30, డిసెంబర్ 2012, ఆదివారం

ఇంటికి వేసే తాళాలు చంద్రమతి మాంగళ్యమా

క్రిస్మస్ సెలవులకి ఇంటికి వచ్చిన అతిధుల హడావిడి తగ్గింది, ఒకసారి హారం తీసి చూద్దును కదా , వేడి వేడిగా చర్చలు. టాంక్ బ్యాండ్ పై విగ్రహాలప్పుడు బ్లాగుల్లో జరిగిన హడావిడి తో పోల్చుకుంటే ఇది  చాలా తక్కువ చర్చే !!! అయినా తీరిగ్గా నాలుగైదు టపాలు చదివేసరికి అక్కడ జరిగిన అత్యాచారం కన్నా ఇక్కడి అవగాహానాలోపం తో చేస్తున్న వ్యాఖ్యల పైన ఎక్కువ బాధ కలిగినది.   ఉదాహరణ కి :

 బ్లాగ్మిత్రులు ఒకరు  యువతుల వస్త్రధారణ , అత్యాచారాలను ప్రేరేపిస్తున్నదని  చెపుతూ ఇంటికి వేసే తాళం ని బట్టి ఇంటికి బధ్రత ఉంటుంది అని సెలవిచ్చారు. మాకు తెలిసిన కుటుంబం ఒకరు ఇండియా వెళ్ళేటపుడు ఇంటికి ముందు నాలుగు ,వెనక రెండు పెద్ద పెద్ద తాళాలు వేసి, అది చాలక ఒకరిద్దరు మిత్రులను రెండురోజులకోకసారి వచ్చి ఇల్లు చూసి వెళ్ళండి, పోస్ట్ క్లియర్ చెయ్యండి (అంటే అక్కడ ఎవరు లేరని తెలియకుండా ) అని చెప్పి, అప్పటికిని  గురి కుదరక వీలు చిక్కినపుడల్లా ఇంటి తాళాలు భద్రం గా ఉన్నాయా అని   ఆ మిత్రులకి ఫోన్ చేసి కనుక్కోవాలి.  తాళాల వాళ్ళ భద్రతా వచ్చే పనైతే సారూ , యెంత ఖరీదయినవైనా కొనుక్కోవచ్చు.

అయ్యా అప్పుడప్పుడు పలానా వూరిలో ఇళ్ళకు తాళాలు  వెయ్యరు, ఇంటికి అసలు తలుపులే ఉండవు.. అక్కడ అస్సలు దొంగల భయమే లేదు ...ఆదర్శ గ్రామం అని తెగ వ్రాసి పడేసారే. అంటే ఆ ఊరిలో దొంగలు లేనట్లే కదా ?
మరి యువతులకు తాళాల గురించి నీతులు చెప్పడం లో పరమార్ధం దొంగలను తగ్గించడం ఇష్టం లేదనా లేక 'తమలో ఉన్న దొంగ' ని సంతృప్తి పరచడానికి పురుష సమాజం చేస్తున్న అరాచకపు వ్యాఖ్యలా ?


చాలా మంది విద్యార్ధులు పోరాటం చేస్తున్నారు, అమ్మ సోనియమ్మ ప్రత్యేకంగా బాధితురాలి త్యాగం వృధా పోదు అని హామీ ఇచ్చేసింది. ఈ చిత్తశుద్ది ఈ అమ్మాయిలకూ, ఆ అమ్మకూ  ఉంటె సంతోషమే. కాని అత్యాచారానికి గురి అయ్యింది ఒక మెడికో (కాలేజి విద్యార్ధిని), అదీ దేశ  రాజధాని అవడమే కాస్త అనుమానాలకు తావిస్తుంది. విద్యార్ధి , రాజకీయ సంఘాలు ఏకం అయ్యాయా?

అదే అత్యాచారం చేసిన అబ్బాయి  ఆ మెడికో విద్యార్ధి, చెయ్యబడినది ఆ మురికివాడల అమ్మాయి లు అయితే ఈ సంఘాలు బట్టలిప్పుకు తిరగడానికి ఇంత తొందర పడేవారా ??

2 వ్యాఖ్యలు:

 1. మీరు చెప్పినట్టే ఇంటికి తాళాల గురించి చర్చిద్దాం.
  అసలు తలుపులకు తాళాలు ఎందుకు వచ్చాయి అంటే తెరిచి ఉంటే దొంగలు పడతారు అని, అదే విధంగా ఈ ఘటన.

