రెండు కధలు ఒకటి 'ఐదో గోడ', రెండవది 'తన్హాయి'
ఒకటి వివాహం తర్వాతి వివాహమైతే , రెండవది వివాహం లో వివాహం ఇంకా రెంటిలోనూ స్త్రీ మానసిక ఒంటరితనం ప్రధాన అంశం. రెంటి మధ్య భేదం ఒకటి భర్త లేని స్త్రీ కధ ఇంకొకటి భర్త ఉన్న స్త్రీ సంఘర్షణ.
జీవతపు చివరి మజిలీ లో ఒక స్త్రీ కి తోడు భర్త కాలేని సందర్భాలు కోకొల్లలు. వైస్ వెర్సా కూడా కాదనలేని నిజం. కాని స్త్రీ విషయం లో ఏదయితే అత్యంత అసాధ్యమో , పురుషునికి మాత్రం సులభ సాధ్యం. మామూలుగా ఉదార స్వభావులైన ఒక అన్న కాని తమ్ముడు కాని తన తన సోదరి విషయంలో ఇలాంటి తోడు గురించిన ప్రస్తావన ని నీచమైన ఆలోచనగా చెప్పడమే కాక , అది తమ సోదరిని అవమానించడం కాక ఇంకేది కాదని బెదిరించడం కేవలం పురుషాధిక్యత గా భావించలేను. అంతకు మించిన స్వార్ధం ఇంకేదో ఉండాలి, మేల్ ఈగో ఇంత వికృతం గా ఉంటుందా ! తాము ఊహలో కూడా విని భరించలేని ప్రస్తావన గా భావిస్తుంటే
ఇంకొక షాక్ స్త్రీ ఇది తనకు అవసరం అని తెలిసినా సమాజం దాన్ని ఎలో చూస్తుందో అలానే తను మాట్లాడాలని ప్రయత్నించడం.. సరే చాలాకాలం తర్వాతా ఇది 'ఐదో గోడ ' సమస్య లా కనిపించింది. నేను అర్ధం చేసికోవడం వల్ల మారదు ..కాబట్టి ఆ కధ ఇంకొకరికి చెప్పాలి. అప్పుడు నా గొంతుకి తోడూ దొరకొచ్చు కదా ! దగ్గరలో అమ్మ దయ చూపించింది . మా అమ్మ, తమ్ముడు కూడా నాకోసం కధ చదివారు.
అమ్మకి కధ.. కధ గా బాగుందనిపించింది కాని రచయిత్రి చివరిగా శారద తో అడిగించిన లాంటి ప్రశ్నలు చాలలేదు . శారద ఇంకా స్పష్టం గా ప్రశ్నలు అడగాలి అని అమ్మ మాటల్లో అర్ధం అయ్యింది. అప్పటి దాకా బాగుందనిపించిన కధ (బాగుంది అనడం లో సందేహం లేదు ) చాలలేదు. ఇదే కధ సమాజం ను ఎదిరించలేని స్త్రీ కోణం లో ఎలా అర్ధం చేసికోవడం? కధ ఆశించిన ప్రయోజనం ఏమిటో చూస్తే , ఏ లోటు లేని ఒంటరి స్త్రీ సమాజాన్ని యెంత ఈజీ గా ఎదిరించగలదో చెబుతుంది . మనం శారదని అర్ధం చేసికోవడమే కాక అభినందిస్తాము. కాని జీవిత భాగ స్వామి లేని, ఆర్ధిక స్థిరత్వం లేని స్త్రీకి ఈ కధ కాలక్షేపమో , కలో మిగుల్చుతుంది. కాబట్టి వాళ్లకి శారద కూతురు ఆర్తి చెప్పినట్లుగా బ్రతకడం లోనే సంతోషం కనిపిస్తుంది. ఇంకో మార్గం లేదు . ఈ కధ కూడా ఆ రంగులు దాచేసింది.
కధ చివరిగా సమాజం లో కాస్త చైతన్యాన్ని తెస్తుందన్న మాట నిజమే అయినా విద్యాధిక , సంపన్న స్త్రీల గురించి మాత్రమే అనిపించడం సబబెనా ?
అయితే మిగిలిన వాళ్లకు ఇదే సమాజాన్ని ఎదిరించే ధైర్యం ఎలా వస్తుంది ?
'తన్హాయి' కూడా అదే పంధా కాని ఏస్థాయి స్త్రీ కయినా సులభంగా అన్వయిన్చేసికోవచ్చు . ఇవి తాత్కాలిక సంబంధాలు, సమాజం లో చాటుగా ఉంటాయి. కాబట్టి ఏ స్థాయి స్త్రీ అయినా కావాలనుకుంటే ఎదిరించి ముందుకు పోగలదు . కాబట్టి సమాజం శారద ల కన్నా తన్హాలనే ప్రోత్సహిస్తుంది . మానసిక ఒంటరితనం లో ఉండి కూడా ఇటు శారద , అటు తన్హా అవలేని వాళ్ళే శారద కూతురు ఆర్తి ఊహల్లో ఉన్న స్త్రీ మూర్తులా !!!