18, డిసెంబర్ 2015, శుక్రవారం

'శతపత్రసుందరి' భావమేమి తిరుమలేశ్వరీ !

నా బుర్రని ఒకరోజు అదేపనిగా తొలుస్తున్న ప్రశ్నలకి సమాధానం వెతుకుతూ ,  ప్రశ్న అడుగుదామని టపా మొదలుపెట్టి .. నాకు తోచిన సమాధానమూ వెతుక్కున్నాను. కాదుస్మీ  అనో నిజమేనుస్మీ అనో ఎవరో అంటారని పెద్ద ఆశ  లేకపోయినా ఏంటో చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ బ్లాగు తెరిచాను కదా ..వారానికో పక్షానికో ఉన్నట్టుండి గుర్తుకు వస్తోంది .. అలా నిన్న ఇంకోసారి వచ్చి చూద్దును కదా, పోయిన నెలలో ఒక నాలుగు వందల క్లిక్కులు ఉన్నాయి, కుసింత బావుంది. కాని ఇంక చేసేదేముంది అని క్లోజ్ చేసి వెళ్లి ఉంటే కధ  మరోలా ఉండేది. సరే మనం ఇప్పుడే ఇటు చూస్తున్నాం, నా బ్లాగ్ రోల్ ఉన్న నా ప్రియమైన బ్లాగర్లు సంగతో ! అలా వెళ్లి చూద్దును కదా జాజిమల్లి గారి బ్లాగు వారం క్రితమే అప్డేట్ కనిపిస్తోంది .

అలా వెళ్లి జాజిమల్లి గారి బ్లాగులో 'సంగమాలు సంగరాలు అవుతున్న వేళ '  అని వారి వ్యాసం ఒక కధ  గురించి , ఆ కధేంటో అనికూడా పెద్దగా ఆలోచించలేదు. సరే చూద్దాం సమీక్షలు ,అదీ సాహిత్యం లో అంటే  మనం  మాట్లాడం కాని సారంగ లాంటి ఒక వెబ్ పత్రికలో వఛ్చిన వ్యాసం చూడొచ్చు అనిపించింది . అదీ ఈ మధ్య నాకు కల్పనా రెంటాల గారి రెండు కధలు నచ్చిన సందర్భం నుండి అన్నమాట .


 ఎ.కె. ప్రభాకర్ గారు ఎంత గొప్ప సమీక్షకులో నాకు తెలియదు కాని ఆద్యంతం  ఆసక్తి కలిగించేలా వ్రాసారు. మొదటి పారాగ్రాఫ్ లో అది ప్రముఖ 'జాజిమల్లి' బ్లాగరు మరియు రచయిత్రి జాజిమల్లి గారు వ్రాసారని తెలిసింది. జాజిమల్లి గారు నా అభిమాన రచయిత్రి అని చెప్పలేను ఎందుకంటే వారి చాలా  రచనల్ని నేను ఇలా ప్రభాకర్ గారిలాంటి చేయితిరిగిన విశ్లేషకులు చెబితే తప్ప నా స్పందన ని వ్యక్తపరచడం కూడా చేతకాదు . అంత  చిక్కని రచనల్ని పొరబాటున చిలికామా ..ఇక అంతే అలా అలా విహరిస్తూ తప్పిపోతాం. 

రెండవ పేరా లో కధ  క్లుప్తం గా చెప్పారు , కొద్దిగా చూడగాని కధ కాస్తా  ఠకీమని గుర్తొచ్చింది. ఎప్పుడో అలా ఒకటి రెండుసార్లు  చదివి  అదుగో పైన చెప్పినట్లుగా బుద్దిగా ప్రక్కకి తప్పుకున్నట్లు ఉన్నాను. ఇప్పుడు ఈ వ్యాసం చదవడం వల్ల కల్పనా రెంటాల గారి రెండు కధలు లో నేను వెతుకుతున్న ప్రశ్నల కి జవాబో లేక ఇంకొన్ని ప్రశ్నలో ఈ కధలో ఉన్నాయనిపించి ఇంకాస్త ఆసక్తి గా అనిపించింది. 


అలా వ్యాఖ్యలు చూడాలన్న ఆసక్తి కలిగింది. కాని అక్కడెవరో కధ  ని ఒక స్త్రీ రచయిత వ్రాస్తున్న స్పృహ కలిగింది అన్నారు. ప్రభాకర్ గారు అంతగా  వర్ణిస్తూ ఉన్నప్పుడు కలిగిన స్పృహ ఇది అని చెప్పవచ్చు. ఎందుకంటె సదాసివ నిజానికి ఆప్షన్ ఇచ్చినట్లుగా లేదు. ప్రభాకర్ గారి విశ్లేషణతో నడుస్తూ నేను కూడా ఆలోచించాను. అది కేవలం నీలవేణి ని సమర్ధిస్తూ అల్లిన కధా అని. ఇదే అనుమానం కల్పనా రెంటాల గారి 'కల్హార' గురించి కూడా అప్పట్లో వచ్చింది. రచయిత్రి కల్హరని సమర్ధించ దానికే ఆమె భర్తలో తప్పులు చూపించిందా అని. ఇప్పుడా అనుమానం లేదు. కావచ్చు కాకపొవచ్చు. లేదా అది కల్హార ఊహ కావొచ్చు . కాని అక్కడ కల్హార ని మనం గైడ్ చెయ్యం , అలానే ఇక్కడ నీలవేణి . బహుసా ఒక్కోసారి వాస్తవాలు కూడా ఇలానే మన నమ్మకాలతో పనిలేకుండా మనముందు కదిలి వెళ్ళిపోతాయి కావచ్చు 

వెనక్కి ముందుకి ఇంకోసారి కధ చూసాక, నీలవేణి అభిప్రాయాలు కేవలం కదా కల్పితాలుగా కాక ఆమె గమనానికి , వ్యక్తిత్వానికి సూచీలు గా స్పష్టం అవుతున్నాయి . అలా అని సదాసివ చెడ్డవాడు అని నీలవేణి కూడా చెప్పడం లేదు . కదా కేవలం యధాతధంగా అంతే  అనుకుంటే నీలవేణికి సదాసివ సమస్యను అర్ధం చేసికొని మార్గనిర్దేశం చెయ్యగల సామర్ద్యం ఉన్నట్లే తోస్తుంది. 

