ఈనాడులో తాజావార్త : "విజయవాడలో రేపు ప్రైవేటు ఆస్పత్రుల మూసివేత "
ఇదేంటబ్బా గత నెలరోజులుగా జరుగుతున్న సమైక్యాంద్ర ఉద్యమం మూలంగా బస్సులు లేక, ఆటోలు అందకా ఎప్పుడో మూసివేసారుగా చాలా ప్రైవేట్ క్లినిక్కులు అని సందేహం వచ్చింది. ప్రస్తుతం ముందే డబ్బులు చెల్లించిన వారు ట్రీట్మెంట్ కోసం ఎదురు చూస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి. ఫోన్ చేస్తే పలకదు , అక్కడెవరూ లేరని నిర్దారించేసుకొని వాళ్ళే మల్లి ఫోన్ చేసే వరకు గోళ్ళు కొరుక్కుంటూ కూర్చోడమే (డెంటల్ ప్రాబ్లెమ్ అయితే ఆ ఆప్షన్ కూడా ఉండదనుకోండి ) .
ఇప్పుడు అఫీషియల్‌గా పెద్ద పెద్ద కార్పోరేట్ హాస్పిటల్స్ కి కూడా గిరాకీలు తగ్గిపోయాయి కావచ్చు. పోష్ గా ఉంటుందని సమైక్యాంద్ర కి మద్దతుగా అని కూడా చెప్తున్నారు.లేదంటే ఆంధ్రాకి కొత్త రాజధాని వస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ బిజినెస్ దెబ్బతింటుందేమో ?
ఒక్క ఆర్టీసీ బందు, ఇన్ని తప్పనిసరి బందులను తెస్తుందా అని బోలెడంత ఆశ్చర్యం వేసింది.
ఆర్టీసీ ఎందుకు బంద్ చేస్తోంది అంటే వాళ్లకి కి వచ్చే ఆదాయం లో సింహభాగం తెలంగాణా /హైదరాబాదు నుండే వస్తున్నది(ట ). మనకి కూడా రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ కి బస్సు/టోల్ చార్జీలు పెరిగిపోతాయి. అలాగే తెలంగాణా, హైదరాబాదుల్లో ఉన్న ఆంధ్రులకి కూడా స్వగ్రామం వచ్చి వెళ్ళడానికి ఖర్చులు పెరుగుతాయి కదా.
అయినా అప్పుడు హైదరాబాద్ కి ఎందుకు వెళ్తాం..హ్మ్ ఎయిర్పోర్ట్ కి అంటే తప్పదు . త్వరగా ఆంధ్రా కి (లేదా సమైక్యం లో మా ఆంధ్రా కి )ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేస్తే బాగుణ్ణు. ఇంకేమున్నాయబ్బా హైదరాబాదు లో !!!!
బంధువులు ఉన్నారు కాని , వాళ్ళే చక్కగా ఊర్లకి రావాలి కాని మనమెందుకూ వెళ్ళడం . అదీ సంగతి సగటు ఆంద్ర పౌరుడికి హైదరాబాదుతో పనేం లేదు. అక్కడ వచ్చే ఆదాయం తో ఇక్కడ అభివృద్ధిగట్రా చేస్తారనుకోడం భ్రమ.
సమస్యలేమయినా ఉంటె గింటే ఉద్యోగులకే. దాచుకొన్న సేవింగ్స్ అక్కడ హైదరాబాదులో ఇన్వెస్ట్ చేసిన వుద్యోగులకయితే ఇంకాస్త కష్టమూ. అయినా ఏదయినా స్థలం కొనుక్కునే ముందు, దేశం లో ఎక్కడయినా కాని పనికొస్తుందా లేదా అని చూడకుండా రేటు పెరుగుతుందని మాత్రమే కొనడం శాడిజం క్రిందకి వస్తుంది . దాని వల్ల ఇప్పుడు భూముల అసలువిలువ లెక్క కట్టడం మానవ మాత్రులకి సాధ్యం కాదు. సామాన్యుడు ఈ పోటీలో కాస్తంత చిన్న గూడు కూడా కట్టుకోలేడు . పంట పండించే రైతుకూలీ కి పొలం దొరకదు.