ఈ మధ్యకాలం లో అనుకోకుండా చదివిన రెండు పుస్తకాలు నిర్జన వారధి , వోడ్కా విత్ వర్మ. తెలుగు పుస్తకాలు చదవాలి అని ఆసక్తి లేదు. కాని వివాహం లో ఆత్మాభిమానం గురించి, నాకు తెలిసిన ఒక మంచి జంట గురించి ఆలోచిస్తూ మొదట డాక్టర్ రమణ గారి టపా నుండి కొన్ని ప్రశ్నల కోసం అన్వేషణ మొదలయ్యింది. అదే రోజు అదృష్టవశాత్తు జాజిమల్లి గారితో ఇదే అంశాన్ని ప్రస్తావించే అవకాసం కలిగింది. నిర్జన వారధి గురించి నా ఆలోచనలు ఇక్కడ పంచుకొన్నాను .
వోడ్కా విత్ వర్మ అది ఒక పుస్తకమని నిన్నటి దాకా తెలియదు . ఏదో ఒక రివ్యు కంటబడింది. అది వ్రాసినది శ్రీ రమణ గారు కాదనుకుంటా. అందుకే రివ్యు కాస్త సిల్లీ గా అనిపించింది. క్రిస్మస్ సెలవులు కదా అలా గ్రేట్ ఆంధ్రాలో విహరిస్తూ ఎంబీయస్ గారి వ్యాసం చూడడం, వెంటనే పుస్తకం చదవాలి అనిపింఛి చదివేసాను. నాకయితే పుస్తకంలో ఎక్కడా వర్మ ని పొగిడినట్లు అనిపించలేదు. కొంచెం తిట్లు ఎక్కువ కనిపించాయి :) . అలాగే నా ఇష్టం పుస్తకం, అప్పట్లో నేనే ఫ్రీ కాపి సంపాదించి బ్లాగుల్లో , బజ్జుల్లో జానలకి షేర్ చేసికొన్నాను. నా ఇష్టం కి ఏ మాత్రం సంబంధం , పొంతన లేని పుస్తకం వోడ్కా విత్ వర్మ అవడం వల్ల ఆ పుస్తకం లా కేవలం హైప్, క్రేజ్ తో కాక చక్కని కంటెంట్ వల్ల బోలెడన్ని సార్లు ముద్రించ బడుతుంది . అయినా చదివే వారి దృష్టికోణాన్ని బట్టి మాత్రమె వారికి అంతవరకే అర్ధం అవుతుంది, ఈ పుస్తకం కూడా అన్ని పుస్తకాలు లానే.
నిర్జన వారధి కీ, వర్మ పుస్తకానికీ ఉన్న దగ్గరి సంబంధం బహుసా అందరికీ అనుభవం లోకి రానిదేమో. ఈ రెండింటి ఉన్న సంబంధం నాకయితే నచ్చింది. అచ్చు కొండపల్లి సీతారామయ్య గారి గురించి ఈ టపా లో నా చివరి వ్యాఖ్య లో ఉన్న నా అభిప్రాయం లానే , ఇంకొకరు ఇంచుమించు అదే విధం గా వర్మ వివాహం విషయం లో ఆయన కుటుంబ సభ్యులు ప్రస్తావించారు.
మిగిలిన భాగాలలో పుస్తకం పై నా అభిప్రాయాలు వ్రాయాలి. ఎంబీఎస్ గారికి చాలా చాలా ధన్యవాదములు, ఒక మంచి పుస్తకాన్ని చక్కగా పరిచయం చేసినందుకు.