  ఇక మీ తరువాత ప్రశ్న మంచి బట్టలు వేసుకుంటే అత్యాచారాలు ఆగిపోవు పైగా అత్యాచారాలు జరుగుతున్నవి మంచి బట్టలు వేసుకున్న వారి మీదే అని, దీన్ని రెండు రకాలుగా ఆలోచించాలి(మీ తాళాల ఉదాహరణతో నే వివరిస్తాను)
  ఒకటి మా ఇంట్లో ఇన్ని నగలు ఉన్నాయి అని బయటకి చూపించి తరువాత ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు ధనవంతులు అని తెలుసుకుని పొరపాటున వారి ఇంటిని దోచుకోకుండా వేరే ఇంటిని దోచుకున్నారు అనుకుందాం మరి ఇప్పుడు తప్పు ఎవరిదీ దొంగ ఎలాగైనా దొంగతనం చేస్తాడు కానీ దొంగతనం ప్రేరేపించినది ఎవరు?
  తరువాత రెండవది ఆ నాగా నట్రా ఉన్న వాళ్ళ ఇంట్లోనే దొంగతనం జరిగింది అనుకుందాం వాళ్ళు చెబుతారా అంటే జంకే అవకాశాలు ఎక్కువే ఎందుకంటే అవి దొంగ సొమ్ము కావచ్చు లేదా ఇంకొకరి నుంచీ దోచుకున్న సొమ్ము కావచ్చు.

  ఇక్కడ నా ఉద్దేశ్యం ప్రేరణ చేయించిన వ్యక్తికీ నష్టం జరిగింది అని చెప్పే అవకాశాలు తక్కువ కాబట్టి మీ అభిప్రాయం నిజం అని మీకు అనిపించవచ్చు, అందరికీ చెప్పవచ్చు.

  ఇకపోతే మేము ఎప్పుడూ ఆడపిల్లది తప్పు అనలేదు, ఆ విష సంస్కృతీ నుంచీ బయటపడండి అని మాత్రమే కోరుకున్నం.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు gaaru

  @@ఒకటి మా ఇంట్లో ఇన్ని నగలు ఉన్నాయి అని బయటకి చూపించి తరువాత ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు ధనవంతులు అని తెలుసుకుని పొరపాటున వారి ఇంటిని దోచుకోకుండా వేరే ఇంటిని దోచుకున్నారు అనుకుందాం మరి ఇప్పుడు తప్పు ఎవరిదీ దొంగ ఎలాగైనా దొంగతనం చేస్తాడు కానీ దొంగతనం ప్రేరేపించినది ఎవరు?

  పక్కింట్లో దొంగతనం జరిగితే నగలు ఉన్నాయి అని చూపించిన వారిదేలా తప్పు అవుతుందీ? మీకు కావాలంటే మిగిలిన వాళ్ళు 'మా ఇంట్లో నగలు లేవు ' అని బోర్డు పెట్టుకొమ్మనండి అలా అయితే :) ( కుక్కలు లేవు బోర్డు లాగ )


  @@తరువాత రెండవది ఆ నాగా నట్రా ఉన్న వాళ్ళ ఇంట్లోనే దొంగతనం జరిగింది అనుకుందాం వాళ్ళు చెబుతారా అంటే జంకే అవకాశాలు ఎక్కువే ఎందుకంటే అవి దొంగ సొమ్ము కావచ్చు లేదా ఇంకొకరి నుంచీ దోచుకున్న సొమ్ము కావచ్చు.

  సమస్య ని వదిలేసి ఏదో చెపుతున్నారు. నిజానికి నా టపా మీరు సరిగా చదవలేదేమో, నేను చెప్పిన ఆదర్శ గ్రామం లో జనం వారి దగ్గర వున్నవి దాచుకోవాల్సిన పని లేదు. ఎవరూ చూడకూడదని బంగారు నగలు ధరించడం మానెయ్యారు! పక్కూరిలో దొంగతనం జరిగితే ఇంటికి తాళాలు వెయ్యని వీరిది తప్పు అనడం మూర్ఖత్వం అన్నది నా అభిప్రాయమండీ

  @ఇకపోతే మేము ఎప్పుడూ ఆడపిల్లది తప్పు అనలేదు, ఆ విష సంస్కృతీ నుంచీ బయటపడండి అని మాత్రమే కోరుకున్నం.

  విష సంస్కృతీ అన్నది మీ ఉద్దేశ్యం కావచ్చు. సరే నిజమే అయితే కేవలం ఆడపిల్ల గురించి మాత్రమె బాధ పడడం హాస్యాస్పదం. ఈ కేసులో ఉన్న మగ పిల్లలది కూడా జీవితమే, వాళ్లకి శిక్ష పడుతుంది. మగవాల్లెంతమంది చచ్చినా పర్లేదు అని మీరనకపోయినా , మగవాళ్ళు ఈ విధం గా చావడానికి ఆడపిల్లలని ఈజీ గా బాధ్యులని చెయ్యడం లేదూ ?? ఆలోచించండి

  ప్రత్యుత్తరంతొలగించు