30, ఏప్రిల్ 2013, మంగళవారం

బ్లాగు వ్యాఖ్యల కధ


చాలా మంది  వాదనకు భయపడి అసలు అభిప్రాయాలు ఉన్నా వ్యక్త పరచడం మానేస్తున్నారు అని, ఇంకొందరు అజ్ఞాత ఆప్షన్ లేక  , ఆఫీసులో గూగుల్ ఓపెన్ అవ్వక వ్యాఖ్యానించడం లేదని చెప్తారు . మరి అయితే మాట్లాడేవాళ్ళు ఎలా ఈ అవరోధాలు దాటి వస్తున్నారు అన్నది సమస్య . వ్యాఖ్యానించ  దలుచుకొన్నవారు ఇలా ఎలా మౌనమ్గా ఉంటారు ? అది మనసుకి ముసుగు వెయ్యడమే కదా. మనసుకు ఇష్టం  లేకపోవడం వేరు , ఇష్టం ఉంది ముసుగు వెయ్యడం వేరు . ఇది మన భ్రమే కావచ్చు. నిజంగా వ్యాఖ్య వ్రాసేంత  బలమైన అభిప్రాయం ఉండకపోవచ్చు . మనకెందుకొచ్చిన గోల అనుకోవడం అసలు కారణం . ఒక వ్యాఖ్య   చర్చలోకి మళ్ళితే ఎక్కడ/ఎప్పుడు తేలుతుందో , అలా ఆ వ్యాఖ్యలన్నీ అనుసరించడం లో  బోలెడు సమయం వృధా అని చక్కని వ్యాఖ్యాతలు మవునం వహిస్తున్నారా అన్న అభిప్రాయమే చాలా రోజులు ఉంది . ఇదే ప్రశ్నను 'జాజిమల్లి' బ్లాగర్ మల్లీశ్వరి  గారిని అడగ్గా ఇలా సమాధానం చెప్పారు .
వ్యాఖ్యలు కానీ టపాలు కానీ ఎవరి ఉద్వేగాల బలాన్ని బట్టి వారు స్పందిస్తారు. ఎన్ని రాజకీయాలున్నా అది ఊపిరాడ నివ్వదు

ఇక నొ. కా బ్లా స అని , గుం  వ్యా కా స అని  రక రకాల వ్యాఖ్హ్యాల సంఘాలు పేర్లు వచ్చాయ్ . ఇందు మూలంగా నో కా బ్లాస అధ్యక్షులు అర్ధం చేసికోవాల్సింది ఏమిటి అంటే , పలానా వ్యాఖ్యాతల  ఉద్వేగాలను మీరు టచ్ చెయ్యడం లేదు, చాలా సాఫ్ట్ గా సున్నితంగా వ్రాసిన టపా  నేమలీకతో వ్రాసిన వెన్నలా చల్లగా మనసులోకి వెళ్ళింది కాని వుద్వేగంలా తిరిగి  రావడం లేదు అని .

ఇక గుం  వ్యా కా స హడావిడి చూసి డిప్రెషన్ కి వెళ్ళడం ఇష్టం లేని ధైర్యవంతులయిన రచయితలు మాకెందుకు వ్రాయరు వ్యాఖ్యలు అని యుద్ధం చేస్తారు . ఖచ్చితం గా చెప్పాలంటే సింగిల్ గా ఉన్న వారు ఐ యాం సింగిల్ , రెడీ టు  మింగిల్  అని అనౌన్స్ చేసినట్లుగా. అప్పుడు ఆ సింగిల్ ఈజీ టార్గెట్ అని కన్ఫర్మ్  అవ్వుద్ది , ఎవరయినా  పని చూసుకోవడానికి ప్రోసీడ్ అవుతారు. ఇలా అనడం  ఎందుకంటె అభిప్రాయం అనేది చిన్నదో పెద్దదో ఉద్వేగం  రావాలి కాని ఇలాంటి రిక్వెస్ట్ లు ఫేక్ వ్యాఖ్యలనే తెచ్చి పడేస్తాయి . 

