30, డిసెంబర్ 2012, ఆదివారం

వన్ వే ట్రాఫిక్ లో భారతం

 అత్యాచారం, మాన భంగం ఇంకా రేప్ ఈ కాన్సెప్టు లో ఎన్ని టైటిల్స్ రావాలో అన్ని అలుపనేది లేకుండా వచ్చేస్తున్నాయ్ . కాని వాటిలో నిజం మాత్రం నేటి బీరకాయ చందమే.  అర్ధరాత్రి ఆడవారికి బయట పనేంటి అన్న మంత్రివర్యులు, ఆ ప్రశ్న అడగడం చాలా సంతోష దాయకమే, కాని సదరు మంత్రివర్యులు ఆ ప్రశ్న అడగవలసినది 'అద్దాన్ని' లేకపోతె మేడమ్  ని  అని మరిచారు. అవును ప్రభుత్వం సరిగా ఉంటే అర్ధరాత్రి ఆడవాళ్లకే కాదు, మగవాళ్ళకి కూడా అర్ధ రాత్రులు బయటకు వెళ్ళవలసిన పని లేదు. పాపం మనమంత్రివర్యులు ఉదారంగా మనకింత మాట సాయం చేస్తే మనవాళ్ళు హడావిడిగా శీర్షికలు పెట్టి ఆయనతే సారీ చెప్పించి బాగుపడే ప్రమాదం నుంచి మనల్ని రక్షించారు.

ఇంకా బోలెడుమంది విజ్ఞాన దాయక చర్చలు, స్త్రీ వస్త్రధారణ పై చేస్తున్నారు. చాలా సంతోషం. స్త్రీ వస్త్రధారణ మగవాడి మెప్పుకోసం చేస్తున్నట్లా ? చిన్న పాప గా ఉన్నప్పుడే అందమైన ఫ్రాకులు, అలంకరణలు చేస్తారే ? మగపిలవాడు పుడితే అయ్యో ముచ్చట్లేవీ  తీరడం లేదే అని మనసు కష్ట పెట్టుకుంటామే.

సరే దొంగలు వచ్చి కోసుకుపోతారే అని పబ్లిక్ గార్డెన్ లో పువ్వు లు వేయకుండా వదలమే. అలాగని మ్యుజియం లాగా కట్టుదిట్టం కూడా చెయ్యము కదా. ఏదో చిన్న కంచె, ఒక కాపలా దారుడు . ఆ మాత్రం రక్షణ వ్యవస్థ మనకు లేకపోయిందా. ఎవడో రెండు పువ్వు లు లాఘవంగా కోసేసాడు అని, అక్కడ పూల మొక్కలు వెయ్యడం మానేసారా లేక చుట్టూ ఎత్తైన గోడ కట్టారా? లేదా ఆ పువ్వులకు తెరలు కట్టారా లేదే..ఇంకాస్త అవగాహన పెంచాలని చూస్తాం ,ఆ పువ్వు ల అందాన్ని చూసి ఆనందించాలి . పర్మిషన్ లేకుండా కొయ్యకూడదు అని బోర్డులు పెడతాం. వీలయితే చెపుతాం.

ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి పుంఖాను పుంఖాను లుగా వ్యాఖ్యానించే మహానుభావులు, మగవారికి ఒక్క నీతి వాక్యమయినా  వ్రాయడానికి చేతులు రావడం లేదు అయ్యో . మనుషులుగా బ్రతకడం మొదలుపెట్టమని హితబోధలు ఎక్కడా లేవే. మిమ్మల్ని మీరు సంస్కరించుకోలేక, ఆడకూతుర్లని ఇల్లుదాటొద్దు అని బెదిరిస్తున్నారా, సిగ్గుపడాల్సిన విషయం. ఆ బస్సులో అత్యాచారం చేసిన అజ్ఞానులకు, ఈ జ్ఞానులకు భేదం ఉందా? వాలు పశువులు, అందంగా కనిపిస్తే రెచ్చిపోతారు మీ మొహాలకు మసిపూసుకోండి అని అడుక్కుంటున్నారా. సిగ్గులేదూ?

నిండు గా ఉన్న వస్త్రదారణ లోనే కాదు, వెతుక్కునే వాడు చెత్తకుప్పలోకూడా వెతుక్కుంటాడు . కాబట్టి సారు  మగవాళ్ళు  ఇంతే అని బెదిరించేముందు మీరు కుడా చెత్తకుప్పలో చేరుతున్నారు అని తెలుసుకోండి.

4 వ్యాఖ్యలు:

 1. అవును.
  ఆడవాళ్ళ మెడలో గొలుసు తెంపుకుపోతే, తప్పు దొంగది కాదు గొలుసు వేసుకున్న ఆడవాళ్ళది అన్నట్టు ఉంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. బొనగిరి గారు,

  మీరన్నది నిజమండీ. అలాగే ఒక రేపిస్టు ని తయారు చేస్తున్న మద్యం, సినిమాల గురించి మాట్లాడకుండా స్త్రీ వస్త్ర ధారణా పై మాత్రమె వచ్చే అభ్యంతరానికి విలువ లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మౌళి గారు,
  ఈ టపా చివరి లో నా ప్రస్తావన ఎందుకు వచ్చిందో నిర్ధారించుకోలేక పోయాను.. అలానే నేను ఈ విషయం గురించి ఈ మధ్య రెండు టపాలు రాశను. ఏ టపా వలన మీరు ఈ విధం గా స్పందిచారో కూడా అవగతమవ్వలేదు.
  ఆడవారికి సుద్దులు చెప్పకూడదని నేను నా చివరి టపా లో ఈ కింది వక్యం కూడా రాశాను, "అలానే మగ వారు కూడా, రేప్ చేసిన వాడిని వదిలేసి, ఆడ వారి దుస్తులనూ, ప్రవర్తననూ తప్పుపట్ట కూడదు.".

  ప్రత్యుత్తరంతొలగించు
 4. బొందలపాటి గారు,

  బురదగుంట అని మీరు సినిమాల ప్రభావం గురించి చెప్పినపుడు, కనీసం అప్పటి సినిమాలు జనంలో నుండే వచ్చాయి కదా అన్నది నా అభిప్రాయం. ముందు మీ బ్లాగ్ లింక్ ఒకటి పేస్ట్ చేసినట్లు ఉన్నాను. కాని టపా కి అనవసరం అనిపించింది, పేజికి చివరిలో ఉండడం వలన టపా పోస్ట్ చేసేప్పుడు నా దృష్టిని దాటిపోయింది. (మధ్యలో స్పేస్ ఉండడం వల్ల ఇప్పుడు కూడా ఒక పట్టాన దొరకలేదు). సారీ !

  మీ అభిప్రాయం మరొక్క సారి పంచుకొన్నందుకు ధన్యవాదములు

  ప్రత్యుత్తరంతొలగించు