కాని నేను  ఇది కేవలం ఒక ఎగువ మధ్య తరగతి ,లేదా సంపన్న జంట కొచ్చిన ట్రయాంగిల్ కధలా చూడలేను . ఇక్కడ బార్ స్టూల్ ని తన్నితే కింది తరగతి  సదాసివ ఉత్త స్టూల్ ని ఉంటె దాంతో గలాసు ని తంతాడు. మంచోడు కదా పెళ్ళాం ని తన్నలేడు  మరి. 

ఇంకా ఇది కేవలం సహజీవనం అంటే పెళ్లి కి ఆల్టర్నేటివ్ గా ఉన్న సహజీవనం లో  కధే నా ? పెళ్ళిలో మాత్రం సహజీవనం ఉండదా ? పెళ్ళయిన జంటలలో ఈ ఘర్షణ ఉండకూడదా ? వాళ్ళు మాత్రం ఇలానే చర్చిన్చుకోకూడదా ? ఇంకా కధలో ఒక అంశం తీసికొని ఉండొచ్చు కాని ' బాదంకాయ కళ్ళపిల్ల ' ఒక లాప్టాప్ కావొచ్చు. 'లవ్లీ లాయరమ్మ' బాగా పనిచేసి సంపాదించే అవకాశమున్న కాంట్రాక్టు కావొచ్చు. ఇవి కూడా నీలవేణి ని ఒకమూలకి నెట్టివేయగలవు. అలాగే  గౌతమ్ . ఇక్కడే మగవాళ్ళ స్వభావ సిద్దమైన ఎత్తుగడలు బయటికి వచ్చేది. తమకున్న స్వేచ్చ ని అందరినీ ఉద్దరిస్తున్న ధోరణిలో చూపుతూ , అదే భార్య స్వేచ్చగా తన భవిష్యత్తుని మలుచుకోబోతే గింజుకులాట ని దాచుకోలేరు . సలహాలిస్తున్నట్లే ఆజ్ఞలు ఉంటాయి. ఇంకా సదాసివ చాలా నయం ..యెదొ కాస్త చానా మంచోడు ముందునుండీ ..ఒకటి  రెండు దారి విస్తరించడాలు, చివర్లో మెలిక వెయ్యడాలు తప్ప (స్వేచ్చ లో దారి తప్పడాలు ,మళ్ళడాలు అని వాడడం సరి కాదు)

నేనప్పుడు భరించాను కాబట్టి నువ్వూ భరించు అని నీలవేణి అనడం లేదు. నువ్వు చేసావు కాబట్టి నేనిలా అన్నది అక్కడ జరగలేదు. సదాసివ ప్రవర్తనలో ఆమెలో ఖాళీ ఏర్పడింది. అ ఖాళీ లోకి ఎవరో జోరబడితే సేద తీరుతుంది కాని తరిమికొడుతుందా ?

సహజీవనం లోనో లేక వివాహం లోనో మూడో మనిషో, మరొక ఆసక్తో తప్పకుండా చేరిపోతాయి. ఆ మూడో మనిషి పిల్లలు అయితే పర్లేదు. మరొక ఆసక్తి అయితే ఇద్దరికీ ఇబ్బందికలగని స్థాయిలో మాత్రమె ఉండేలా చూసుకోవాలి .లెకపొతె కల్హరాలు,నీలవేణి  లు ఊహల్లోనుండి నిజం లోకి వచ్చే ప్రమాదం !!!!


చివరిగా ప్రభాకర్ గారి కి చాలా ధన్యవాదాలు కధని మనసులోనికి తెచ్చినందుకు . నిన్నటినుండి చాలా ఆలోచనలు , వ్రాయగాలనో లేదో ..సమయమ్ దొరుకుతుందా అన్నది బుర్రలో ఒక ప్రక్క తొలుస్తు... అనుకోకుండా అవకాసం, కాస్త ఏకాంతం దొరికింది. హమ్మయ్య సంతోషంగా ఉంది ఇప్పుడు వ్రాసేక. ఇక చదువరులేమంటారో !

 



8 కామెంట్‌లు:

  1. మౌళి – శతపత్ర సుందరి https://jajimalli.wordpress.com/2015/12/18/%e0%b0%ae%e0%b1%8c%e0%b0%b3%e0%b0%bf-%e0%b0%b6%e0%b0%a4%e0%b0%aa%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%b8%e0%b1%81%e0%b0%82%e0%b0%a6%e0%b0%b0%e0%b0%bf/

    రిప్లయితొలగించండి
  2. what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me
    my youtube channel garam chai:www.youtube.com/garamchai

    రిప్లయితొలగించండి
  3. what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me
    my youtube channel garam chai:www.youtube.com/garamchai

    రిప్లయితొలగించండి
  4. good afternoon
    its a nice information blog
    The one and the only news website portal INS Media.
    please visit our website for more news updates..

    https://www.ins.media/

    రిప్లయితొలగించండి