మనం టపా వ్రాసినపుడే సంతృప్తి వస్తుంది . వ్యాఖ్యలు ప్రోత్సాహం అయితే ఏ వ్యాఖ్య లేకుండడం, లేదా తక్కువ ఉండడం  అంతకన్నా శుభం , మీరు ముఖ స్తుతికి తేలిగ్గా  పడిపోరనీ , గుంపులు గోవిందయ్యలుగా ఉండరనీ  కన్ఫర్మ్ చేసిసికున్నారన్న మాటే . కాబట్టి పండగ చేసుకోవాలి కాని నొచ్చుకోవచ్చునా !!!

16 కామెంట్‌లు:

  1. సమాజ స్తితిని బట్టే వ్యక్తుల స్తితి ఉంటుంది. వ్యక్తుల చైతన్యం మేరకే వారి చేష్టలు - వ్యాఖ్యలు ఉంటాయి.

    వాస్తవ ప్రపంచమైనా, వర్చ్యువల్ ప్రపంచమైనా ఒక్కరోజులో మారదు.

    ఎక్కడైనా చేయాల్సింది పోరాటమే తప్ప ఫలాయనం కాదు.

    అంతా బాగుంటే బాగు చేయాల్సిన అవసరం ఏముంటుంది మౌళి గారు?

    స్పందించడం ఆపితే ఆగేది కాదు.

    స్పందించడం ఎలా? అనేది నేర్పాలి-నేర్చుకోవాలి. ఇది నిరంతర ప్రక్రియ.

    రిప్లయితొలగించండి
  2. నేను నొచ్చుకోవడం మానేసి చాలా నెలలు అయ్యింది ,ఇతరుల కామెంట్ లని ఆశించి వ్రాయడం ఎప్పుడో మానేసాను . అలాగే స్పందించడం అంటే స్పందించకుండా ఉండలేకపోవడం నా బలహీనత . ఈ వ్యాఖ్య తో సహా . :)

    రిప్లయితొలగించండి
  3. Vyakhyalanu kaachi vadaposaaru!Rangamlo nilichinavaadiki poolato paatu raaloo padocchu!So we ought to take it easy!!

    రిప్లయితొలగించండి
  4. @ కొండల రావు గారు


    పోరాటమా కాదా అన్నది చేస్తున్నప్పుడు తెలియదు, ముగిసాక తెలియకపోయినా పర్వాలేదు . ఆలోచన, అభిప్రాయం పంచుకోవాల్సిన చోట పోరాటం చెయ్యాల్సి రావడం తప్పకుండా బాధిస్తుంది. సమాజమే ఇలా వ్యక్తులని పోరాటం వైపు తోసేస్తుంది మళ్ళీ, పోరాటాలపై విమర్శలను ఎక్కుపెడుతుంది.

    థాంక్యూ.

    రిప్లయితొలగించండి
  5. @ వనజవనమాలి గారు


    నిరంతరం ఎవరో ఒకరు నొచ్చుకుంటూనే ఉంటారు.ఇంకొందరు వ్రాయలేకపోవడాన్ని అందుకు పురికొల్పే పరిస్థితుల్ని తలచుకొని బాధ పడతారు . అది వాళ్ళ తప్పు కాదు. కాని నిజంగా వ్యాఖ్యలు ప్రోత్స్సాహం ని ఇస్తే , ఎప్పుడు వ్రాసినా వ్యాక్యాల బాక్స్ నిండిపోయే బ్లాగర్లు వ్రాయడం పై ఆసక్తినే కోల్పోయారు ఎందుకు ? అలాగని వారు బ్లాగులకు దూరంగా వెళ్ళింది లేదు రోజూవ్యాఖ్యానించడం చదువుతూనే ఉన్నారు . ఇంకొందరు తరచూ వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు . ఎందుకంటె కొందరు ఇలా ఫేక్ పొగడ్తల మధ్య నిజమైన వ్యాఖ్యాతలకి దూరం అయ్యారు. తర్వాత వారు రచనకి కూడా దూరం అవ్వడం ఒక వరుసక్రమం లో భాగమే . ప్రోత్సాహాన్ని ఇచ్చేది వ్యాఖ్యలు కాదు సంకల్పం కూడా .

