తరం వ్రాసాము కాబట్టి ఆమెను గౌరవించడం నా బాధ్యత అనుకొంటున్నాను . అలాగే ఆమె కి ఉన్న విలువ ని కూడా ఆ సందర్భం గుర్తు చేస్తుంది .

కొసమెరుపు 2 :  ట్రిప్ లో కర్నూలు లో ఆగినప్పుడు ఒక చిన్న హోటల్ లో ఇడ్లీలు తిన్నాం . ఈ ఇడ్లీలు మాత్రం బహు రుచి గా ఉన్నాయి చట్నీ ని మరిపించేలా ..పువ్వులాంటి ఇడ్లీలు మళ్ళీ తినాలి :-)