    స్పందన ఎప్పుడూ బలహీనత కాదు , ఆలోచనను ప్రపంచానికి చూపే బలమైన ఆయుధం . బలహీనత అనుకొన్నపుడు అవసరంలేని వాటికి వాడబడుతుంది , ప్రయోజనాన్ని కోల్పోతుంది . బలంగా ఉపయోగించుకుంటే ప్రయోజనాన్ని తెచ్చిపెడుతుంది.


    థాంక్యూ.

    రిప్లయితొలగించండి
  6. @ A. Surya Prakash గారు

    కాచి వడ పోసినట్లుగా ఉందా, థాంక్యూ. ఈ టపా వ్యాఖ్యానించడం గురించే , వ్యాఖ్యలను ఎదుర్కోవడం గురించి కాదండీ . మీరు ఇంకా పైన కొండలరావుగారు చెప్పినట్లు రాళ్ళ దెబ్బలు తగలకుండా ప్రతి అభిప్రాయం నిలబడాలంటే కష్టమే.

    రిప్లయితొలగించండి
  7. ఇంత "అర్థం" ఉందా వ్యాఖ్యల గురించి అని ఆశ్చర్యం వేసింది. హాయిగా చదివేసి, మనసు స్పందిస్తే, ఇష్టంతో ఒక ఉత్సాహపరిచే వ్యాఖ్య రాస్తే ఎంతో సంతోషం కదా వాళ్ళంత తీరుబాటు చేసుకుని రాసినందుకు. వ్యాఖ్యలు రాయడం తప్పనిసరి అని ఎక్కడా, ఎవరూ ఏ బ్లాగులోనూ పెట్టలేదే. అందరూ సరదాగా, ఉపయుక్తమైనవి మటుకే అభిప్రాయాలుగా తెలిపితే బావుంటుంది కదూ.

    రిప్లయితొలగించండి
  8. స/సువిమర్శకవ్యాఖ్యలు మాత్రం ప్రోత్సాహాన్నిస్తాయి.

    రిప్లయితొలగించండి
  9. అనూ గారు ,

    టపాలో వ్రాసింట్లు గా వ్యాఖ్య ఉత్సాహ పరచడానికో ఇంకేదో కాదండి. వ్యాఖ్యాతలే ఉత్సాహ పడ్డ వారో, ఉద్వేగం పొందినవారో తమ అభిప్రాయాలు వెలువరిస్తారు. బ్లాగరు కోసం తీరుబాటు చేసుకొని ఎవరూ వ్యాఖ్యలు వ్రాయరు . వ్రాయకుండా ఉండలేని ఆలోచనే వ్రాయిస్తుంది .లేదా ఏదో ఒక అవసరం వ్రాయిస్తుంది . వ్యాఖ్య వల్ల ఆనందం ముఖ్యంగా వచ్చేది వ్యాఖ్యాతకే . అప్పుడప్పుడు మాత్రం రచయితకి సంతోషం కలుగుతుంది వ్యాఖ్య సాంద్రతను బట్టి .

    వ్యాఖ్య సరదాగా మాత్రమె ఉండాలనడం కరెక్ట్ కాదు, అది కేవలం నటన మాత్రమె అవుతుంది . ఏ వ్యాఖ్య ఉపయుక్తమో ఏదో కాదో నిజంగా మనం చెప్పలేము .

    రిప్లయితొలగించండి
  10. @ నాగస్వరం గారు

    ఒక వ్యాఖ్య సువిమర్సా కాదా అన్నది చేసిన వ్యాఖ్యాతకి, రచయితకి మధ్య అవగాహనను బట్టి ఉంటుంది కదా.
    వ్యాఖ్యల్లో సలహాలు ఉంటాయి , అప్పుడప్పుడు సమస్య ఉన్నపుడో , ప్రయత్నించి ఫలితాన్ని ఆసిస్తున్నపుడో ప్రోత్సాహం ఉంటుంది . కాని ప్రతివ్యాఖ్యా అదే అని చెప్పలేము .

    ఉదాహరణకి ఈ రెండు రోజుల్లో వ్రాసిన ఇంకో టపా కి వ్యాఖ్యలు లేవు, ఈ టపాకి నలగురైదుగురు స్పందించారు కాబట్టి ఇలాంటి టపాలను ప్రోత్సహించినట్లు , వ్రాయని టపాలని వద్దనుకొన్నట్లు అస్సలు కాదు .

    నాకు బాగా నచ్చిన బ్లాగరు అసలు వ్యాఖ్యలే రాణి ఒక మంచి టపా వ్రాయండి అని అడిగేదాన్ని , కాని వారి బ్లాగులో వ్యాఖ్యానించడం వ్యాఖ్యాతలు తమకి మంచిదిగా భావిస్తారు కాబట్టి అది సాధ్యం కాదని తెలిసింది . ఇక్కడ కూడా ప్రోత్సహిస్తున్నట్లు కాదు .


    ఒక చెట్టుకి నిండా ఫలాలు ఉంటె తాళ్ళతో కొట్టి , లేక జాగ్రత్తగా అందిపుచ్చుకొని కొసుకొవదమొ చేస్తాము. ఆ చెట్టు కాయలు రుచిని ప్రసంసిస్తాము . అది చెట్టును ప్రోత్సహించడం ఎలా అవుతుంది అన్నది సందేహమే .కాయలు బాగున్నాయి, పనికోస్తున్నాయని కొట్టి వెయ్యకుండా ఉంచడం కూడా ప్రోత్సహించడం నా ?

    థాంక్యూ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అసలు విమర్శ అంటే పొగడ్త, తెగడ్త సకారణంగా చెప్పడం.
      బాగుంటే ఎందుకు బాగుందో కారణాలతో చెప్పడం.
      బాగులేకపోయినా అంతే.
      ఒక రచయిత వ్రాసిన విషయం పదిమందికీ ప్రయోజనకరమైతే
      తప్పక మెచ్చుకోవాలి.
      అది ఎలా ప్రయోజనకరమో చెప్పాలి.
      అప్పుడు అది సువ్యాఖ్య అవుతుంది.
      అది ఎవరినైనా కించపరచినట్లున్నా,
      కీడు కలిగించేదైనా కూడా తప్పక కలుగజేసుకొని, సున్నితంగా కారణాలు చెప్పాలి.
      వినడం వినకపోవడం రచయిత ఇష్టం.
      కానీ అతనికి విషయం తెలుస్తుంది.
      అదీ సువిమర్శే.
      మామూలు టపాలకు వ్యాఖ్యలు అనవసరం. అని నా అభిప్రాయం.

      కృతజ్ఞతలు.

      తొలగించండి
    2. వ్యాఖ్య ఒక అభిప్రాయం మాత్రమే .

      విషయం పదిమందికీ ప్రయోజనకరమైతే అన్నారు, అది ఏ పది మంది కి ? ఎవరు మెచ్చుకోవాలి? ఇలా వ్యాఖ్యల ని డిమాండ్ చెయ్యడం సరి కాదనే. పదిమందికి పనికొచ్చే రచన చేసిన వారు చూసేది వ్యాఖ్యల కోసం కాదు. ఆచరణ కోసం.

      పదిమందిని రెచ్చగొట్టేలా వ్రాసేవారు మాత్రం కోరుకొనేది వ్యాఖ్యలు. వీరిని, వీరి టపాలలోని గోల చూసి చక్కగా వ్రాసేవారు వ్యాఖ్యల సంఖ్యను పోల్చుకోవద్దనేది టపా సారాంసం.

      మామూలు టపాలని , వ్యాఖ్యలు ఏ టపాకి అవసరం, ఏ టపాకి అవసరం లేదు అని ఒకరు చెప్పడం పూర్తిగా హాస్యాస్పదం అవుతుంది.

      సువిమర్స, పొగడ్త తెగడ్త అని ఇన్ని ఉండవ్. వ్యాఖ్య అభిప్రాయం ,వ్యాఖ్యాత భావం, స్పందన. అది తీసికోగలిగిన వారు ప్రచురిస్తారు. లేదంటే లేదు . అజ్ఞాత వ్యాఖ్యల ఆప్షన్ పెట్టిన వాళ్ళు అజ్ఞాతలు లేమి వ్రాసినా గోల చెయ్యము అని ముందు అనుకోవాలి, లేదా ఆప్షన్ తీసి వెయ్యాలి , అంతే !

      ఓ పదిమందిని సెక్యురిటీ పెట్టుకొని ( రామ్ చరణ్ సెక్యూరిటీ లాంటి వాళ్ళు, వీళ్ళకి పెద్దగా విచక్షణా గట్రా ఉండవ్) మరీ అజ్ఞాత ఆప్షన్ ఉంచి అలా కూడా పొగడ్తలు మాత్రమె వ్రాయిన్చుకుంటూ ఉంటారు . అలాగే కొందరు మహాత్ముల టపాలపై కాని ఆలోచనలో తప్పులు చూపకూడదు. అలా చూపితే ఎవడో అజ్ఞాత వెధవ వ్రాసిన దాడి ని ప్రచురించేసి నిమిత్తమాత్రుడిలా నటించేస్తారు. అంతోటి దానికి వారి బ్లాగులో వ్యాఖ్యలు వ్రాయడం లేదని చదివేవాళ్ళని ఎత్తి పొడవడం ఎందుకో . ఇదిగో ఇటువంటి రచయిత లకి సమాధానం గా కూడా ఈ టపా అన్నమాట .

      తొలగించండి
  11. మంచి చర్చే పెట్టారు.
    టపాలు ప్రచురించడం మన చేతుల్లో ఉన్న పని. అనేక కారణాల చేత అదే పనిని సరిగ్గా నిర్వాహించలేం కొన్నిసార్లు. ఇక వ్యాఖ్యలనేవి మన చేతుల్లో లేని పని.
    ఇతరుల ఇష్టాయిష్టాలకి,సమయాలకి సంబంధించిన పని.దానిని మన పరిధి లోంచి తప్ప ఇతరుల పరిధిని ఆక్రమించి చూడకూడదని అనుకుంటాను.
    మన పోస్ట్స్ కి వ్యాఖ్యల విస్తృతి కొలత కాదు.
    ఇది సాహిత్యానికీ వర్తిస్తుంది.
    డెప్త్ కన్నా సర్ఫేస్ కి ఆకర్షణ ఎక్కువ.మనలో డెప్త్ పెరిగే కొద్దీ మన జ్ఞాన సమూహం చిన్నది అవుతుంది. అంతిమంగా ఒంటరులమయినట్లు అనిపిస్తుంది
    సత్యం వూరికే దొరుకుతుందా?చాలా సుఖాలను అది బలిగోరుతుంది.
    చూసారా స్పందించకుండా ఉండలేకపోయా....

    రిప్లయితొలగించండి
  12. అయితే ఏ వ్యాఖ్య లేకుండడం, లేదా తక్కువ ఉండడం అంతకన్నా శుభం ..

    మళ్ళీ కాపీ పెస్టే కానీ ...నాకిదే హేపీ..

    రిప్లయితొలగించండి
  13. @kvsv గారు

    టపా మొత్తంలో కాపి పేస్టు కి ఈ వాక్యమే దొరికిందా , మీరు టపా మొత్తం చదివే చెప్పారనుకుంటున్నా

    థాంక్యూ

    రిప్లయితొలగించండి
  14. malli గారు

    మా ప్రొఫెసర్ ఒకాయన రిజర్వుడ్ గా ఉండే అమ్మాయిని క్లాసులోని ఏడిపిస్తున్న అబ్బాయిల ముందు సపోర్ట్ చేస్తూ చెప్పారు ఒక్కొక్క స్నేహం తో నీ జ్ఞానం 10 శాతం తగ్గుతుంది అని , సమూహం చిన్నగా ఉండాలి అనీను.

    అప్పటి నుండి కొంటె అబ్బాయిలు తను కనపడగానే నాలెడ్జ్ మాకు వచ్చేస్తున్దనా మాట్లాడట్లేదు అని ఆటపట్టిన్చేవారనుకోండి.

    అవును సత్యం చాలా సుఖాలను బలికోరుతుంది,ఒంటరిని కూడా చేస్తుంది. అయినా బావుంటుంది అనుకుంటాను. టపాలో అడగలేని ప్రశ్నకు సమాధానం చెప్పారు. థాంక్యూ

    రిప్లయితొలగించండి